మాఫియా.. ప్రేమయా... | 'Dongri Ka Raja' is a love story set in the underworld | Sakshi
Sakshi News home page

మాఫియా.. ప్రేమయా...

Oct 14 2016 11:13 PM | Updated on Sep 4 2017 5:12 PM

మాఫియా.. ప్రేమయా...

మాఫియా.. ప్రేమయా...

ఒకప్పుడు హజీ మస్తాన్, కరీంలాలా, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ బాద్షాలు అధికారం చెలాయించిన

ఒకప్పుడు హజీ మస్తాన్, కరీంలాలా, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ బాద్షాలు అధికారం చెలాయించిన మాఫియా ఇలాఖా డోంగ్రీలో ఇప్పుడు సరికొత్త బాద్షా ‘రాజా’ వచ్చాడు. అతడికి సలాం చేసినోళ్లకు ఏ సమస్యా ఉండదు.. ఎదురు తిరిగినోళ్లను అడ్డు తొలగిస్తాడు. డోంగ్రీలో రాజ్యమేలుతోన్న రాజా మనసులో సామ్రాజ్యాన్ని మాత్రం ఓ అమ్మాయి ఏలుతోంది. మాఫియా ఇలాఖాలో ఈ ప్రేమకథ ఏ కంచికి చేరిందనే కథతో రూపొందుతోన్న సినిమా ‘డోంగ్రీ కా రాజా’.

హదీ అలీ అబ్రార్ దర్శకత్వంలో పీఎస్ ఛట్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గష్మీర్ మహాజని, రిచా సిన్హా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. రోణిత్ రాయ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని పీఎస్ ఛట్వాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement