యంగ్ హీరో ఇన్నాళ్లకు..! | Finally Mobile Phone In Naga Shouryas Hand | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 10:38 AM | Last Updated on Tue, Sep 25 2018 1:00 PM

Finally Mobile Phone In Naga Shouryas Hand - Sakshi

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ నిత్యావసరాల్లో ఒకటైపోయింది. అలాంటిది ఈ జనరేషన్‌లో కూడా ఇంతవరకు సెల్‌ఫోన్‌ వాడకుండా ఉన్న హీరో ఉన్నాడటే నమ్మలేం. కానీ అలాంటి హీరో కూడా ఒకడు ఉన్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య తరువాత కెరీర్‌ లో కాస్త ఇబ‍్బంది ఎదురైనా ఛలో తిరిగి నిలదొక్కకున్నాడు.

తాజాగా ఈ హీరో మరో బిగ్ డెసిషన్‌ తీసుకున్నాడు. ఇన్నేళ్లు స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఉన్న నాగశౌర్య మొబైల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. ‘ఇన్నేళ్ల తరువాత నా చేతిలో మొబైల్‌ ఫోన్‌. నేను కూడా విషపూరిత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానా..?’ అంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement