
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా (రాజా భవాని శంకర శర్మ) వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని హోటల్ దస్‌పల్లలో ఆదివారం ఉదయం వధువు వెంకటలక్ష్మి హిమబిందు మెడలో రాజా మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక‍్రమ్, కృష్ణవంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కాగా నటుడు రాజా కేరెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎవడు, ఫిదా, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, ’ చిత్రాలతో అతడికి మంచి పేరు తెచ్చాయి.ఇక ఫిదా సినిమాలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యగా మంచి నటన కనబరిచాడు. అలాగే మస్తీ, భానుమతి వర్సెస్ రామకృష్ణ వెబ్ సిరీస్‌లో రాజా నటించారు.
తల్లిదండ్రులతో రాజా చెంబోలు



Comments
Please login to add a commentAdd a comment