మెగా హీరోతో ఛలో డైరెక్టర్‌ | Venky Kudumula To Direct Sai Dharam tej | Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 4:20 PM | Last Updated on Tue, May 22 2018 4:20 PM

Venky Kudumula To Direct Sai Dharam tej - Sakshi

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

మెగా అల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం కరుణాకరన్‌ దర్శకత‍్వంలో తేజ్‌ ఐ లవ్‌ యు సినిమా చేస్తున్న సాయి ధరమ్‌ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్‌ తిరుమల, చంద్రశేఖర్‌ ఏలేటి, గోపిచంద్‌ మలినేని లాంటి దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో వెంకీ కుడుమల కూడా చేరాడు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement