Narthanasala
-
ఎన్టిఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి
ఒక్క బాణాన్ని సంధించి ఏడు తాటిచెట్లను కూల్చిన శ్రీరామచంద్రుణ్ణి విని ఉంది తెలుగుజాతి. నూరు తప్పులను కాచి సుదర్శనాన్ని విడిచి శిశుపాలుని వధించిన కృష్ణలీల తెలుసు తెలుగుజాతికి. ఉగ్రరూపం దాల్చి రుద్ర తాండవమాడిన శివుడి జటాజూటాలు ఎలా ఉంటాయో ఊహకే పరిమితమాయె. పది శిరస్సుల రావణుడి రుధిర నేత్రాల తీక్షణత– చూడతరమా! గాండీవం చేబూనిన పార్థుడు– గదాధారి భీముడు– పంచభర్తృకకు తొడను చూపి ఆసీనురాలు కమ్మని సైగ చేసిన సుయోధనుడు... వినీ వినీ ఉన్నారు. అప్సరసలు కూడా వివశులయ్యే అందాల రాకుమారుడు– రాకుమారిని తెగించి వరించే తోట రాముడు– అష్టదిగ్గజాలతో పదములల్లే దేవరాయడు– పల్నాట బ్రహ్మనాయుడు... పొరుగునే పాండురంగడు... విన్నారయ్యా విన్నారు.. చూసేదెప్పుడు? వారి ఎదురుచూపు ఫలించింది. తెలుగు తెర వరము పొంది మురిపాల నటుడిని ప్రసవించింది. ఇదిగో ఇతడే నందమూరి తారక రామారావు అని పోస్టర్లేసి ప్రకటించింది. తదాదిగా తెలుగుజాతికి వినే బాధ తప్పింది. వారు ప్రతి పురాణాన్ని చూశారు. ప్రతి వేల్పును తిలకించారు. ప్రతి కథకు పరవశించారు. మరో వెయ్యేళ్లు ఈ అపురూపాన్ని దర్శిస్తారు. తెలుగు తెరకే ఇది సొంతం. తెలుగు నేలదే ఈ భాగ్యం. నేడు ఎన్టిఆర్ శతజయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం. విజయా స్టూడియో అధినేత నాగిరెడ్డి దగ్గరకు ఆ స్టూడియోలో జీతానికి పని చేసే ఆర్టిస్టులు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. కాని నెలకు 500 రూపాయల జీతం, సినిమాకు ఐదు వేల రూపాయల పారితోషికం కాంట్రాక్టు మీద కొలువుకు చేరిన కొత్త నటుడు ఎన్.టి. రామారావు ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ‘ఏంటి రామారావ్’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్.. క్యాంటిన్లో మీరు నాకు ఇవ్వమని అలాట్ చేసిన టిఫిన్ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు. సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్ అని నిర్దేశించారు. ఎన్.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్‌కు కొత్త ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర. ‘మాయాబజార్’ తర్వాత ఎన్.టి. రామారావుతో ‘లవకుశ’ తీయాలని నిశ్చయించుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. దర్శకుడు బి.ఎన్. రెడ్డి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. బి.ఎన్. రెడ్డి అంటే ‘మల్లీశ్వరి’ తీసి సినిమాకు ‘కళాఖండం’ అని ఉపమానం ఇచ్చినవారు. బి.ఎన్. రెడ్డి, రచయిత పాలగుమ్మి పద్మరాజు బెంగళూరు వెళ్లి 20 రోజులు ఉండి ఒక వరుస కథ రాసుకొని వచ్చారు ‘లవకుశ’ కోసం. చక్రపాణిని కూచోబెట్టి బి.ఎన్. నెరేషన్ ఇస్తున్నారు. ‘సీత శోకంలో ఉంది. రాముడి వీపు మాత్రమే కనిపిస్తూ ఉంది. తనను అడవులపాలు చేసినందుకు సీత రాముణ్ణి నిందిస్తూ ఉంది. రెండో సీను... రాముడి వీపునే చూపిస్తూ సీత శోకం. మూడో సీను..’ చక్రపాణి లేచి నిలబడ్డారు. ‘అందమైన ఎన్.టి. రామారావును పెట్టుకుని వీపు చూపిస్తూ రెండు సీన్లా. ఈ సినిమా ఆడినట్టే’ స్క్రిప్ట్ మూల పడేశారు. ఎన్.టి. రామారావు సినిమాలో ఉంటే మొదటి సీను నుంచి చివరి సీను వరకూ చూసుకోవడమే ప్రేక్షకుల పని. ఆ తర్వాత కొన్నేళ్లకు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ వచ్చింది. సీత శోకం చూడాలా రాముడి ఆవేదన చూడాలా... పల్లె జనాలు ఎడ్లబండ్లు వేసుకొని వచ్చి చెట్ల కింద పడుకుని సినిమా చూసి వెళ్లేవారు. 500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. రాముడి గొప్పతనమో... తారక రాముని నటనావైదుష్యమో. ‘బేడకు సినిమా’ అనేవారు ఆ రోజుల్లో. అంటే రెండు అణాలకు సినిమా. ఆ రెండు అణాలు ఇచ్చి సినిమా చూడటానికి కూడా జనం దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అప్పటికి పదేళ్లకు కాస్త అటు ఇటుగా తెలుగు సినిమాలు మొదలయ్యాయి. మద్రాసుకు కళాకారులు చేరుకున్నారు. ‘ఆర్టిస్టు’ను గుర్తు పట్టి సినిమాలు చూడటం అనేది సీనియర్ శ్రీరంజని (జూ. శ్రీరంజని అక్క)తో మొదలయ్యింది. నాటకాల్లో మాదిరే ‘పాడి నటించేవారికి’ డిమాండ్ కనుక చిత్తూరు నాగయ్య, బళ్లారి రాఘవ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు సింగింగ్ స్టార్స్ అయ్యారు. బెరుకు లేకుండా స్లీవ్‌లెస్ జాకెట్ వేసిన కాంచన మాల, భానుమతి క్యాలెండర్ స్టార్లుగా వెలిగారు. సీహెచ్ నారాయణరావు సుకుమార సౌందర్యం గల తొలి తెలుగు హీరో. అప్పుడు అక్కినేని రంగప్రవేశం చేసి ‘బాలరాజు’తో జాక్‌పాట్ కొట్టారు. కాని భారతీయ ఆత్మను, ఇతిహాసాన్ని, పౌరాణిక ఘనతను, చారిత్రక ఘటనలను, భక్తి ఉద్యమాలను, జానపద సంపదను, సాంఘిక జీవనాన్ని, కార్మిక కర్షకుల ప్రాతినిధ్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను చూపే ఒక నాయకుడు, ఆ నాయకుడి చరిష్మా అవసరమయ్యింది. అది ఎన్.టి. రామారావు రూపంలో సంభవించింది. ఎంటైర్ సౌత్‌లో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్... వీరందరూ గొప్ప జనాకర్షణ కలిగిన సినీ నాయకులే అయినా ఎన్.టి.ఆర్ చేసినవన్నీ చేయలేదు. ఎన్.టి.ఆర్ చేసినంత చేయలేదు. ఉత్తరాదిన ముగ్గురు సూపర్స్టార్లలో రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్ ప్రధానంగా మెట్రో మనుషుల రిప్రెజెంటేటివ్స్. దిలీప్ కుమార్ మాత్రమే ఫోక్లోర్, హిస్టారికల్ (మొఘల్ ఏ ఆజమ్) చేశాడు. కాని మైథాలజీ వీరి ముగ్గురి పరిధిలో లేదు. రాజ్ కపూర్ దర్శకుడుగా గొప్పవాడు. సుదీర్ఘమైన సినిమా ‘మేరా నామ్ జోకర్’ (4 గంటల 13 నిమిషాలు) తీశాడు. దాని ఫలితం నిరాశ కలిగించింది. ఎన్.టి.ఆర్ కూడా దర్శకుడిగా సుదీర్ఘమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) తీశారు. 