బాలయ్యని మళ్లీ వాడేస్తున్నాడు! | Naga Shourya New Movie Title Nari Nari Naduma Murari | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 10:11 AM | Last Updated on Thu, Jun 28 2018 10:11 AM

Naga Shourya New Movie Title Nari Nari Naduma Murari - Sakshi

ఛలో సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అమ్మమ్మగారిల్లు సినిమాతో మరో డిసెంట్‌ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో సొంత బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య ఇటీవల భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో మరో సినిమాను ప్రారంభించాడు. సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ప్రారంభించి సౌందర్య మరణంతో మధ్యలో ఆపేశారు.

ఇప్పుడు భవ్య క్రియేషన్స్‌ సినిమాకు కూడా బాలయ్య టైటిల్‌నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగశౌర్య లవర్‌బాయ్‌గా కనిపించనున్న ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. బాలయ్య సూపర్‌ హిట్ సినిమాల్లో నారి నారి నడుమ మురారి ఒకటి. నాగశౌర్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్‌ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement