పటియాల కోర్టులో జేఎన్యూ వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటికే తమకు అన్ని విధాలైన నివేదికలు అందినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: పటియాల కోర్టులో జేఎన్యూ వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటికే తమకు అన్ని విధాలైన నివేదికలు అందినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిపై మార్చి 10న విచారణ చేపడతామని తెలిపింది. రాజద్రోహం కేసులో జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని పటియాల కోర్టుకు తీసుకురాగా ఆ సమయంలో న్యాయవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే.
అక్కడి విద్యార్థులపై యూనివర్సిటీ టీచర్లపై వాడులు దాడులు చేయగా అది పెద్ద సంచలమైంది. దీనిపై తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నివేదిక సమర్పించగా పలు ఆరోపణల పేరిట ఇంకొందరు పిటిషన్లు సమర్పించారు.