'హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం' | solve the special status isse to AP, says left parties | Sakshi

'హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం'

Dec 6 2015 2:48 PM | Updated on Mar 23 2019 9:10 PM

'హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం' - Sakshi

'హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం'

రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని సీపీఐ నేత రాజా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా సీపీఐ నేత రాజా డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని, వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు నిలదీయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. విభజన సమయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్లే ఈ గందరగోళం తలెత్తిందని ఏచూరి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement