కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తన పదవికి రాజీనామా చేశారు. జాతీయ భద్రత సలహాదారుగా పనిచేసని నారాయణన్ యూపీఏ హయాంలో గవర్నర్గా నియమితులయ్యారు.
గత కొంతకాలంగా ఆయన రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వంలో నియమితులైన గవర్నర్లు వైదొలగాలని చేయాలని కేంద్ర హోం శాఖ సూచించడంతో నారాయణన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో సీబీఐ ఇటీవల ఆయనను ప్రశ్నించింది. యూపీఏ ప్రభుత్వం నియమించిన కొందరు గవర్నర్లు ఇటీవల వైదొలగగా, మరికొందరు రాజీనామా చేసే అవకాశముంది.