100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది | Suswagatham Movie Heroine Devayani Untold Struggles Life Story - Sakshi
Sakshi News home page

దేవయానిని మోసం చేసింది ఎవరు.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది

Published Tue, Oct 3 2023 9:33 AM | Last Updated on Tue, Oct 3 2023 11:26 AM

Actress Devayani Face Struggles In Life Story - Sakshi

నటి దేవయాని తెలుగు సినీ ఫ్యాన్స్‌ అందరికీ సుపరిచయమే. పవన్‌ కల్యాణ్‌ నటించిన సుస్వాగతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమెకు  తల్లితండ్రులు పెట్టిన పేరు సుష్మా. ఈమె ముంబైలోని నిరుపేద అయిన ఒక కొంకణీ కుటుంబంలో జన్మించింది.  ఈమె తండ్రి జయదేవ్ ఒక ఫ్యాక్టరీలో రోజువారి కూలీ కాగా తల్లి లక్ష్మి గృహిణి. ఈమెకు నకుల్, మయూర్ అని ఇద్దరు సోదరులు ఉన్నారు. నకుల్ తమిళ సినిమా రంగంలో నటుడు, గాయకుడుగా పనిచేస్తున్నాడు. మయూర్ ఇటీవలే ఒక సినిమాలో నటుడుగా ఆరంగేట్రం చేశాడు.

పదో తరగతి వరకు విధ్యాబ్యాసం కారణం ఇదే
దేవయాని కుటుంబంలో ఉ‍న్న ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతితోనే తన చదువుకు ఫుల్‌స్టాప్‌ పడింది. కానీ ఆమె స్కూల్‌లో టాపర్‌గా చదవులో రానిస్తుండగా ముంబైలో ఒక హిందీ సినిమా షూటింగ్‌ కోసం కొందరు బస్తీ జనాలు కావాలని ప్రకటన ఇవ్వడంతో దేవయాని తల్లి లక్ష్మినే ఆమెను అక్కడకు తీసుకెళ్లింది. అప్పుడు వారికి చెరో రూ. 100 ఇవ్వడంతో సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇంత డబ్బు వస్తుందా అని ఆశ్చర్యపోయారట. దీంతో దేవయానికి 16 ఏళ్ల వయసులో ఉండగానే మొదట హిందీ సినిమా అవకాశం వచ్చింది. దీంతో దేవయాని తల్లే స్కూల్‌ ఆపించేసి సినిమాల్లో నటించమని ఒప్పించిందట.

అవకాశాల కోసం కాంప్రమైజ్‌
ఆ తర్వాత అక్కడ చాలా అవకాశాలు వచ్చినా ఎక్కువగా కాస్టింగ్‌ కౌచ్‌ ప్రభావం ఆమెపై పడిందట. కానీ అవకాశాల కోసం కొన్ని చోట్ల ఆమె కూడా కాంప్రమైజ్‌ కాక తప్పలేదని ప్రచారం జరిగింది. సినిమా అవకాశాలు వచ్చాయి కానీ అవి అంతగా హిట్‌ కాకపోవడంతో ఆమెను చాలామంది  హీరోలు పక్కన పెట్టేశారు. దీంతో చేసేది ఏం లేక పలు బెంగాళీ సినిమాల్లో రొమాంటిక్‌ పాత్రలు కూడా చేసింది. కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌తో పాటు బికినీలో కూడా కనిపించింది. ఇవన్నీ కూడా తను ఆర్థికంగా నిలబడేందుకే చేసినట్లు సమాచారం.

తమిళ్‌లో వారితో ప్రేమాయణం
అక్కడ నుంచి ఆమె తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా శరత్‌కుమార్‌, అజిత్‌ వంటి వారితో ఎఫైర్‌ నడిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కోలీవుడ్‌లో కూడా సినిమా అవకాశాలు లేకుండా పోయాయి అని వార్తలు వచ్చాయి. అలా దేవయాని 2001లో తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అది దేవయాని తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి ఒక గుడిలో పెళ్లి చేసుకుంది.

దీంతో అప్పటి వరకు ఆమె సంపాదించిన డబ్బు నుంచి ఒక్కరూపాయి కూడా ఆమె తల్లిదండ్రులు ఇవ్వలేదట. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇనియ, ప్రియాంక ఉన్నారు. చేతిలో డబ్బు లేదు..  పెళ్లి కావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా లేవు. దీంతో ఆమె బుల్లితెరపై దృష్టి సారించింది. అక్కడ రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న నటిగా తన ప్రత్యేకతను చాటుకున్న దేవయాని మళ్లీ గాడిలో పడ్డారు.

కొన్నిరోజుల తర్వాత  ఈమె చిత్ర నిర్మాణం చేపట్టి తన భర్త దర్శకత్వంలో కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. అవి అంతగా ప్రేక్షకాధరణ పొందకపోవడంతో సంపాధించిన డబ్బు అంతా అయిపోయింది. అలా అప్పుల్లో కూరుకుపోయి. కొన్ని రోజుల తర్వాత ఎంతోకొంత చెల్లించి అప్పుల నుంచి బయటపడ్డారట.

నటనకు స్వస్తి చెప్పి రీ ఎంట్రీ
అప్పుల గొడవ తర్వాత ఆమె అనూహ్యంగా నటనకు స్వస్తి చెప్పి అధ్యాపకురాలిగా ఉద్యోగం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దేవయాని తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో గల చర్చ్‌పార్కు కాన్వెంట్ పాఠశాలలో నర్సరీ పిల్లలకు అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. తనకు ఉపాధ్యాయరాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరికని ఆమె గతంలో తెలిపారు. దీంతో టీచర్ కోర్సు చదివి ఉత్తీర్ణత పొందానని చెప్పారు. అనంతరం తనపిల్లలు చదువుతున్న చర్చ్ పార్కు పాఠశాలలో అధ్యాపకురాలిగా చేరానని తెలిపారు.

అక్కడి విద్యార్థులను చూస్తున్నప్పుడు తాను మళ్లీ కొత్తగా పుట్టినట్టుందన్నారు. జీతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఇక్కడ చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉందని దేవయాని పేర్కొన్నారు. కానీ ఆమెకు అక్కడ ప్రస్తుతం సుమారు రూ. 10 వేలు ఇస్తున్నట్లు సమాచారం.  ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్‌, నాగ చైతన్య లవ్‌ స్టోరీ వంటి చిత్రాలతో తను సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ప్రస్తుతం సెలక్టెడ్‌ పాత్రలు మాత్రమే చేస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రేమ పెళ్ల పట్ల కోపంతో ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరూ దేవయాని భర్తతో టచ్‌లో లేరు. కానీ దేవయాని మాత్రం తన కుటుంబ సభ్యులను అప్పుడప్పుడు కలుస్తుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement