‘హాంట్’ టైటిల్ పై వివాదం.. నోటీసులు పంపిన చిత్ర బృందం | Hunt Title Issue: Sri Creations Banner Sent Notice To Producers Council And Bhavya Creations | Sakshi
Sakshi News home page

‘హాంట్’ టైటిల్ పై వివాదం.. నోటీసులు పంపిన చిత్ర బృందం

Published Sun, Oct 23 2022 6:35 PM | Last Updated on Sun, Oct 23 2022 6:35 PM

Hunt Title Issue: Sri Creations Banner Sent Notice To Producers Council And Bhavya Creations - Sakshi

గత కొన్నిరోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న ఈ వివాదం లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది. శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో జూలై లొనే హాంట్ అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరుపున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ నోటీసులు పంపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  డైరెక్టర్, హీరో నిక్షిత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో  మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తరువాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్‌తో అప్లై చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్స్ రిజెక్ట్ చేశాయి. ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు. అందుకే మా లాయర్ ద్వారా వాళ్లందిరికి నోటీసులు పంపించాం. మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం’ అని అన్నారు.


‘చాలా ఖర్చు పెట్టి సినిమా తీశాం. ఇప్పుడు టైటిల్‌ ఇష్యూ వల్ల బిజినెస్‌కి ఇబ్బంది అవుతుంది. మా టైటిల్‌ మాకు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం’అని నిర్మాత నర్సింగరావ్‌ అన్నారు. ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో అధినేత, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్‌ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్స్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉందని చెప్పాయి. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్స్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్  తప్పును వారే తెలుసుకోవాలి. ఎవరికి అన్యాయం జరగవద్దు అనేది నా కోరి’అని​ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement