![Sudheer Babu Speech At Hunt Movie Pre Release Press Meet - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/23/Sudheer-Babu.jpg.webp?itok=_iqo71wo)
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు.మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ ఏ.ఎమ్.బి. మాల్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్. మావయ్య చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ. ఆయన లేని వెలితి కనిపిస్తుంది. నా ప్రతి సినిమా ఫస్ట్ షో చూసిన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు నేను అది మిస్ అవుతా.
మావయ్య చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారట. ఇది నాకు గర్వకారణం. కెరీర్‌లో ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉంటాను' అంటూ సుధీర్ బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment