భవ్య క్రియేషన్స్‌లో నాగశౌర్య..! | Naga Shourya New Movie Opening | Sakshi
Sakshi News home page

Jun 23 2018 3:20 PM | Updated on Jun 23 2018 3:20 PM

Naga Shourya New Movie Opening - Sakshi

పైసా వసూల్‌ తరువాత సినిమా కాస్త గ్యాప్‌ తీసుకున్న భవ్య క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ కొత్త సినిమా ప్రారంభించారు. ఛలో సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్యతో రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (శనివారం) ఉదయం  ప్రారంభమైంది.

హైదరాబాద్‌, కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement