సుధీర్‌బాబు హంట్‌కు హాలీవుడ్‌ యాక్షన్‌ టచ్‌ | Hollywood Action Directors For Hunt Movie | Sakshi
Sakshi News home page

Sudheer Babu: సుధీర్‌బాబు 'హంట్‌'కు హాలీవుడ్‌ యాక్షన్‌ టచ్‌

Nov 25 2022 4:13 PM | Updated on Nov 25 2022 4:15 PM

Hollywood Action Directors For Hunt Movie - Sakshi

హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. 

సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు పని చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. 

సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. 'హంట్' మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు.

చదవండి: మరో భాషలో వస్తున్న కాంతార, రిలీజ్‌ ఎప్పుడంటే?
బాలీవుడ్‌ నటిపై నిఖిల్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement