చాపర్ స్కామ్‌లో త్యాగిపై చార్జిషీట్
చాపర్ స్కామ్‌లో త్యాగిపై చార్జిషీట్
Published Fri, Sep 1 2017 6:55 PM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM
న్యూఢిల్లీః యూపీఏ హయాంలో చోటుచేసుకున్న వీవీఐపీల చాపర్ స్కామ్‌కు సంబంధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్‌పీ త్యాగి, మరో తొమ్మిది మందిపై సీబీఐ శుక్రవారం 30,000 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అప్పటి ఎయిర్ వైస్ చీఫ్ జేఎస్ గుజ్రాల్, ఎస్‌పీ త్యాగి వరుసకు సోదరుడు సంజీవ్ అలియాస్ జూలీ త్యాగి, అగస్టావెస్ట్‌ల్యాండ్ మాజీ సీఈవోలు గిసెప్పి ఒర్సి, ఫిన్‌మెకానికాకు చెందిన బ్రూనో, దళారీ క్రిస్టియన్ మైఖేల్ తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి.
ముడుపులు స్వీకరించిన ఎస్‌పీ త్యాగి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు కాంట్రాక్టు దక్కేలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్‌లో ఎస్‌పీ త్యాగి, సంజీవ్ త్యాగిలను సీబీఐ అరెస్ట్ చేయగా, వారిపై అభియోగాలు నమోదు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో బెయిల్‌పై విడుదలయ్యారు.
Advertisement