
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తీర్పు వెలువడగానే ఈ కేసులో ప్రధాన నిందితుడైన టెలికం మాజీ మంత్రి రాజా భార్య, కూతురు కోర్టులో కంటతడి పెట్టారు. ఈ కేసులో రాజా నిర్దోషి అంటూ పాటియాలా కోర్టు న్యాయమూర్తి సింగిల్ లైన్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరు ఆనంద భాష్పాలు రాల్చారు. అనంతరం రాజాను ఆలింగనం చేసుకొని బావోద్వేగంతో చూస్తూ బయటకు వెళ్లిపోయారు.
ఇక డీఎంకే అధినేత కరుణానిధి కూతురు ఈ కేసులో మరో నిందితురాలు కనిమొళి కూడా కంటతడి పెట్టారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో తమకు అండగా తమ వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని మీడియా ద్వారా చెప్పారు. దాదాపు రూ.లక్షా 70వేల కోట్ల విలువైన ఈ కేసులో రాజా, కనిమొళితోపాటు మొత్తం 17మంది డీఎంకే నేతలు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరంతా కూడా నిర్దోషులని కోర్టు ప్రకటించడంతో డీఎంకే పార్టీలో సందడి నెలకొంది. ఇక కనిమొళి సోదరుడు స్టాలిన్ స్వీట్లు పంచారు. కోర్టు బయట వారి మద్దతుదారులు చిందులు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment