-
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తొండంగి :
దివీస్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22న నిర్వహించనున్న బహిరంగ సభను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. దివీస్ బాధిత గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 22న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యలో బహిరంగ సభ ఏర్పాట్లను రాజా శనివారం పరిశీలించారు. మండలంలోని దానవాయిపేట పంచాయతీ తాటియాకులపాలెం సమీపంలో బీచ్ రోడ్డు వద్ద బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించనున్నారు. ఎమ్మెల్యే రాజాతో పాటు పార్టీ సీనియర్ నాయకులు మాకినీడి గాంధీ, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, మేరుగు ఆనందహరి తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివస్తారని వారు తెలి పారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాల పార్టీ నాయకులంతా సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ శివకోటి ప్రకాష్, గాబురాజు, నాగం గంగబాబు తదితరులున్నారు.
భారీగా తరలిరావాలి
కోటనందూరు : గత 80 రోజులుగా 144 సెక్షన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న దివీస్ బాధితులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. మండలంలో కేఓ అగ్రహరం, లక్ష్మిపురం, కొత్తకొట్టాం, పాతకొట్టాం, కేఏ మల్లవరం గ్రామాల్లో శనివారం ఆయన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. దివీస్ బాధితులకు సంఘీభావంగా ఈ నెల 22న తొండంగి మండలంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరై మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, నాయకులు లగుడు శ్రీను, బొంగు ఉమారావు, చింతకాయల చినబాబు, వేముల రాజబాబు, కురసా మల్లయ్య, చింతల వెంకట చెల్లారావు, పైల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.