న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మూలాలు గత ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంనాటివని తేలింది. అగస్టా కంపెనీ నుంచి 12 వీవీఐపీ చాపర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుండడం తెలిసిందే. బిడ్డింగ్‌లో అగస్టా కంపెనీ పాల్గొనేలా చేసేందుకు చాపర్లు ఎగరాల్సిన ఎత్తు పరిమితిని 6వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్‌డీఏ అధికారంలో ఉన్న 2003లోనే ఈ ఎత్తు తగ్గింపుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారన్న విషయంవెల్లడైంది.
ఇటీవల మాజీ గవర్నర్లు ఎంకే నారాయణన్, బీవీ వాంఛూ(ఎస్పీజీ మాజీ చీఫ్)లను సీబీఐ ప్రశ్నించిన సందర్భంగా ఈ విషయం వారు సీబీఐకి స్పష్టం చేశారు. 2003లో పీఎంఓ అధికారుల భేటీలో ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను సంప్రదించి ‘ఎత్తు తగ్గింపు’పై నిర్ణయం తీసుకున్నట్లు వాంఛూ చెప్పారని అధికార వర్గాలు తెలిపాయి. వాంఛూ వెల్లడించిన అంశాల్లో.. ఎన్‌డీఏ హయాంలో భద్రతాసలహాదారుగా ఉన్నబ్రజేశ్ మిశ్రా కూడా ‘ఎత్తు తగ్గింపు’ను సమర్థించారన్న విషయమూ ఉందన్నాయి.
ఎన్‌డీఏ హయాంలోనే ‘అగస్టా’
Published Mon, Jul 7 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement