టెలికం శాఖ మాజీ మంత్రి రాజాకు సీబీఐ ప్రత్యేక కోర్టు 1700 ప్రశ్నలు సంధించింది. 2జి స్పెక్ట్రం కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేసే ప్రక్రియను సీబీఐ కోర్టు ప్రారంభించింది. ఇందుకోసం మార్చి 27వ తేదీనే మొత్తం 824 పేజీలతో కూడిన ప్రశ్నలను అందజేసింది. వాటికి రాజా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ రాజా వాంగ్మూలాన్ని సోమవారం ఉదయం నుంచి నమోదు చేస్తున్నారు.
ఇప్పటివరకు 2జీ స్పెక్ట్రం కేసులో 153 మందిని ప్రశ్నించి 4400 పేజీల వాంగ్మూలాన్ని కోర్టు నమోదుచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు గత సంవత్సరం ఏర్పడింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపులో రాజా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ఆడిటర్లు తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజా, కనిమొళి సహా నిందితులంతా ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్నారు.
824 పేజీలు.. 1700 ప్రశ్నలు
Published Mon, May 5 2014 12:33 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement
Advertisement