'హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?'
ఢిల్లీ: దేశద్రోహం ఆరోపణల కిందట పోలీసులు అరెస్టు చేసిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ బెయిర్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు కన్హయ్యను ప్రశ్నించింది. బెయిల్ వ్యతిరేకించ వద్దని ఇప్పటికే పోలీసులు నిర్ణయించిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో అతడికి బెయిల్ వస్తుందా రాదా అనే విషయం తెలియనుంది.