‘‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా యూనివర్సల్ పాయింట్‌తో రూపొందింది. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు మధ్య నడిచే ముక్కోణపు ప్రేమకథ అని చెప్పాచ్చు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని సుధీర్ బాబు అన్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆర్ణ జోడీగా నటించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. వి సెల్యులాయిడ్స్, కామ్ ఎంటర్‌టైన్ మెంట్‌పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు పంచుకున్న విశేషాలు...
⇒ అభిలాష్ చేసిన ‘లూజర్’ సిరీస్ చూశా.. బాగా నచ్చింది. తను ‘మా నాన్న సూపర్ హీరో’ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తిస్థాయిలో ఫాదర్ ఎమోషన్ ఉన్న సినిమాలు అరుదు. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు కథ ఇంతకుముందెన్నడూ రాలేదు. ‘మా నాన్న సూపర్ హీరో’ మొదటి చిత్రం. నా కెరీర్‌లో చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. మానవ సంబంధాలపై ఉన్న ఈ పాయింట్ కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. మొదటి ఆట నుంచే ఆడియన్ ్స, క్రిటిక్స్ నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకం ఉంది.
⇒ ‘హరోం హర’ సినిమాకి ముందే ‘మా నాన్న సూపర్ హీరో’ కి ఒప్పుకున్నా. అయితే ఫలానా జోనర్‌లో సినిమా చేయాలని నేనెప్పుడూ ప్రణాళిక వేసుకోను. ఒక నటుడిగా అన్ని జోనర్ సినిమాలు చేయాలి. నాకు వచ్చిన కథల్లో ఏది బాగుంటే అది చేస్తాను. అలా వచ్చిన కథే ‘మా నాన్న సూపర్ హీరో’. నాన్నపై కొడుకు ప్రేమని ‘యానిమల్’ సినిమాలో అగ్రెసివ్ అండ్ బోల్డ్‌గా చూపించినా జనాలకి నచ్చింది. కానీ, ‘మా నాన్న సూపర్ హీరో’ లో నాన్నమీద కొడుకుకి ఉన్న లవ్‌ని ప్రేమతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. సన్నివేశాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. రియల్ లైఫ్‌లో మా నాన్నగారు చాలా క్రమశిక్షణ గల మనిషి. ఆయన క్రమశిక్షణ మా అక్కకి, నాకు స్ఫూర్తినిచ్చింది.
⇒ మహేశ్ బాబుగారు మా చిత్రం ట్రైలర్ చూసి మనసుని తాకింది అన్నారు. ట్రైలర్ చివర్లో వచ్చే మహేశ్ బాబు పేరు ఉన్న డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా వినోదాత్మకంగా ఉందని చెప్పారు. నా సినిమాల గురించి ఇంత చెప్పడం ఇదే తొలిసారి. యువీ క్రియేషన్ ్స విక్కీ, వంశీ, సునీల్, నేను కలిసి 2002లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్ల బ్యానర్‌లో నేను హీరోగా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఎలాగైనా హిట్ కొట్టాలనే బాధ్యత ఉంది.
వందశాతం హిట్ కొడతామనే నమ్మకం వచ్చింది. సాయిచంద్, సాయాజీ షిండేగార్లతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమా ఫైనల్ ఔట్‌పుట్ చూశాక నా నమ్మకాన్ని అభిలాష్ నిలబెట్టుకున్నాడనిపించింది. తను భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.. మంచి సినిమాలు తీస్తాడు. జై క్రిష్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. నా కెరీర్‌కి ఉపయోగపడే, వైవిధ్యమైన పాత్ర ఉంటే విలన్‌గా చేస్తాను. నా తర్వాతి సినిమా ‘జటాధరా’ నవంబరులో ్రపారంభం అవుతుంది. ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 70ఎంఎం బ్యానర్‌లో మరో చిత్రం చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment