సాఫ్ట్‌గా ఉండకు.. ఆడుకుంటారు | Rangabali Teaser Released | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌గా ఉండకు.. ఆడుకుంటారు

Published Fri, Jun 9 2023 3:31 AM | Last Updated on Fri, Jun 9 2023 3:31 AM

Rangabali Teaser Released - Sakshi

‘కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా. నువ్వేం కంగారు పడకు’ అనే డైలాగ్‌తో మొదలైంది ‘రంగబలి’ టీజర్‌. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

‘అయ్య బాబోయ్‌.... రేపట్నుంచి చూత్తారుగా.. మా డెడికేషన్‌ చూస్తే మీకు జ్వరం వచ్చేస్తది (నాగశౌర్య)’, అయినా.. నువ్వేం అంత సాఫ్ట్‌గా ఉండకు.... ఆడుకుంటారు (యుక్తి తరేజ)’ అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో బీ ఫార్మసీ చదివిన యువకుడి ΄ాత్రలో నాగశౌర్య, డాక్టర్‌ ΄ాత్రలోయుక్తి తరేజ నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సత్య, సప్తగిరి, షైన్‌ టామ్‌ చాకో కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: పవన్‌ సీహెచ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement