
సాక్షి, బెంగళూరు : జర్నలిస్టును వేధించిన ఆరోపణల కింద ఓ సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల (సెప్టెంబర్) 27న శశిథరూర్ బెంగళూరు వచ్చి ఓ హోటల్‌లో దిగారు. దీంతో ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు ఓ మహిళా టీవీ జర్నలిస్టు అక్కడి హోటల్‌కు చేరుకున్నారు. ఆయన అనుమతి కూడా ముందే తీసుకున్నారు.
అయితే, ఆ హోటల్ ముందు ఉన్న సిబ్బంది మాత్రం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. లైంగికంగా తడమడంతోపాటు చేయి కూడా చేసుకున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సెక్యూరిటీ గార్డుల్లో ఒకరిని వేలాయుధన్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడిది మహదేవపురా అని తెలుసుకొని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment