పదేళ్ల కిత్రం జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి గురువారం ముగింపు కార్డు పడనుంది. డీఎంకే నాయకులు రాజా, కనిమొళి ఈ కేసులో చిక్కుకుని ఉండడం.. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఇదే రోజు కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈరెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు.