న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో చీరుపుతో దుమ్ము దులిపేసిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని ఉవ్విళూరుతున్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మంచి వేదికగా మారుతోంది. తాజాగా ఐబీఎన్ -7 మేనేజింగ్ ఎడిటర్ అశితోష్ గురువారం ఆపార్టీలో చేరారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని అశితోష్ భావిస్తున్నారు.
చాందినీచౌక్ టిక్కెట్‌పై ఆయనకు పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు సమాచారం. ఈ హామీ మేరకే ఐబీఎన్ -7, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి అశితోష్ రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బద్ధ విరోధిగా ముద్రపడ్డ వారంతా.... ఒక్కొక్కరుగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గోద్రా అల్లర్లపై మోడిని.... జాతీయ స్థాయిలో ముప్పతిప్పలు పెట్టిన వారిలో అశుతోష్ ఒకరని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా ప్రముఖ నృత్యకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరిన విషయం తెలిసిందే.
'ఆప్'లో చేరిన ఐబీఎన్ -7 ఎండీ అశితోష్
Published Thu, Jan 9 2014 2:22 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM
Advertisement
Advertisement