
సాక్షి, చెన్నై : దేశంలో సంచలనం సృష్టించిన 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో న్యాయం గెలిచిందని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ కేసులో తన సోదరి కనిమొళి, టెలికం మాజీ మంత్రి రాజాతోపాటు మొత్తం 17మంది డీఎంకే నేతలు నిర్దోషులంటూ పటియాల కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు తన తండ్రి కరుణానిధిని కలుసుకునేందుకు స్టాలిన్ చెన్నై వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'న్యాయం గెలిచింది. ఇదివరకే ఇలా జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు కరుణానిధి చెప్పారు. ప్రతిపక్షాలు మీడియా కలిసి మాకు అపఖ్యాతి తెచ్చేందుకు కావాల్సిన అన్ని శక్తులు ఒడ్డారు. కానీ, అవన్నీ తప్పని నేడు తేలింది' అని ఆయన అన్నారు. మరోపక్క, ఈ కేసులో నిర్దోషులుగా బయటకు వచ్చిన వారితో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment