రాకెట్‌రాజాను జైలుకు తీసుకెళుతున్న పోలీసులు
టీ.నగర్: హత్యకేసులో పోలీసు కస్టడీ ముగియడంతో రాకెట్‌రాజాను మళ్లీ మంగళవారం జైల్లో నిర్బంధించారు. తూత్తుకుడి జిల్లా, కొడియన్‌కుళంకు చెందిన కుమార్, నాడార్ మక్కల్ శక్తి ఇయక్కం అధ్యక్షుడు రాకెట్‌రాజా మద్దతుదారులకు పాళయంకోట్టైలో స్థలం విషయంలో ఘర్షణ ఏర్పడింది. ఫిబ్రవరి 26న పాళయంకోట్టై, అన్నానగర్‌లోని కుమార్ ఇంటిపై రాకెట్‌రాజా మద్దతుదారులు బాంబులతో దాడి జరిపారు. దాడిలో కుమార్ అల్లుడు ప్రొఫెసర్ సెంథిల్‌కుమార్ హత్యకు గురయ్యారు. చెన్నైలోని నక్షత్ర హోటల్‌లో తలదాచుకున్న నిందితుడు రాకెట్‌రాజాను పోలీసులు అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. సోమవారం నెల్లై ప్రత్యేక కోర్టులో రాకెట్‌రాజాను పోలీసులు హాజరుపరిచారు.
ఆ సమయంలో రాకెట్‌రాజాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. దీంతో పాళయంకోట్టై పోలీసు స్టేషన్‌లో రాకెట్‌రాజా వద్ద పోలీసు డిప్యూటీ కమిషనర్ విజయకుమార్ విచారణ జరిపారు.మంగళవారం విచారణ పూర్తికావడంతో వైద్య పరీక్షల అనంతరం రాకెట్‌రాజాను మళ్లీ నెల్లై కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది. దీంతో రాకెట్ రాజాను కోయంబత్తూరు జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment