మెట్ట గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాజా
తొండంగి : కోన ప్రాంతంలో దివీస్ బాధిత గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు
17న దివీస్ బాధిత గ్రామాల్లో జగన్ పర్యటనను విజయవంతం చేయండి
తొండంగి : కోన ప్రాంతంలో దివీస్ బాధిత గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు.బుధవారం ఆయన పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు ఇతర నాయకులతో కలిసి బెండపూడి, పి.ఇ.చిన్నాయపాలెం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న వై.ఎస్.జగన్ మోన్ రెడ్డితోపాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కలిసి తీరప్రాంత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. దీన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మద్దుకూరి వీరవెంకట సత్యనారాయణ చౌదరి, ముద్దకూరి వెంకటరామయ్య చౌదరి, మద్దుకూరి అప్పారావు చౌదరి, తొండంగి పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు, బెండపూడి హైస్కూలు విద్యా కమిటి ఛైర్మన్ బూసాల గణప తి, చిన్నాయపాలెం ఉపసర్పంచి దూళిపూడి ఆం జనేయులు, అడపా సూరచక్రం, కందబాబ్జి, దేవుల పల్లి శ్రీను, వడ్డి వెంకన్న, గర్లంకి బాబ్జి, గునిమానికల ఏసుబాబు, కటకం శివ, తదితరులు ఉన్నారు.