న్యూఢిల్లీ : ఢిల్లీ మోడల్‌ను వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు ఆశుతోశ్ చెప్పారు. తాను రచించిన ‘ముఖోతా కా రాజధర్మ’ అనే పుస్తకాన్ని ఢిల్లీ అంతర్జాతీయ పుస్తక మేళాలో మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తొలుత పంజాబ్‌పై దృష్టి సారిస్తామన్నారు. 2017లో పంజాబ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో భారీఎత్తున బరిలోకి దిగుతామన్నారు. ‘రానున్న ఐదు సంవత్సరాల వ్యవధిలో రాజకీయాల్లో కచ్చిత ంగా ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం. పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాం. ఏదిఏమైనప్పటికీ ఢిల్లీని ఓ మోడల్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’ అని అన్నారు. ‘భారత్ మారిపోతోందని భావిస్తున్నా. అయితే రాజకీయాల్లో మాత్రం మార్పు రావడం లేదు. రాజకీయాలకు నేను తగనని మొదట్లో భావించేవాడిని. అయితే అది పొరపాటనే విషయం తర్వాత అర్ధమైంది. రాజకీయ నేతలకు నిజాయతీ నిజాయితీ ఉండాలనేది నా అభిప్రాయం ’ అని అన్నారు. కాగా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్... పంజాబ్‌లో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న సంగతి విదితమే.
దేశవ్యాప్తంగా ఢిల్లీ మోడల్
Published Tue, Feb 17 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement