పోలీసు రాజ్యంగా మారిన బాబు పాలన
-
మధురపూడి రైతుల అరెస్టు అన్యాయం
-
వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
కోరుకొండ :
రాష్ట్రంలో చంద్రబాబు పాలన అవినీతి, అరాచకాలు, ప్రతిపక్షపార్టీ నేతలు, సానుభూతిపరులపై కేసులు, దౌర్జన్యాలతో కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. సోమవారం కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన రైతులు, పార్టీకి సానుభూతి పరులైన గణేసుల పోసియ్య, బత్తిన త్రిమూర్తులు, అకుల రామకృష్ణ, బాలిన వీర్రాజులతోపాటు పలువురు ఉదారంగా విమానాశ్రయం అభివృద్ధికి భూములు ఇచ్చిన వారిని అరెస్ట్ చేసి కోరుకొండ పోలీసు స్టేషన్‌కు తీసుకురావడం దారుణమన్నారు. కోట్లాది రూపాయాలు విలువైన తాతముత్తాల నుంచి అనుభవిస్తున్న భూములను విమానాశ్రయం అభివృద్ధికి ఇచ్చిన వారిని కూడా అరెస్ట్‌చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించడం అన్యాయమన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కృషితోనే రైతులు భూములు ఇచ్చారని టీడీపీ నేతలు ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఇంటివద్ద ఉన్నవారిని గోకవరం ఎస్సై పిలిపించి నలుగురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడ దారుణమన్నారు.
రాజమండ్రిలో కూడా పార్టీకి చెందిన కార్పొరేటర్ బొంతా శ్రీహరిని అన్యాయంగా అరెస్ట్ చేశారని, మధురపూడికి దారికోసం టీడీపీ నేతలు కలెక్టర్‌ను అడిగితే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన రైతులను అరెస్ట్ చేశారన్నారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలపై నాలుగురు రైతులను వ్యక్తిగత పూచికత్తులపై వదలివేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారిలో జక్కంపూడి విజయలక్ష్మితోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి చింతపల్లి చంద్రం, మండల అధికారప్రతినిధులు గరగ మధు, వాకా నరసింహరావు, గాదరాడ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలం నాగవిష్ణు, కోరుకొండ గ్రామ యూత్ కార్యదర్శి పసుపులేటి బుల్లియ్య నాయుడు తదితరులున్నారు.