మెగా బ్యానర్‌లో యువ దర్శకుడు | Venky Kudumula To Direct A Film For Geetha Arts | Sakshi
Sakshi News home page

May 29 2018 3:05 PM | Updated on May 29 2018 3:05 PM

Venky Kudumula To Direct A Film For Geetha Arts - Sakshi

దర్శకుడు వెంకీ కుడుముల

ఇటీవల టాలీవుడ్‌లో ఒక్క సినిమాతో సెన్సేషన్‌గా మారిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఛలో సినిమాతో ఈ జాబితాలో చేరిన దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వెంకీ తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. దీంతో పెద్ద బ్యానర్‌ల నుంచి కూడా వెంకీకి ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి యంగ్ హీరోలతో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా వెంకీ కుడుముల ఓ బడా బ్యానర్‌లో సినిమా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోలతో బిగ్‌ బడ్జెట్‌ సినిమాలతో పాటు యంగ్ హీరోలతో మీడియం రేంజ్‌ సినిమాలను రూపొందిస్తున్న గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో వెంకీ కుడుముల ఓ సినిమా చేయనున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ తో రూపొందించబోయే సినిమా ఇది అన్న టాక్‌ వినిపిస్తోంది. ఛలో తరువాత వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement