టాలీవుడ్ హీరో రాజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతకొంతకాలంగా పాస్టర్‌గా దైవసేవలో మునిగి తేలుతున్న ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు.
ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. 'నాకు రాజకీయాలు కొత్తేం కాదు. ఇంతకుముందు తెర వెనుక పని చేశాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పని చేసేందుకు రెడీ అయ్యాను. కేవలం ఒక రాష్ట్రం కోసమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీలో చేరాను' అని చెప్పుకొచ్చాడు.
సినిమాలకు దూరం..
'ఆనంద్: మంచి కాఫీలాంటి సినిమా'తో తెలుగువారికి దగ్గరయ్యాడు హీరో రాజా. 2002లోనే ఓ చిన్నదాన సినిమాతో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ 2004లో వచ్చిన ఆనంద్ మూవీతోనే అసలు సిసలైన సక్సెస్ రుచి చూశాడు. ఆ నలుగురు, వెన్నెల చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తర్వాత సినిమాల ఎంపికలో తడబడ్డాడు. ఫలితంగా హిట్లు కరువైపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. 2013 తర్వాత మరే సినిమా చేయలేదు. కాగా రాజా.. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు.
చదవండి: ప్రియుడితో జయసుధ? మరోసారి తెరపైకి మూడో పెళ్లి రూమర్స్!
Comments
Please login to add a commentAdd a comment