patiyala court
-
కోర్టుకు హజరైన నటి, ఇంకెందుకు అరెస్ట్ చేయలేదంటూ కోర్టు సీరియస్
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నేడు ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరైంది. నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల డిల్లీ కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 10వ తేదీ వరకు కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరైంది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్, ఇతర పెండింగ్ దరఖాస్తులపై నేడు కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జాక్వెలిన్‌ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా ఆమెకు బెయిల్ గడువు పెంచోద్దని, లేదంటే తన సులభంగా దేశాన్ని వదలి పోతుందని ఈడీ కోర్టుకు ఆరోపించింది. తనకు డబ్బు కొరత లేదని, మేం జీవిత కాలంలో రూ. 50 లక్షలు కూడా చూడలేము.. కానీ ఆమె కేవలం తన విలాసాలను రూ. 7 కోట్ల వరకు ఖర్చు పెడుతుందని ఈడీ కోర్టులో పేర్కొంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరు ప్రస్తుతం జైలులో ఉన్నారని, మరేందుకు నటిని ఇంకా అరెస్ట్ చేయాలేదని కోర్టు ఈడీని ప్రశ్నించింది. అలాగే బెయిల్ విచారణ తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. -
నిర్భయ దోషులకు నేడే ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఏడు సంవత్సరాల మూడు నెలలపాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియ శిక్ష అమలుపై ఇక ముగియనుంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ అనే నలుగురు దోషులు బలిపీఠం ఎక్కడం ఖాయమైంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ఉరిశిక్ష వాయిదా పడగా మరోసారి స్టే విధించాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా గురువారం విచారించారు. ‘ఈ పిటిషన్ సమర్థనీయం కాదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాను’అని ప్రకటించారు. ‘ఈ కేసు కోసం న్యాయవ్యవస్థ ఎంతో సమయాన్ని వెచ్చించింది. చట్ట పాలనపై తలెత్తిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ప్రాంగణంలో హైడ్రామా చోటుచేసుకుంది. అక్షయ్ భార్య తనతోపాటు తన కుమారుడిని కూడా ఉరితీయాలంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. రేపిస్టు భార్యగా జీవించలేకనే విడాకుల కోసం పిటిషన్ వేసినట్లు తెలిపింది. నిర్భయ తల్లి వ్యాఖ్య తన కూతురి ఆత్మకు ఇక ప్రశాంతత లభిస్తుందని ఈ తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. ‘దోషులకు ఇక ఉరి తప్పదు. నాకు ఇప్పటికి శాంతి దొరికింది’అని తెలిపారు. దోషి అక్షయ్ భార్య విడాకుల కోసం పెట్టుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.ఢిల్లీకి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని(23) 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురై దాదాపు 15 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దురంతానికి నిర్భయ ఘటనగా పేరుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు మైనర్. మరొకరు జైలులోనే ఉరి వేసుకున్నారు. మిగిలిన నలుగురు ముకేశ్(32), పవన్(25), వినయ్(26), అక్షయ్(31) అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు. -
నిర్భయ కేసు : ఉరి అమలు ఆ ముగ్గురికే..!
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత నెలకొంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు మేరకు నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మకు ఫిబ్రవరి 1న మరణ దండన విధించాల్సి ఉంది. అయితే, శిక్ష నుంచి తప్పించుకునేందుకు, ఉరి అమలును వాయిదా వేసేందుకు దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. తాజాగా.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించినందున నిబంధనల ప్రకారం మరో దోషి ముకేశ్‌కు మాదిరిగానే ఇతడికీ 14 రోజుల గడువివ్వాలని, అందుకు ఉరిశిక్షను వాయిదా వేయాలని వారి తరపు లాయర్ ఏపీ సింగ్ పటియాల కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు ఇవ్వనుంది. మరోవైపు వినయ్ మినహా మిగతా ముగ్గురు దోషులను ఉరితీసేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షను తప్పించుకునేందుకు దోషులు ఎత్తుగడలు వేస్తున్నారని, చట్టాలను మార్చాల్సి ఉందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. (చదవండి : సందిగ్ధంలో ‘నిర్భయ’ దోషుల ఉరి) -
దేవుడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు : జడ్జి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో విచారణ సందర్భంగా బుధవారం పాటియాలా కోర్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దోషుల ఉరిశిక్షపై విచారణను కోర్టు జనవరి 7కి వాయిదా వేసిన సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ.. ఏడేళ్ల నుంచి ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామని, ఉరి శిక్ష త్వరగా అమలయ్యేలా చూడాలని జడ్జికి మొరపెట్టుకుంది. దీనికి స్పందించిన జడ్జి ‘మీకు జరిగిన అన్యాయం పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ నిందితులకు కూడా కొన్ని హక్కులుంటాయి. చట్ట ప్రకారం మేం అలా నడుచుకోకతప్పద’ని వ్యాఖ్యానించారు. అంతేకాక ‘దేవుడు ఉండి ఉంటే రెండు విషయాలలో ఖచ్చితంగా సిగ్గుపడతాడు. ఒకటి నిర్భయ ఘటన జరిగినందుకు, మరొకటి ఆ ఆరుగురు దోషులను పుట్టించినందుకు’ అని చెప్పారు. అనంతరం కోర్టు బయటికొచ్చిన నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా దోషులకున్న హక్కుల గురించే మాట్లాడుతున్నారు. బాధితులమైన మాకు ఎలాంటి హక్కులు లేవా? అని ఆవేదనతో ప్రశ్నించారు. నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏడేళ్లు అతి భారంగా గడిచాయి. కోర్టు ఉరిశిక్ష విధించినా ఎప్పుడు అమలు చేస్తారో తెలియట్లేదు. ఇప్పుడు ఒక్కో సెకను గడవడం కూడా చాలా కష్టంగా ఉందని బరువెక్కిన హృదయంతో వ్యాఖ్యానించారు. చదవండి : నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా -
నాన్న చెప్పిందే నిజమైంది : స్టాలిన్
సాక్షి, చెన్నై : దేశంలో సంచలనం సృష్టించిన 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో న్యాయం గెలిచిందని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ కేసులో తన సోదరి కనిమొళి, టెలికం మాజీ మంత్రి రాజాతోపాటు మొత్తం 17మంది డీఎంకే నేతలు నిర్దోషులంటూ పటియాల కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు తన తండ్రి కరుణానిధిని కలుసుకునేందుకు స్టాలిన్ చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'న్యాయం గెలిచింది. ఇదివరకే ఇలా జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు కరుణానిధి చెప్పారు. ప్రతిపక్షాలు మీడియా కలిసి మాకు అపఖ్యాతి తెచ్చేందుకు కావాల్సిన అన్ని శక్తులు ఒడ్డారు. కానీ, అవన్నీ తప్పని నేడు తేలింది' అని ఆయన అన్నారు. మరోపక్క, ఈ కేసులో నిర్దోషులుగా బయటకు వచ్చిన వారితో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. -
కోర్టులో రాజా భార్య, కూతురు కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తీర్పు వెలువడగానే ఈ కేసులో ప్రధాన నిందితుడైన టెలికం మాజీ మంత్రి రాజా భార్య, కూతురు కోర్టులో కంటతడి పెట్టారు. ఈ కేసులో రాజా నిర్దోషి అంటూ పాటియాలా కోర్టు న్యాయమూర్తి సింగిల్ లైన్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరు ఆనంద భాష్పాలు రాల్చారు. అనంతరం రాజాను ఆలింగనం చేసుకొని బావోద్వేగంతో చూస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇక డీఎంకే అధినేత కరుణానిధి కూతురు ఈ కేసులో మరో నిందితురాలు కనిమొళి కూడా కంటతడి పెట్టారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో తమకు అండగా తమ వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని మీడియా ద్వారా చెప్పారు. దాదాపు రూ.లక్షా 70వేల కోట్ల విలువైన ఈ కేసులో రాజా, కనిమొళితోపాటు మొత్తం 17మంది డీఎంకే నేతలు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరంతా కూడా నిర్దోషులని కోర్టు ప్రకటించడంతో డీఎంకే పార్టీలో సందడి నెలకొంది. ఇక కనిమొళి సోదరుడు స్టాలిన్ స్వీట్లు పంచారు. కోర్టు బయట వారి మద్దతుదారులు చిందులు వేశారు. -
ఢిల్లీ పేలుళ్ల కేసుపై వెలువడ్డ తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసు(2005) నిందితుడు తరిక్ అహ్మద్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పటియాల కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తరిక్ అహ్మద్‌తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ రఫీక్ షా, మహ్మద్ హుస్సేన్ ఫజిల్‌లను నిర్దోషులుగా పేర్కొంది. నిందితులపై పోలీసులు టెర్రర్ చార్జీలు దాఖలు చేశారు. కానీ కేసును విచారించిన కోర్టు తరిక్‌పై ఉన్న అన్‌లాఫుల్ యాక్టివిటీస్‌కు శిక్షను విధించింది. దీంతో ఢిల్లీ పోలీసులను షాక్ కు గురయ్యారు. దోషుల్లో ఎవరూ బాంబులను పెట్టలేదనే సమాచారం ఉంది. వీరందరూ బాంబు పేలుళ్లకు సహకారం మాత్రమే అందించారని తెలిసింది. పటియాలా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం పేర్కొంది. పేలుళ్లు ఎలా జరిగాయంటే.. - 2005 అక్టోబర్ 29న సాయంత్రం 5.38 నిమిషాలకు పహర్‌గంజ్‌లోని రద్దీ మార్కెట్లో తొలి బాంబు పేలింది. - సాయంత్రం 6.00గంటలకు దక్షిణ ఢిల్లీలోని గోవింద్‌పురిలో బస్సుకు దగ్గరగా రెండో బాంబు పేలింది. - సాయంత్రం 6.05 గంటలకు సరోజని నగర్ మార్కెట్లో మూడో బాంబు పేలింది. - పేలుళ్లలో మొత్తం 63 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. -
కోర్టుకు త్యాగి సోదరులు
ఢిల్లీ: వైమానిక దళ మాజీ అధిపతి త్యాగిఈ విషయంలో సీబీఐ చట్టాన్ని అతిక్రమించిందని ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అగస్టా కుంభకోణానికి సంబంధించి త్యాగిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు బుధవారం ఆయన సోదరులను పాటియాల కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా త్యాగి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టాన్ని అతిక్రమించిన సీబీఐ.. హైకోర్టు నిబంధనలు కూడా పాటించలేదని ఆరోపించారు. దర్యాప్తు పూర్తికాకుండానే త్యాగిని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ తరుపు న్యాయవాది ఈ కేసు అంతర్జాతీయంగా ప్రభావం ఉన్నదని, త్యాగికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. మరోపక్క, త్యాగి కస్టడీని మరో మూడు రోజులు పొడిగించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. దీంతో మరోసారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. -
పటియాల ఘటనపై మార్చి 10న విచారణ
న్యూఢిల్లీ: పటియాల కోర్టులో జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటికే తమకు అన్ని విధాలైన నివేదికలు అందినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిపై మార్చి 10న విచారణ చేపడతామని తెలిపింది. రాజద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని పటియాల కోర్టుకు తీసుకురాగా ఆ సమయంలో న్యాయవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అక్కడి విద్యార్థులపై యూనివర్సిటీ టీచర్లపై వాడులు దాడులు చేయగా అది పెద్ద సంచలమైంది. దీనిపై తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నివేదిక సమర్పించగా పలు ఆరోపణల పేరిట ఇంకొందరు పిటిషన్లు సమర్పించారు. -
'షూట్ చేయండి... ఉరి తీయండి'
న్యూఢిల్లీ: 'అతడిపై మేము దాడికి పాల్పడ్డాం' అని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌పై దాడిని చేసిన లాయర్లు గర్వంగా ప్రకటించుకున్నారు. రాజద్రోహం కేసు విచారణ కోసం బుధవారం పటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చిన కన్హయ్యపై న్యాయవాదులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దాదాపు 200 మంది లాయర్లు అతడిని చుట్టుముట్టి నినాదాలు చేశారు. 'అతడిని కాల్చి చంపండి, ఉరి తీయండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అక్కడితో ఆగకుండా అతడిపై దాడికి ప్రయత్నించారు. 'మా పని పూర్తయింది' అంటూ దాడి చేసిన లాయర్లు వ్యాఖ్యానించారు. న్యాయవాదుల దాడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జర్నలిస్టులు, విద్యార్థులపై సోమవారం దాడి చేసిన న్యాయవాదుల్లో చాలా మంది ఈ రోజు దాడి చేసిన వారిలో ఉన్నారని చెబుతున్నారు. లాయర్ల దాడిలో కన్హయ్య కుమార్(28)కు గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. పటియాలా హౌస్ కోర్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో శాంతి భద్రతలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆరుగురు ప్రముఖ లాయర్లతో కూడిన బృందాన్ని పటియాలా కోర్టుకు పంపించింది.