టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు | dhadisetti raja about tdp government | Sakshi
Sakshi News home page

టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు

Published Wed, Jun 28 2017 12:15 AM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM

టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు - Sakshi

టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు

–ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తొండంగి (తుని) : ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు త్వరలో ఓటు ద్వారా ప్రజలే గుణపాఠం చెబుతారని వైఎస్సార్‌ సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం తొండంగి మండలం ఏవీ నగరంలో పార్టీ నాయకుడు కొయ్యా శ్రీనుబాబు గృహంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, పార్టీ మండల కన్వీనర్‌ బత్తుల వీరబాబు, మండల యూత్‌ కన్వీనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు, ఇతర నాయకులతో సమావేశమై పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న పింఛన్లు, భూకబ్జాలు, ఇసుక దందా, వంటి ఆగడాలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన ప్రతీ పనికి కచ్చితంగా జవాబు చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రతిపక్ష నేతగా తాను ఎట్టి పరిస్ధితుల్లోనూ అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతానన్నారు. ఇంతటి దుష్టపాలన చేస్తున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో రెండంకెల సీట్లు దక్కించుకోవడం కూడా కష్టమన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, తొండంగి సొసైటీ డైరెక్టర్‌ అంబుజాలపు పెద సత్యనారాయణ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement