
Naga Shourya
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే మరోసారి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న నర్తనశాల సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
తాజాగా నాగశౌర్య మరో సినిమాకు అంగీకరించాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాతో రాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సైందవ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment