MK Narayanan
-
‘రాజనీతి’లో రేపటి చూపు!
గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? కొందరు సీనియర్ ‘బ్యూరో క్రాట్ల’ అభిప్రాయాలు చూస్తున్నప్పుడు, అందుకు– ‘అవును’ అనే సమాధానం దొరుకుతున్నది. వీరికి రాజకీయాలు పట్టవు కనుక, విషయం ఏదైనప్పటికీ అందరి మేలు, దేశ సమగ్రత, దృష్టి నుంచి వీరు మాట్లాడతారు. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్ – ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు –నివారణ చర్యలు’ అంశంపై ఇటీవల రాసిన వ్యాసంలో– ప్రస్తావించిన పలు కల్లోల ప్రాంతాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేకపోవడం, ఊరట కలిగిస్తున్న అంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భౌగోళికంగా సముద్ర తీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్... ఇండియా– ‘ఆగ్నేయ ఆసియా విధానం’ అమలుకు, దేశ ‘జియో–పొలిటికల్’ వ్యూహాల దృష్ట్యా కేంద్రానికి ప్రత్యేకం. నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ తీవ్రత విభజన చట్టంతో ముగిశాక, గత మూడేళ్ళలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇక్కడ మావోయిస్టుల చర్యలు లేవు. అయితే, గత మూడు దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన– ‘విభజన’ పోరాటాలు కొన్ని ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా నిద్రాణంగా ఉంటూ, సందు దొరికితే తలలు ఎగరేయడానికి సిద్దంగా ఉన్నాయనీ; భద్రతా చర్యలతో కంటే, ప్రభుత్వాలు అనుసరించవలసిన– ‘రాజనీతి’ (స్టేట్ క్రాఫ్ట్)తో మాత్రమే వాటిని పరిష్కరించుకోవలసి ఉంటుందనీ నారాయణన్ అంటున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మొదలైన మన– ‘లుక్ ఈస్ట్’ దౌత్య విధానం, ప్రధానిగా మోదీ ఎనిమిదో ఏటకు– ‘యాక్ట్ ఈస్ట్’గా పరిణామం చెందింది. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మన ప్రధాని సమక్షంలో 12 దేశాలు – ‘ఇండో–పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేం వర్క్ ఫర్ ప్రాస్పరిటీ’ ఒప్పందం చేసుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా దేశానికి ఆగ్నేయ తీరాన సుదీర్ఘ సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్– దేశానికి ‘గేట్ వే’గా పరిణమించింది. బైడెన్ ఈ ఒప్పం దాన్ని– ‘రైటింగ్ న్యూ రూల్స్ ఫర్ 21 సెంచరీ ఎకానమీ’ అంటూ అభివర్ణించారు. ఇది జరిగి నెల కూడా కాకుండానే, జూన్ 12న మన విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఏపీ ప్రతిపాదిత రాజధాని విశాఖలో జరిపిన మేధావుల సదస్సులో– ‘‘తూర్పు తీరంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవలసి ఉందనీ, అప్పుడే ప్రపంచ మార్కెట్‌తో మన వాణిజ్యం అభివృద్ధి చెందుతుందనీ’’ అన్నారు. పశ్చిమాన గుజరాత్ తీరం తర్వాత తూర్పున ఏపీనే అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది. గత రెండేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, కోస్తా తీరానికి సమాంతరంగా నిర్మాణం అవుతున్న హైవేలు, వైమానిక దళం విమానాలు అత్యవసర పరిస్థితుల్లో దిగడానికి అనువైన ‘హెలీప్యాడ్’ నిర్మాణాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సిద్ధం కావడం తెలిసిందే. తూర్పు కనుమల మీదుగా జాతీయ రహదారుల శాఖ నిర్మిస్తున్న ‘హైవే’ చెన్నై–కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డుతో సమాంతరంగా రాజమండ్రి నుంచి మన్యసీమ మీదుగా రాయపూర్ చేరుతుంది. దక్షణాదిలో విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై–బెంగళూరు ఇండ స్ట్రియల్ కారిడార్, బెంగళూరు–హైదరాబాద్ ఇండస్ట్రి యల్ కారిడార్లు సిద్ధమవుతున్న నాటికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. రాబోయే ఈ ‘కారిడార్ల’ ద్వారా జరిగే వృద్ధిలో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షం గానూ పరోక్షంగానూ ప్రయోజనం పొందుతారు. (క్లిక్: రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకేనా?) ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న– ‘నాలుగవ పారిశ్రామిక విప్లవం’లో (బ్లర్రింగ్ ఆఫ్ బౌండ్రీస్) సరిహద్దుల చెరిపివేత కీలకం. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ‘రాజ్యం’ బాధ్యత. అలాగని అన్ని ప్రభుత్వాలు దాన్ని నిక్కచ్చిగా పట్టించుకోవాలని లేదు. ‘కమ్ వాట్ మే...’ (ఏదైతే అదయ్యింది) అనే తరహాలో గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? పరిపాలనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూక్ష్మ దృష్టిని చూస్తే, అవును అనే స్పష్టం అవుతున్నది. (క్లిక్: బైజూస్ సేవలు ఉపయోగకరం) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
రాజాజీ రాజనీతి విలువలు అసమానం
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేటి తరానికి ఆదర్శనీయుడన్న ఎం.కె. నారాయణన్ హైదరాబాద్: వ్యక్తిగతంగా, రాజకీయ విషయాల్లో సి. రాజగోపాలచారి పాటించిన విలువలు అసమానమైనవని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసించారు. స్వాతంత్య్రోద్యమంలో రాజాజీ ఎంత కీలక పాత్ర పోషించారో, స్వతంత్ర భారత అభివృద్ధికి కూడా అంతే కృషి చేశారని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాజాజీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాజాజీ ప్రాముఖ్యత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేంద్ర మాజీ భద్రతా సలహాదారు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ ఎం. కె. నారాయణన్‌తోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. రాజాజీ పాటించిన సుపరిపాలన విలువలను నేటి తరానికి గుర్తుచేయడానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. అనంతరం ఎం. కె. నారాయణన్ ముఖ్య ఉపన్యాసం చేస్తూ, స్వాతంత్య్రోద్యమంలో రాజాజీ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే దేశ స్వేచ్ఛ, సౌభాగ్యంపై ఆయనకున్న దార్శనికత కనబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాజీ ఇన్స్టిట్యూట్ గౌరవ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎ. నరసింహారావు, డెరైక్టర్ ఇ.సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరి బాటలోనే మన గవర్నర్ కూడా?
అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన గవర్నర్ పదవి త్వరలో రాజీనామా చేయనున్నారా ? అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ నరసింహన్‌ను బుధవారం సీబీఐ గంటన్నర పాటు ప్రశ్నించింది. ఇదే అంశంపై ఇప్పటికే సీబీఐ... బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్, గోవా గవర్నర్ బి.వి.వాంచూలను ప్రశ్నించింది. సీబీఐ ప్రశ్నించిన కొద్ది రోజులకే నారాయణన్, వాంచూలు వరుసగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ ... గవర్నర్ నరసింహన్‌ను ప్రశ్నించడంతో ఆయన కూడా నారాయణన్, వాంచూల బాటలోనే పయనిస్తారని వదంతులు వినవస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో రాష్ట్రాల గవర్నర్లు మారతారన్న విషయం విదితమే. అయితే కొందరు గవర్నర్లు తమ పదవికి ఢోకా లేదని భావించారు. అలాంటి వారిలో రోశయ్య, నరసింహన్‌తోపాటు పలువురు గవర్నర్లు ఆ జాబితాలో ఉన్నారు. అసలు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు ఈ ముగ్గురు గవర్నర్లనే ఎందుకు ప్రశ్నించింది? వీవీఐపీల కోసం కేంద్ర ప్రభుత్వం 12 హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలిచింది. ఈ నేపథ్యంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్ టెండర్ దాఖలు చేసింది. అయితే హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తుకు సంబంధించి సాంకేతిక అంశాలతో అగస్టా హెలికాప్టర్లుకు పొంతన కుదరదని ప్రభుత్వం భావించింది. ఇదే అంశంపై కేంద్రప్రభుత్వం అప్పటి కేంద్ర భద్రత సలహాదారు ఎం.కె.నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ బి.వి.వాంచూ, ఇంటిలిజెన్స్ బ్యూరో అధిపతి ఈఎస్ఎల్ నరసింహన్‌తో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2005, మార్చి 1న ఈ కమిటీ సమావేశమై హెలికాప్టర్ సాంకేతిక అంశాలు పరిశీలించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల సరైనవే నంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆ హెలికాప్టర్లను రూ. 3600 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో రూ. 360 కోట్ల మేర అవకతవకలు జరిగాయని దుమారం చెలరేగింది. దాంతో సీబీఐ విచారణ చేపట్టిన అప్పటి వైమానికి దళ చీఫ్ త్యాగీతోపాటు13 మందిపై కేసులు నమోదు చేసింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం సాంకేతిక అంశాలు నిర్ణయాలపై సాక్షులుగా ఎం.కె.నారాయణన్, వాంచూ, నరసింహన్‌లను సీబీఐ ప్రశ్నించింది. బెంగాలు, గోవా రాష్ట్రాల గవర్నర్లు నారాయణన్, వాంచూలును నియమించిన ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్ల రాజీనామా చేశారని రాజకీయ పండితుల చెబుతున్నారు. అయితే గవర్నర్ నరసింహన్ మరి కొంత కాలం గవర్నర్‌గా కొనసాగే అవకాశాలు లేకపోలేదని వారు వెల్లడిస్తున్నారు. -
ఎన్డీఏ హయాంలోనే ‘అగస్టా’
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మూలాలు గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంనాటివని తేలింది. అగస్టా కంపెనీ నుంచి 12 వీవీఐపీ చాపర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుండడం తెలిసిందే. బిడ్డింగ్‌లో అగస్టా కంపెనీ పాల్గొనేలా చేసేందుకు చాపర్లు ఎగరాల్సిన ఎత్తు పరిమితిని 6వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్డీఏ అధికారంలో ఉన్న 2003లోనే ఈ ఎత్తు తగ్గింపుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారన్న విషయంవెల్లడైంది. ఇటీవల మాజీ గవర్నర్లు ఎంకే నారాయణన్, బీవీ వాంఛూ(ఎస్పీజీ మాజీ చీఫ్)లను సీబీఐ ప్రశ్నించిన సందర్భంగా ఈ విషయం వారు సీబీఐకి స్పష్టం చేశారు. 2003లో పీఎంఓ అధికారుల భేటీలో ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను సంప్రదించి ‘ఎత్తు తగ్గింపు’పై నిర్ణయం తీసుకున్నట్లు వాంఛూ చెప్పారని అధికార వర్గాలు తెలిపాయి. వాంఛూ వెల్లడించిన అంశాల్లో.. ఎన్డీఏ హయాంలో భద్రతాసలహాదారుగా ఉన్నబ్రజేశ్ మిశ్రా కూడా ‘ఎత్తు తగ్గింపు’ను సమర్థించారన్న విషయమూ ఉందన్నాయి. -
నారాయణన్ రాజీనామాపై మమత మౌనం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ రాజీనామాపై మాట్లాడేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. 'గవర్నర్ పదవి రాజ్యాంగబద్దమైనది. నారాయణన్ రాజీనామాపై ఈ సమయంలో నేనేమీ మాట్లాడలేను' అని మమత పేర్కొన్నారు. గవర్నర్ పదవికి నారాయణన్ సోమవారం రాజీనామా చేశారు. జూలై 4న ఆయన అధికారికంగా రాజ్‌భవన్ ను వీడనున్నారు. నారాయణన్ కు ప్రభుత్వం తరపున వీడ్కోలు చెప్పబోమని మమత స్పష్టం చేశారు. స్వాగతం చెప్పడమే కానీ వీడ్కోలు పలకడం ఉందన్నారు. గవర్నర్ రాజీనామా చేసిన విషయాన్ని అంతకుముందు శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ ధ్రువీకరించారు. -
పశ్చిమబెంగాల్ గవర్నర్ రాజీనామా
-
పశ్చిమబెంగాల్ గవర్నర్ రాజీనామా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తన పదవికి రాజీనామా చేశారు. జాతీయ భద్రత సలహాదారుగా పనిచేసని నారాయణన్ యూపీఏ హయాంలో గవర్నర్‌గా నియమితులయ్యారు. గత కొంతకాలంగా ఆయన రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వంలో నియమితులైన గవర్నర్లు వైదొలగాలని చేయాలని కేంద్ర హోం శాఖ సూచించడంతో నారాయణన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో సీబీఐ ఇటీవల ఆయనను ప్రశ్నించింది. యూపీఏ ప్రభుత్వం నియమించిన కొందరు గవర్నర్లు ఇటీవల వైదొలగగా, మరికొందరు రాజీనామా చేసే అవకాశముంది. -
నేనింకా రాజీనామా చేయలేదు
తానింకా గవర్నర్ పదవికి రాజీనామా చేయలేదని పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తెలిపారు. అయితే రాజీనామా చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఏమైనా వర్తమానం వచ్చిందా లేదా అన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. యూపీఏ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్లను సాగనంపాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో.. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణన్‌ను విలేకరులు ఈ విషయమై ప్రశ్నించారు. దానికి ఆయన తానింకా రాజీనామా చేయలేదని, ఇప్పటికీ తానే బెంగాల్ గవర్నర్‌నని అన్నారు. తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాల్సిన అవసరం లేదని కూడా నారాయణన్ చెప్పారు. అధికారికంగా ఇప్పటివరకు ఏమీ చెప్పకపోయినా.. రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం కోరిన గవర్నర్ల జాబితాలో నారాయణన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
పోలీసుల నుంచి రక్షణ కల్పించండి
కోల్‌కతా: తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారకులైనవారికి మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. పోలీసులు తమను నగరం వదిలిపెట్టి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని, తమకు భద్రత కల్పించాలని కోరింది. బీహార్‌కు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ కుమార్తె(16)పై గతేడాది అక్టోబర్ 25న ఆరుగురు యువకులు రెండుసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 23నబాధితురాలు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా, మంగళవారం మృతిచెందింది. మృతదేహంతో కుటుంబసభ్యు లు బుధవారం ర్యాలీ నిర్వహించాలని భావించగా, మార్చురీలో ఉన్న మృతదేహాన్ని బలవంతంగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడానికి పోలీసులు యత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబం గవర్నర్‌ను కలిసింది. బాధితురాలి మృతదేహానికి మధ్యాహ్నం అంత్యక్రియలు చేశారు.