ఘనంగా నటుడు రాజా వివాహం | Richly married actor Raja | Sakshi
Sakshi News home page

ఘనంగా నటుడు రాజా వివాహం

Published Sat, Apr 26 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

ఘనంగా నటుడు రాజా వివాహం

ఘనంగా నటుడు రాజా వివాహం


 తమిళసినిమా(చెన్నై),   అందరూ మెచ్చిన హీరోగా గుర్తింపు పొందిన రాజా ఆ తర్వాత మాయాబజార్ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. రాజా, అమృతల వివాహం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ మెరీసా చర్చిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతోపాటు సన్నిహిత బంధువులు, మిత్రులు హాజరయ్యారు. అనంతరం చెన్నై అడయార్‌లోని రామనాథన్ శెట్టియార్ హాలులో రిసెప్షన్ నిర్వహించారు.

ఇందులో పలువురు చిత్రప్రముఖులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రత్యేకంగా విచ్చేసి రాజా, అమృతలను ఆశీర్వదించారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఆర్, నిర్మాత ఎడిటర్ మోహన్ కుటుంబ సభ్యులు, పలువురు నటీనటులు హాజరై.. నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement