7/G బృందావన్ కాలనీ.. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. 20 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడే రవికృష్ణ. 7/G బృందావన్ కాలనీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీగా విడుదలైంది. అక్కడ కూడా సెన్సేషన్ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు రవికృష్ణ.
తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు, కానీ మళ్లీ అంతటి హిట్ అందుకోలేకపోయాడు. 2011లో చివరగా అరణ్య కాండం అనే తమిళ చిత్రంలో కనిపించాడు. తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ఇన్నాళ్లకు అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాను డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. 7/G బృందావన్ కాలనీ ఈ నెల 22న మరోసారి థియేటర్లలో విడుదల కానుంది.
ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడాడు. 'చాలారోజులుగా ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నాం. దానికంటే ముందు ఈ సినిమాను మరోసారి మీరు చూసేయండి' అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పటికి, ఇప్పటికి రవికృష్ణలో చాలా మార్పు వచ్చింది. అసలు 7/G బృందావన్ కాలనీ హీరోలానే లేడు. బరువు పెరిగి గుర్తుపట్టరానంతగా మారిపోయాడు.
చదవండి: అజిత్‌తో సినిమాకు సిద్ధమైన జైలర్ నిర్మాతలు.. ఏకంగా అన్ని కోట్లు ఆఫర్!
Comments
Please login to add a commentAdd a comment