Augusta scam
-
తప్పించడమే వారి ఎజెండా
సహరన్పూర్/అమ్రోహా/డెహ్రాడూన్: తనను అధికారం నుంచి తప్పించాలన్న ఏకైక ఎజెండాతో పాటు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీ, అవినీతిది విడదీయలేని అనుబంధమని ప్రధాని దుయ్యబట్టారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ ఏఎం, ఎఫ్ఏఎం అనే పేర్లను ఈడీ చార్జిషీట్లో బయటపెట్టాడన్న మోదీ.. వీటిలో ఏఎం అంటే అహ్మద్ పటేల్ అనీ, ఎఫ్ఏఎం అంటే ఫ్యామిలీ అని వివరించారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. విపక్షాల వ్యవహారశైలిని తీవ్రంగా ఎండగట్టారు. పాక్ హీరో అయ్యేందుకు పోటీపడ్డారు.. ఉగ్రమూకలకు భారత్ దీటుగా బదులిస్తే కొందరికి నిద్రపట్టడం లేదని ప్రధాని విపక్షాలకు చురకలంటించారు. ‘ఉగ్రవాదులకు వారికి అర్థమయ్యే భాషలోనే భారత్ జవాబివ్వడం కొందరికి నచ్చలేదు. మన దేశంపై ఉగ్రదాడి జరిగితే ప్రతిఘటించాలా? లేక మౌనంగా కూర్చోవాలా? ఉగ్రవాదులకు భారత్ దీటుగా బదులివ్వగానే కొందరికి నిద్రపట్టలేదు. పాకిస్తాన్ కపటబుద్ధిని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయగానే ఈ వ్యక్తులు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంతేకాదు.. పాకిస్తాన్‌కు హీరోగా మారేందుకు వారిలో వారే పోటీపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్, యూపీలో ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లక్నో, కాశీలో బాంబులు పేలేవి. ఉగ్రదాడుల సూత్రధారులను విచారణ సంస్థలు పట్టుకున్నప్పుడు.. మాయావతి, అఖిలేశ్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్లను వదిలేసి ప్రేమగా వ్యవహరించేవి’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మోదీ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తాయన్నారు. అమేథీలో ఈసారి గెలవడం కష్టమని తేలడంతోనే రాహుల్ వయనాడ్‌కు పారిపోయారని వార్తలొచ్చాయనీ, ఆయన ఎక్కడ నుంచి పోటీచేయాలో కాంగ్రెస్ ఇష్టమన్నారు. ఈ విషయంపై మాట్లాడే హక్కు బీజేపీకి ఉందన్నారు. మేం ముస్లిం కుమార్తెల(బేటీ–బేటీ) భద్రత, ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ముక్కలు ముక్కలుగా(బోటీ–బోటీ) నరుకు తామని చెబుతున్నారు. తనను ప్రతిపక్షాలు ‘మరుగుదొడ్ల చౌకీదార్’ అని పిలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. మోదీని ముక్కలుముక్కలుగా చేస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ 2014లో వ్యాఖ్యానించారు. -
‘రఫేల్ డీల్‌కు మిషెల్ అడ్డుపడ్డారు’
ముంబై : రఫేల్ ఒప్పందంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రఫేల్‌ను వ్యతిరేకిస్తూ అగస్టా స్కాంలో దళారి క్రిస్టియన్ మిషెల్ లాబీయింగ్ చేశారనే వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని నిలదీశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ అగస్టా సూత్రధారి మిషెల్‌ను తాము భారత్‌కు రప్పించిన తర్వాత పలు అంశాలు బయటికొస్తున్నాయని, రఫేల్‌కు వ్యతిరేకంగా మిషెల్ మరో డీల్ ప్రతిపాదించారనే వార్తలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలన్నారు. రఫేల్‌కు బదులుగా యూరోఫైటర్కు ఈ ఆర్డర్‌ను కట్టబెట్టేందుకు అగస్టా ఒప్పందంలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషెల్ ప్రయత్నించారని ఇండియా టుడే కొన్ని పత్రాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
మహిళా డైరెక్టర్‌కు బెయిల్..హైకోర్టు నో
సాక్షి,న్యూఢిల్లీః అగస్టా కేసులో అరెస్ట్ అయిన దుబాయికి చెందిన వ్యాపారవేత్త శివానీ సక్సేనా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. శివానీ సక్సేనా బెయిల్ అప్పీల్‌ను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించిన జస్టిస్ ఏకే పాథక్ ఆమె బెయిల్ వినతిని తోసిపుచ్చినట్టు వెల్లడించారు. దుబాయ్‌కు చెందిన యూహెచ్వై సక్సేనా, మ్యాట్రిక్స్ హోల్డింగ్స్ కంపెనీలకు ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం( పీఎంఎల్ఏ) కింద శివానీ సక్సేనాను జులై 17న చెన్నైలో ఈడీ అరెస్ట్ చేసింది. పీఎంఎల్ఏ కింద ఆమెపై, దుబాయ్ కంపెనీలపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసింది. -
కోర్టుకు త్యాగి సోదరులు
ఢిల్లీ: వైమానిక దళ మాజీ అధిపతి త్యాగిఈ విషయంలో సీబీఐ చట్టాన్ని అతిక్రమించిందని ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అగస్టా కుంభకోణానికి సంబంధించి త్యాగిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు బుధవారం ఆయన సోదరులను పాటియాల కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా త్యాగి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టాన్ని అతిక్రమించిన సీబీఐ.. హైకోర్టు నిబంధనలు కూడా పాటించలేదని ఆరోపించారు. దర్యాప్తు పూర్తికాకుండానే త్యాగిని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ తరుపు న్యాయవాది ఈ కేసు అంతర్జాతీయంగా ప్రభావం ఉన్నదని, త్యాగికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. మరోపక్క, త్యాగి కస్టడీని మరో మూడు రోజులు పొడిగించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. దీంతో మరోసారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. -
అదృశ్య ‘హస్తం’ అడ్డుకుంది
అగస్టా స్కాం విచారణపై రాజ్యసభలో పరీకర్ ♦ బ్లాక్మెయిల్ వద్దు.. స్వామిపై మండిపడ్డ ఆంటోనీ ♦ ఏపీ, సీపీ కోడ్ల ఆధారంగా విచారణా?: కాంగ్రెస్ న్యూఢిల్లీ: అగస్టాపై రాజ్యసభలో బుధవారం వాడి వేడి చర్చ జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి పరీకర్ వెల్లడించగా.. తమ పార్టీ సభ్యులపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. అనుమానితులను సీబీఐ అదుపులోకి తీసుకుంటుందన్న బీజేపీ ఎంపీ స్వామి వ్యాఖ్యలపై మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేయగా.. కాంగ్రెస్ డిమాండును కేంద్రం తోసిపుచ్చింది. అటు లోక్‌సభలోనూ అగస్టాపై చర్చ వేడిపుట్టించింది. ఇటలీ కోర్టు వెల్లడించిన పేర్లపైనే.. అగస్టాతో ఒప్పందం పూర్తయ్యేంతవరకు యూపీఏ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందని పరీకర్ రాజ్యసభలో తెలిపారు. ఇటాలియన్ కోర్టు నివేదికలో వెల్లడించిన పేర్లపైనే ప్రధానంగా విచారణ జరుగుతోందన్నారు. అగస్టా ఒప్పందానికి సంబంధించి 2005 నుంచి నెలకొన్న పరిణామక్రమాన్ని పరీకర్ రాజ్యసభకు వెల్లడించారు. మార్చి 12, 2013లో సీబీఐ కేసు నమోదు చేసినా.. ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి పంపలేదని.. ఆ తర్వాత ఈడీకి ఎఫ్ఐఆర్ అందినా జూలై 2014 వరకు స్పందించలేదని పరీకర్ చెప్పారు. 2012లోనే ఇదంతా జరిగేలా ఓ అదృశ్య హస్తం ప్రభావవంతంగా పనిచేసిందన్నారు. తన ప్రకటన ప్రారంభానికి ముందే ఎవరి పేర్లు తీసుకోనని పరీకర్ హామీ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ.. ‘ఈ కుంభకోణానికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఇచ్చిన వివరాల ప్రకారం ముడుపులు తీసుకున్న వారందరినీ సీబీఐ విచారిస్తుంది. అవసరమైతే అదుపులోకి తీసుకుంటుంది’ అని అన్నారు. స్వామి వ్యాఖ్యలపై మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్రంగా మండి పడ్డారు. ‘స్వామీజీ.. మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోండి. అంతేకానీ మమ్మల్ని బెదిరించటమో.. బ్లాక్మెయిల్ చేయటమో చేయకండి. మమ్మల్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో మీరు గెలవలేరు’ అని అన్నారు. సభ మొదలైనప్పటినుంచీ రాజ్యసభ ప్రారంభం కాగానే.. అగస్టా వివాదానికి సంబంధించిన అంశాలను సభ ముందు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని రక్షణమంత్రి పరీకర్ కోరగా.. విపక్షాలు ఆందోళన చేయటంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తిరస్కరించారు. దీంతో బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్ ఈ అంశంపై చర్చను ప్రారంభిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. రక్షణరంగ ఒప్పందాల్లో పారదర్శకత లేకపోవటం ఆందోళనకరమన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ.. యూపీఏ సర్కారుపై అధికార పార్టీ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. అప్పటి రక్షణమంత్రి ఆంటోనీ ఈ ఒప్పందాన్ని తిరస్కరించారన్నారు. సీపీ, వీపీ, ఏపీ వంటి కోడ్ సంకేతాలను పట్టుకుని కాంగ్రెస్‌పై విషప్రచారం చేస్తున్నారని.. హవాలా కుంభకోణంలో ‘ఎల్కేఏ’ అనే పదం తెరపైకి వచ్చినా ఆ తర్వాత హైకోర్టు దీనికి బీజేపీ అగ్రనేత అద్వానీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. కాగా, బుధవారం సమావేశాలకు ముందు అగస్టాపై రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర మంత్రులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు సోనియా కూడా పలువురు కీలక నేతలతో సమావేశమై అధికార పక్షానికి వ్యూహాత్మక సమాధానం ఇవ్వటంపై చర్చించారు. ‘బీజేపీ కొత్త ఆధారాలతో ముందుకు వస్తే స్వాగతిస్తాం’ అని సోనియా చెప్పారు.లోక్‌సభలోనూ అగస్టాపై దుమారం రేగింది. మంగళవారం ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ.. వివాదంలో తెరపైకి వచ్చిన గౌతమ్ ఖైతాన్, గుయ్‌డో హ్యాష్కీలు.. భారతదేశంలోని పలు కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్నారన్నారు. రాజ్యసభకు ప్రణవ్ పాండ్యా ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్ అధ్యక్షుడు ప్రణవ్ పాండ్యాను మోదీ సర్కార్ రాజ్యసభకు నామినేట్ చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. త్యాగికి లంచాలు.. విచారణకు యూపీఏ సహకరించలేదు: ఇటలీ జడ్జి న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ కేసులోమాజీ వైమానిక అధికారి ఎస్పీ త్యాగి ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని ఇటలీలో ఈ కేసుతీర్పిచ్చిన జడ్జి మార్కో మారియా మైగా బుధవారం తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తు చేసేందుకు కావాల్సినన్ని ఆధారాలున్నాయన్నారు. విచారణకు యూపీఏ ప్రభుత్వం సహకరించలేదని వెల్లడించారు. ‘2002లో అగస్టాతో తొలిసారి ఒప్పందం కుదుర్చుకున్నప్పటినుంచి కేసు వివరాలివ్వాలని ఇటలీ అధికారులు, ప్రాసిక్యూటర్లు.. భారత అధికారులనుకోరారు. కానీ భారత్ అందించింది 3 డాక్యుమెంట్లే’ అని తెలిపారు. హెలికాప్టర్‌కు సంబంధించిన వివరాలు మార్చేందుకు మాజీ వైమానిక అధికారి ఎస్పీ త్యాగి, ఆయన సోదరులు ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయన్నారు. ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం చేసిన గైడో హ్యస్కే చేతిరాతతో రాసిన దస్తావేజులో పలువురు భారత వైమానిక అధికారులు, బ్యూరోక్రాట్లతోపాటు రాజకీయ నేతల పేర్లున్నాయని మైగా చెప్పారు. మూడోరోజూ త్యాగిని ప్రశ్నించిన సీబీఐ.. ఈ కేసులో త్యాగిని సీబీఐ వరుసగా బుధవారం మూడో రోజు ప్రశ్నించింది.ఆయన న్యాయవాది, ఎయిరోమాట్రిక్ మాజీ బోర్డు సభ్యుడు గౌతమ్ ఖైతాన్‌ను కూడా ప్రశ్నించింది. వీరిని ఇటలీ ‘మధ్యవర్తులు’ కార్లో జారోసా, గైడో హాస్కేలతో సంబంధాలపై ప్రశ్నించారు.ఈ కేసులో నగదు లావాదేవీలపై గురువారం తమ ఎదుట హాజరై వివరాలివ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ త్యాగితో పాటు ఆయన బంధువులను ఆదేశించింది. హెలికాప్టర్ కుంభకోణంలో రియాల్టీ సంస్థ ఎమార్ ఎంజీఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రావణ్ గుప్తాను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సన్నిహితుడు కనిష్క సింగ్‌తో ఉన్న వ్యాపార సంబంధాల గురించీ ఆరాతీశారు. అలాగే, 2005లో ఢిల్లీలోని ఒక షాపింగ్‌మాల్‌లో రాహుల్‌కు రెండు షాపుల అమ్మకంపై ప్రశ్నించారు. -
ఎన్డీఏ హయాంలోనే ‘అగస్టా’
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మూలాలు గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంనాటివని తేలింది. అగస్టా కంపెనీ నుంచి 12 వీవీఐపీ చాపర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుండడం తెలిసిందే. బిడ్డింగ్‌లో అగస్టా కంపెనీ పాల్గొనేలా చేసేందుకు చాపర్లు ఎగరాల్సిన ఎత్తు పరిమితిని 6వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్డీఏ అధికారంలో ఉన్న 2003లోనే ఈ ఎత్తు తగ్గింపుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారన్న విషయంవెల్లడైంది. ఇటీవల మాజీ గవర్నర్లు ఎంకే నారాయణన్, బీవీ వాంఛూ(ఎస్పీజీ మాజీ చీఫ్)లను సీబీఐ ప్రశ్నించిన సందర్భంగా ఈ విషయం వారు సీబీఐకి స్పష్టం చేశారు. 2003లో పీఎంఓ అధికారుల భేటీలో ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను సంప్రదించి ‘ఎత్తు తగ్గింపు’పై నిర్ణయం తీసుకున్నట్లు వాంఛూ చెప్పారని అధికార వర్గాలు తెలిపాయి. వాంఛూ వెల్లడించిన అంశాల్లో.. ఎన్డీఏ హయాంలో భద్రతాసలహాదారుగా ఉన్నబ్రజేశ్ మిశ్రా కూడా ‘ఎత్తు తగ్గింపు’ను సమర్థించారన్న విషయమూ ఉందన్నాయి.