స్నేహబంధం గొప్పది | a film directed with the inspiration of friendship | Sakshi
Sakshi News home page

స్నేహబంధం గొప్పది

Published Fri, Apr 25 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

a film directed with the inspiration of  friendship

 కులమతాలకంటే స్నేహబంధం గొప్పదని తెలిపే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సుస్వాగతం’. రాజా, అనుసృ్మతి జంటగా నటిస్తున్నారు. అళహరి దర్శకుడు. టి.ప్రసన్నకుమార్ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, అనురాగం ఆప్యాయతల ముందు కులమతాలు ఎందుకూ పనికి రావని ఈ సినిమాలో చూపిస్తున్నాం. అన్ని వర్గాల వారూ మెచ్చే సినిమా ఇది’’ అన్నారు. మే 1 నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాత చెప్పారు. నవీన్, బిందు, ప్రభాకర్, రత్నాసాగర్, రావుశ్రీ, సురేశ్ తదితరులు ఇతర పాత్రధారులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement