‘‘నాకు బయటి ప్రొడక్షనే కంఫర్ట్‌గా ఉంటుంది (నవ్వుతూ). సొంత ప్రొడక్షన్ అయితే కాస్త టెన్షన్‌గా ఉంది. సినిమా రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించను. మా అమ్మానాన్నలు నన్ను నమ్మి సినిమా తీశారు.వేరే ప్రొడక్షన్ హౌస్‌లో చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉంటానో సొంత సినిమాకీ అలానే ఉంటాను. మా అమ్మ ఫస్ట్ క్రిటిక్. ఆవిడకు నచ్చితే చాలామంది ప్రేక్షకులకు నచ్చుతుందని నా ఫీలింగ్’’ అన్నారు నాగశౌర్య. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన సినిమా ‘ఃనర్తనశాల’. ఈ నెల 30న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు....
►ఈ సినిమా కథ విన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ట్రాన్స్‌జెండర్స్‌ను సినిమాలో తప్పుగా చూపించలేదు. ‘నర్తనశాల’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు ఆ టైటిల్‌తో స్టార్ట్ చేసిన సినిమాలు ఆగిపోయాయాని డాడీకి ఎవరో చెప్పారు. అందుకే ‘ః’ సింబల్ వాడాం. జస్ట్ సెంటిమెంట్ కోసమే కాదు సినిమాకి కూడా యాప్ట్ అవుతుంది. పాత ‘నర్తనశాల’ సినిమా చూసినవాళ్లు మా సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఠి ఈ చిత్రంలో మహిళా సాధికారతను సపోర్ట్ చేసే క్యారెక్టర్ హీరోది. అమ్మాయిలను ధైర్యవంతులుగా తయారు చేస్తుంటాడు. ఈ టైమ్‌లోనే అతన్ని ఇద్దరు హీరోయిన్లు లవ్ చేస్తుంటారు. అయితే నెక్ట్స్ ఏంటీ? అతను నిజంగా గేనా? లేక ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? అనేది థియేటర్‌లో చూడాలి.
►క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. మహిళలు తిరగబడినప్పుడే ఇలాంటివి ఆగుతాయి. అమ్మాయిల పట్ల తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ నుంచి శిక్ష మొదలైతే తప్పు చేయాలనుకునేవాళ్లు భయపడతారు. ఠి నా ప్రతి సినిమాలో నా నటన మా అమ్మకు నచ్చుతుంది. కానీ సినిమాలు నచ్చలేదని చెప్పేది. ఎందుకంటే నేను సినిమాల్లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. రఫ్. ‘ఛలో’లో చేసిన పాత్రలా రియల్ లైఫ్‌లో ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో నా పెళ్లి టాపిక్ వస్తోంది. త్వరగా చేసుకోవాలి. ఠి రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌లో ఓ సినిమా ఉంటుంది. వెబ్‌సిరీస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నటించాలని ఉంది. చూడాలి.
► స్టార్ట్‌డమ్ అనేది అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్‌లను దేవుళ్లలా పూజించేవారు. ఆ తర్వాత చాలామంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడు చిరంజీవిగారు, బాలకృష్ణగారు, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటే అది. తమిళనాడులో, మన దగ్గర, కేరళలో కానీ పెద్ద హీరోలందరినీ సెకండరీ దేవుళ్లులా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినవాళ్లు ‘మా సినిమాలు చూడండి.. మా సినిమాలు చూడండి’ అని అడుగుతున్నారు అంటే దేవుడే వచ్చి మా గుడికి రండీ అంటే ఏ భక్తుడు నమ్ముతాడు. అందరూ స్టార్ట్ అవ్వాలనే ట్రై చేస్తారు. అది తప్పు కాదు. కానీ అది రావడానికి 30 ఏళ్లు పడుతుంది. అది తెలుసుకోవాలని చెబుతున్నాను. సడన్‌గా ఎవరో వచ్చి స్టార్ అంటే..? నేనెవరి గురించీ నెగటివ్‌గా కామెంట్స్ చేయడం లేదు. ఆ మధ్య నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. నా కామెంట్స్ విజయ్ దేవరకొండకు సంబంధించినవి అనడం తప్పు. అతన్ని చూసి నాకు ఎలాంటి అసూయ లేదు. నేను చేసే సినిమాలు వేరు. అతను చేసే సినిమాలు వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా. అతని సినిమా హిట్ సాధించడం వల్ల మిగతావారికి సినిమాలు పోవు కదా?. మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. ఎవరో పెట్టారంతే.
నేను కాస్త రఫ్!
Published Wed, Aug 29 2018 12:39 AM | Last Updated on Wed, Aug 29 2018 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment