SP Tyagi brothers
-
చాపర్ స్కామ్‌లో త్యాగిపై చార్జిషీట్
న్యూఢిల్లీః యూపీఏ హయాంలో చోటుచేసుకున్న వీవీఐపీల చాపర్ స్కామ్‌కు సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, మరో తొమ్మిది మందిపై సీబీఐ శుక్రవారం 30,000 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అప్పటి ఎయిర్ వైస్ చీఫ్ జేఎస్ గుజ్రాల్, ఎస్పీ త్యాగి వరుసకు సోదరుడు సంజీవ్ అలియాస్ జూలీ త్యాగి, అగస్టావెస్ట్‌ల్యాండ్ మాజీ సీఈవోలు గిసెప్పి ఒర్సి, ఫిన్మెకానికాకు చెందిన బ్రూనో, దళారీ క్రిస్టియన్ మైఖేల్ తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి. ముడుపులు స్వీకరించిన ఎస్పీ త్యాగి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు కాంట్రాక్టు దక్కేలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లో ఎస్పీ త్యాగి, సంజీవ్ త్యాగిలను సీబీఐ అరెస్ట్ చేయగా, వారిపై అభియోగాలు నమోదు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో బెయిల్‌పై విడుదలయ్యారు. -
కోర్టుకు త్యాగి సోదరులు
ఢిల్లీ: వైమానిక దళ మాజీ అధిపతి త్యాగిఈ విషయంలో సీబీఐ చట్టాన్ని అతిక్రమించిందని ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అగస్టా కుంభకోణానికి సంబంధించి త్యాగిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు బుధవారం ఆయన సోదరులను పాటియాల కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా త్యాగి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టాన్ని అతిక్రమించిన సీబీఐ.. హైకోర్టు నిబంధనలు కూడా పాటించలేదని ఆరోపించారు. దర్యాప్తు పూర్తికాకుండానే త్యాగిని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ తరుపు న్యాయవాది ఈ కేసు అంతర్జాతీయంగా ప్రభావం ఉన్నదని, త్యాగికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. మరోపక్క, త్యాగి కస్టడీని మరో మూడు రోజులు పొడిగించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. దీంతో మరోసారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు.