నారాయణన్ రాజీనామాపై మమత మౌనం
కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ రాజీనామాపై మాట్లాడేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. 'గవర్నర్ పదవి రాజ్యాంగబద్దమైనది. నారాయణన్ రాజీనామాపై ఈ సమయంలో నేనేమీ మాట్లాడలేను' అని మమత పేర్కొన్నారు.
గవర్నర్ పదవికి నారాయణన్ సోమవారం రాజీనామా చేశారు. జూలై 4న ఆయన అధికారికంగా రాజ్భవన్ ను వీడనున్నారు. నారాయణన్ కు ప్రభుత్వం తరపున వీడ్కోలు చెప్పబోమని మమత స్పష్టం చేశారు. స్వాగతం చెప్పడమే కానీ వీడ్కోలు పలకడం ఉందన్నారు. గవర్నర్ రాజీనామా చేసిన విషయాన్ని అంతకుముందు శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ ధ్రువీకరించారు.