‘టాలీవుడ్‌లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఆ సినిమా తమిళ రీమేక్ నేను చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను’అని తమిళ హీరో భరత్ అన్నారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన...చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ‘హంట్’లో కీలక పాత్ర పోషించారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మా త వి. ఆనం ద ప్రసాద్ నిర్మిం చారు. మహేష్ దర్శకత్వం వహిం చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుం ది.
ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేదు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా.
నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment