Bhavya Creations
-
ఆ సినిమా రీమేక్ నేను చేయాల్సింది: భరత్
‘టాలీవుడ్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఆ సినిమా తమిళ రీమేక్ నేను చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను’అని తమిళ హీరో భరత్ అన్నారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన...చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ‘హంట్’లో కీలక పాత్ర పోషించారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మా త వి. ఆనం ద ప్రసాద్ నిర్మిం చారు. మహేష్ దర్శకత్వం వహిం చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుం ది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేదు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
‘హాంట్’ టైటిల్ పై వివాదం.. నోటీసులు పంపిన చిత్ర బృందం
గత కొన్నిరోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న ఈ వివాదం లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది. శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో జూలై లొనే హాంట్ అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరుపున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ నోటీసులు పంపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్, హీరో నిక్షిత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తరువాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్‌తో అప్లై చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్స్ రిజెక్ట్ చేశాయి. ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు. అందుకే మా లాయర్ ద్వారా వాళ్లందిరికి నోటీసులు పంపించాం. మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం’ అని అన్నారు. ‘చాలా ఖర్చు పెట్టి సినిమా తీశాం. ఇప్పుడు టైటిల్ ఇష్యూ వల్ల బిజినెస్‌కి ఇబ్బంది అవుతుంది. మా టైటిల్ మాకు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం’అని నిర్మాత నర్సింగరావ్ అన్నారు. ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్స్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉందని చెప్పాయి. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్స్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తప్పును వారే తెలుసుకోవాలి. ఎవరికి అన్యాయం జరగవద్దు అనేది నా కోరి’అని అన్నారు. -
తలకిందులుగా సుధీర్ బాబు.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Sudheer Babu Pre Look Poster From His Action Thriller Sudheer 16: యంగ్ హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్‌బాబు కృతిశెట్టితో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. దానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను బుధవారం (మే 11) సుధీర్ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకు 'మామా మశ్చీంద్ర' అన్న టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే కాకుండా భవ్య క్రియేషన్స్ ఆధ్వర్యంలో సుధీర్ తన 16వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్‌ను సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ పోస్టర్లో సుధీర్ బాబు తలికిందులుగా పుష్ అప్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. పోస్టర్ ద్వారా సూపర్ ఫిట్‌గా ఉన్న సుధీర్‌బాబుకు 'హ్యాపీ బర్త్‌డే నైట్రో స్టార్' అని విష్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల గన్స్ డోంట్ లై అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. చదవండి: మామా మాశ్చీంద్ర: సుధీర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా? Here's the Terrific Pre-Look Poster of 'Nitro Star' @isudheerbabu's #Sudheer16 💥 The Monstrous cop in Action! 🛡️ A @GhibranOfficial Musical 💥 #HBDSudheerBabu @bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @anneravi @vincentcinema @PulagamOfficial pic.twitter.com/PU0yYNdLEY — Bhavya Creations (@BhavyaCreations) May 11, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘కథ వినకుండా ‘ఓ పిట్ట కథ’ ఒప్పుకున్నా’
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించాడు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నేను నటుడిగా ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. పిట్టకథలోని నా పాత్రలో పలు వేరియేషన్స్ వున్నాయి. నటన పరంగా దాదాపు క్రిష్ అనే నా పాత్రకు పూర్తి న్యాయం చేశాను’ అని కథానాయకుడు విశ్వంత్ తెలియజేశారు. పిట్టకథ అంటే ఏమిటి? ఎవరికి సంబంధించిన టైటిల్? ఇందులో ముగ్గురు క్యారెక్టర్లు ప్రధానం. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ వుంటుంది. అవి ఒక్కోక్కరికి రిలేటెడ్‌గా వుంటాయి. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది విజన్. అది ఎలా అనేది తెలియాలంటే వెండితెరపై చేయాల్సిందే. కొరటాలగారు పెద్దకథ అన్నారు? దానికి కారణం? దర్శకులకు సినిమా గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇది స్క్రీన్‌ప్లే గేమ్. దాని గురించి తెలిసి ఆయనకు బాగా నచ్చింది. మా గురువుగారు చంద్రశేఖర్ ఏలేటిగారికీ నచ్చింది. అలా కొరటాగారికి ఈ స్క్రీన్‌ప్లే నచ్చి తెలుగులో ఇటువంటి స్క్రీన్‌ప్లే బేస్డ్ చాలా కొత్తగా వుంది. పిట్టకథంటే చిన్నదికాదు పెద్ద కథ అని అన్నారు. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది. ఈ సినిమాలో మీరు నటించడానికి కారణం ఏమిటి ? దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారు నా గురువుగారు. ఆయన సినిమాచేశాక ఆయనతోనే జర్నీ చేయాలని ఎక్కువ ఆయనతో ప్రయాణం అయ్యాను. ఆ సమయంలో నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చెందు ముద్దు అనే వ్యక్తి మంచి కథ చెప్పారు. చాలా బాగుంది. చేస్తావా అని అడిగారు. యేలేటిగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆయన చెప్పారని కథ కూడా వినకుండా ఈ సినిమా చెయ్యడనికి ఒపుకున్నా. చంద్రశేఖర్ యేలేటితో మీకు ఉన్న అనుబంధం గురించి ? నేను ఆయన డైరెక్షన్ లో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆయన అంటే నాకు చా లా గౌరవం. నాకు సరైన కథ రావడంలేదు, ఒక పర్ఫెక్ట్ సినిమా చెయ్యాలి. మీతో ట్రావెల్ అవుతానని చెప్పి ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఇక స్క్రీన్ ప్లేలో ఆయనకున్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఆలాంటి ఆయనకు ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగా నచ్చింది.. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని పూర్తి నమ్మకం ఉంది. మరెందుకు ఈ సినిమాకి ‘ఓ పిట్టకథ’ అని సింపుల్ టైటిల్ పెట్టారు ? ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే గేమ్ అండి. నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు. విలేజ్ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా అనిపిస్తోంది. టైటిల్ అలా పెట్టడానికి కూడా స్క్రీన్ ప్లేనే కారణం. సినిమాలో చాలా యాంగిల్స్‌లో స్క్రీన్ ప్లే నడుస్తోంది. కచ్చితంగా ఈ సినిమా కొత్తగా అనిపిస్తోంది. మీరు థ్రిల్ అయిన పాయింట్ ఏమిటి? సినిమాలో థ్రిల్ అయిన పాయింట్ ఇప్పుడు నేను చెప్పే కంటే.. సినిమా చూశాక ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మీరు ఫీల్ అయితే బాగుంటుంది. అయితే నా క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను ఇలాంటి క్యారెక్టర్లో ఇంతవరకు చెయ్యలేదు. ఇండస్ట్రీలో మీ జర్నీ గురించి? ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే. మంచి సినిమాలు చేస్తాడు అనే మంచి పేరును నాకు తీసుకువచ్చాయి. అయితే కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కౌట్ అవకపోయినా గుడ్ ఫిల్మ్స్ చేశాను అనే సంతృప్తి నాకు ఉంది. నా కెరీర్లో ‘మనమంతా’ లాంటి మంచి సినిమా ఉన్నందుకు గౌరవంగా చెప్పుకుంటా. కమర్షియల్‌గా హిట్ అయితేనే కదా.. ఆ సినిమా నిజమైన హిట్ అనిపించుకుంటుంది ? అవును, కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వాలి. అయితే అన్ని సినిమాలు అలా అవ్వవు. బట్, నేను కూడా మంచి కమర్షియల్ హిట్ కోసం చూస్తున్నాను. రీసెంట్గా ‘కాదల్’ అని ఒక సినిమా చేశాను. అది నాకు కమర్షియల్ హిట్ ఇస్తోందని అనుకుంటున్నాను. మీ తదుపరి సినిమాలు? ‘కాదల్’ మూవీ రాబోతుంది. అలాగే ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో సినిమా కూడా ప్రస్తుతం షూట్లో ఉంది. ఈ సినిమా ఎమోషనల్‌గా సాగుతూనే కమర్షియల్ యాంగిల్లోనే ఉంటుంది. ఈ రెండు సినిమాలు బాగా వస్తున్నాయి. చదవండి: రాధిక నాకు తల్లి కాదు! ఇలా అయితే ఎలా కరోనా? -
అప్పుడు ‘లేడీస్ టైలర్’.. ఇప్పుడు ‘ఓ పిట్ట కథ’
చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే విడుదల చేసిన ‘ఏమై పోతానే’అంటూ సాగే లవ్ సాంగ్ యూత్ హార్ట్ బీట్స్‌ను పెంచేస్తోంది. కాగా, ఈ సాంగ్ చిత్రీకరణలో ఓ ఆసక్తికర విషయాన్ని నిర్మాత ఆనంద్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ‘ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. పాట చిత్రీకరణలో ఓ తమాషా ఉంది. మూవీలో సన్నివేశం మూడ్‌కు తగ్గట్టుగా అక్కడ లోకేషన్లలో విజువల్స్‌ని తెరకెక్కించాం. తొలుత విజువల్స్ షూట్ చేశాకే హైదరాబాద్‌లో ట్యూన్ కట్టాం. ఇలా ఇంతకుముందు ప్రముఖ దర్శకుడు వంశీ ‘లేడీస్ టైలర్’ కోసం ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే’ పాటలో ఈ ప్రయోగం చేశారు. విజువల్స్ షూట్ చేసాకే ఇళయరాజాతో ఆ బాణీని సిద్దం చేయించారు దర్శకుడు. ఆ తరహాలోనే మేం చేసిన ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. మార్చి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’అని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు. అనంతరం దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘ఒక విలేజ్‌లో జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొనసాగుతుంది. ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం’ అని అన్నారు. బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్నాడు. చదవండి: బుట్ట బొమ్మ చేతుల మీదుగా ‘ఏమైపోతానే’ ‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ -
‘టీజర్, ట్రైలర్ కమింగ్ సూన్’
చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర ప్రీ టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. విభిన్నంగా రూపొందించిన ‘ఓ పిట్ట కథ’ ప్రీ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 47 సెకన్ల నిడివి గల ఈ ప్రీ టీజర్ ఆరంభంలో ఫుల్ యాక్షన్ సీన్స్ చూపించారు. దీంతో ఈ సినిమాలో టైటిల్‌కు భిన్నంగా, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా హై వోల్టేజీ యాక్షన్ సీన్స్ రూపొందించరని భావిస్తారు. కానీ ‘ఇది మన సినిమా ట్రైలర్ కాదు. ఈ థియేటర్లో నెక్ట్స్ వచ్చే ట్రైలర్. మన సినిమా టీజర్, ట్రైలర్ కమింగ్ సూన్’ అంటూ చివర్లో చిత్ర బృందం ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో అలాంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయా అనే విషయం తెలియాలంటే ఫిబ్రవరి 7వరకు వేచిచూడాలి. ఆ రోజు విడుదలయ్యే టీజర్‌తో ఈ సినిమాపై ఓ అభిప్రాయానికి రావచ్చు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
బాలయ్యని మళ్లీ వాడేస్తున్నాడు!
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అమ్మమ్మగారిల్లు సినిమాతో మరో డిసెంట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో సొంత బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య ఇటీవల భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను ప్రారంభించాడు. సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ప్రారంభించి సౌందర్య మరణంతో మధ్యలో ఆపేశారు. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ సినిమాకు కూడా బాలయ్య టైటిల్‌నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగశౌర్య లవర్‌బాయ్‌గా కనిపించనున్న ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో నారి నారి నడుమ మురారి ఒకటి. నాగశౌర్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. -
భవ్య క్రియేషన్స్‌లో నాగశౌర్య..!
పైసా వసూల్ తరువాత సినిమా కాస్త గ్యాప్ తీసుకున్న భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కొత్త సినిమా ప్రారంభించారు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్యతో రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (శనివారం) ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
‘సైందవ’గా యంగ్ హీరో
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే మరోసారి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న నర్తనశాల సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. తాజాగా నాగశౌర్య మరో సినిమాకు అంగీకరించాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాతో రాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సైందవ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించే అవకాశముంది. -
పూరి, బాలకృష్ణల సినిమా ప్రారంభం
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 101వ సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను కూకట్పల్లి తులసీ వనం టెంపుల్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న బాలయ్య పూరి దర్శకత్వంలో సినిమాచేసేందుకు అంగీకరించాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ప్రస్తుతం ఇషాన్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య పూరిల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘భలే మంచి’ కాంబినేషన్!
సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న యువ హీరో నాని. గత ఏడాది చివరలో వచ్చిన గమ్మత్తై ప్రయత్నం ‘భలే మంచి రోజు’తో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువకుడు - శ్రీరామ్ ఆదిత్య. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రానుందని కృష్ణానగర్ కబురు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్ ఈ ‘భలే మంచి’ కాంబినేషన్లో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట! గతంలో షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పనలో సిద్ధహస్తుడై, విభిన్న తరహా ‘భలేమంచి రోజు’ లాంటి సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ సిద్ధం చేసుకున్న శ్రీరామ్ ఆదిత్య ఓ మంచి స్క్రిప్ట్‌తో నానిని ఇంప్రెస్ చేశారట. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఇంకా పేరు ఖరారు కాని చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ తరువాత విరించి వర్మ దర్శకత్వంలో కొత్త సినిమాకు కూడా అంగీకరించారు. భవ్య క్రియేషన్స్ నిర్మించే సినిమా రానున్న జూలైలో సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. -
‘లౌక్యం’ ఆడియో ఆవిష్కరణ
-
ప్రేక్షకుల ఆదరణే శ్రీరామరక్ష
‘లౌక్యం’ ఆడియో ఆవిష్కరణలో హీరో గోపీచంద్ ప్రేక్షకుల ఆదరణే నటులకు శ్రీరామరక్ష అని హీరో గోపీచంద్ అన్నారు. భవ్య క్రియేషన్స్ నిర్మించిన లౌక్యం ఆడియో ఆవిష్కరణ లయోలా కళాశాల ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో గోపీచంద్ మాట్లాడుతూ నూతన తెలుగు రాష్ర్టంలో జరుగుతున్న తొలి బహిరంగ ఆవిష్కరణ ఇదని, ఇందుకు సహకరించిన నిర్మాత ఆనంద ప్రసాద్, పంపిణీదారులు, ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. భవ్య క్రియేషన్స్ సంస్థ మరిన్ని విజయవంతమైన చిత్రాలు నిర్మించాలన్నారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ గతంలో గోపీచంద్‌తో లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాలు నిర్మించామని, లౌక్యం సినిమా మంచికథతో ప్రేక్షకులకు నచ్చేలా సిద్ధం చేశామని చెప్పారు. విజయవాడ ప్రేక్షకుల తీర్పుకోసం ఎదురుచూస్తున్నామన్నారు. సినిమాలోని తొలి పాటను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన చేసిన రాజకీయ ప్రసంగం ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే దారిలో నడిచారు. ఈ వేడుకలో దర్శకుడు శ్రీవాస్, నటులు చంద్రమోహన్, పృధ్వీరాజ్, హంసానందిని, కోన వెంకట్, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని వినూత్నంగా పల్లకీలో తెప్పించి గోపీచంద్‌తో ఆవిష్కరింపజేశారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ నిర్వహించిన సినీ సంగీత విభావరి, పలు నృత్యాంశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించారుు. యాంకర్లు లాస్య, రవి తమదైన వ్యాఖ్యానంతో అలరించారు. - విజయవాడ కల్చరల్ -
లౌక్యం... చాకచక్యం
‘కండబలముతోనే ఘనకార్యమ్ము సాధించలేరు... బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరించగలరు...’ అనే కృష్ణబోధను సరిగ్గా ఆకళింపు చేసుకున్నాడా కుర్రాడు. కొండల్ని పిండిచేసే కండబలం ఉన్నా.. బుద్ధిబలమే అతని ఆయుధం. లౌక్యం, చాకచక్యం అతని శంఖచక్రాలు. అసాధ్యమనుకున్నదాన్ని చిరునవ్వుతోనే సుసాధ్యం చేసేయడం అతని స్టైల్. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్యా క్రియేషన్స్ వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో గోపీచంద్ పాత్ర తీరుతెన్నులు ఇలాగే ఉంటాయి. గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లక్ష్యం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రతిష్ఠాత్మకంగా శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ ఇందులో కథానాయిక. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ నెల 11తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. 25 నుంచి 30 వరకూ క్లైమాక్స్ చిత్రీకరిస్తాం. ఆగస్టులో మూడు పాటలను విదేశాల్లో, రెండు పాటలను హైదరాబాద్‌లోనూ చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ- ‘‘గోపీచంద్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్రచిత్రణ గమ్మత్తుగా ఉంటుంది. బ్రహ్మానందం పాత్ర ఓ హైలైట్. హంసానందిని స్పెషల్ కేరక్టర్ చేస్తున్నారు. ఆమెపై ఓ పాట కూడా ఉంటుంది. అనూప్ రూబెన్స్ అయిదు పాటలకు అద్భుతమైన స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. చంద్రమోహన్, పోసాని, కోవై సరళ, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, కెమెరా: వెట్రి, ఎడిటింగ్: శేఖర్.