ఢిల్లీ: వైమానిక దళ మాజీ అధిపతి త్యాగిఈ విషయంలో సీబీఐ చట్టాన్ని అతిక్రమించిందని ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అగస్టా కుంభకోణానికి సంబంధించి త్యాగిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు బుధవారం ఆయన సోదరులను పాటియాల కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా త్యాగి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టాన్ని అతిక్రమించిన సీబీఐ.. హైకోర్టు నిబంధనలు కూడా పాటించలేదని ఆరోపించారు.
దర్యాప్తు పూర్తికాకుండానే త్యాగిని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ తరుపు న్యాయవాది ఈ కేసు అంతర్జాతీయంగా ప్రభావం ఉన్నదని, త్యాగికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. మరోపక్క, త్యాగి కస్టడీని మరో మూడు రోజులు పొడిగించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. దీంతో మరోసారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు.
కోర్టుకు త్యాగి సోదరులు
Published Wed, Dec 14 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
Advertisement