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర సినిమా. రికార్డులలో శూర సినిమా. పిల్లలకు నచ్చాలి ఫస్ట్. జేమ్స్‌బాండ్ సినిమాలు ఎందుకు నిలుస్తాయంటే, సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటి సూపర్ హీరోలు ఇన్నేళ్లయినా ఎందుకు ఉన్నారంటే వాళ్లు పిల్లలకు నచ్చుతారు. తమకు నచ్చినవారిని పిల్లలు పెద్దయినా వృద్ధులైపోయినా అభిమానిస్తూనే ఉంటారు. ‘పాతాళభైరవి’ అక్కినేనితో తీయాలా, ఎన్.టి.ఆర్తో తీయాలా అనే సందేహం వచ్చింది విజయా వారికి. కె.వి. రెడ్డి మనసు అక్కినేని మీద ఉంది. నాగిరెడ్డి–చక్రపాణి ఎంపిక ఎన్.టి.ఆర్ మీద ఉంది. నీ మాట వద్దు నా మాట వద్దు అని మరో నటుణ్ణి వెతుకుదాం అని కూడా అనుకున్నారు (తుపాకుల రాజారెడ్డి అనే నటుడితో రెండు రీళ్లు తీశారని ఒక కథనం). చివరకు ఒకరోజు అక్కినేని, ఎన్.టి.ఆర్ స్టూడియో కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటే ఎన్.టి.ఆర్ బంతిని బాదుతున్న స్టయిల్, క్రీడాగ్రహం చూసి ‘ఇతనే కరెక్ట్’ అనుకున్నారు కె.వి. రెడ్డి. అలా తోట రాముడుగా ఎన్.టి.ఆర్ సాహసం చేశారు. ప్రేమ కోసం వలలో పడ్డారు. నేపాళ మాంత్రికుడి తల నరికి పాతాళ భైరవి కరుణతో పాటు ప్రేక్షకుల కాసులు పొందారు. ఇది పెద్దలతో పాటు పిల్లలకు నచ్చింది. వారికి ఒక హీరో దొరికాడు. ఆ తర్వాత ఈ పిల్లలే ‘మాయాబజార్’ చూశారు. ఊరికే అలా చేతిని గాలిలో కదిపి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కృష్ణుడు. మహా బలసంపన్నుడైన ఘటోత్కచుడే ముసలి వేషంలో ఉన్న కృష్ణుడి రెక్క పట్టుకు లేపలేకపోతాడు. ఆ కృష్ణబలం ఎన్.టి.ఆర్‌దే. ఇక ఆ పిల్లలు ఎన్.టి.ఆర్ని వదల్లేదు. ఎన్.టి.ఆర్ కూడా చందమామ పత్రికలో కనిపించే జానపదాలు, భట్టి విక్రమార్క కథలు, భక్తుల కథలు, వ్రత కథలు, అరేబియన్ నైట్స్ చేస్తూనే వెళ్లారు. గులే బకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ... అరేబియన్ నైట్స్ ఆధారితాలే. తెలుగు పిల్లల బ్రూస్లీ ఎన్టీఆరే (యుగ పురుషుడు). సూపర్‌మేన్ ఆయనే (సూపర్ మేన్). టార్జాన్ ఆయనే (రాజపుత్ర రహస్యం). ఎల్విస్ ప్రెస్లీ ఆయనే (ఆటగాడు). ఒక కళాకారుడికి ఎంతో నిర్మలత్వం, అమాయకత్వం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడు. ఎన్.టి.ఆర్ చేశారు. ఆ నిర్మలత్వమే పిల్లలకు నచ్చుతుంది. అందుకే పిల్లల వినోద సామ్రాజ్యానికి అధిపతి ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్కు ద్రవిడ స్పృహ ఉంది. ప్రాంతీయ చైతన్యం ఉంది. ‘టెక్ట్స్’ను పరుల కంటితో కాక స్వీయ దృష్టితో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. జనంకు ఏదైనా చెప్పడానికే ఆయన ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్’ అనే నాటక సంస్థను బెజవాడలో స్థాపించారు. నిర్మాతగా మారాక కూడా ‘తోడు దొంగలు’ వంటి సందేశాత్మక సినిమాయే తీశారు. ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన హీరో ఆ వెంటనే ‘రాజూ పేద’లో కన్న కొడుకును అడుక్కు రమ్మని పంపే పోలిగాడి పాత్రను చేస్తాడా? ‘డ్రైవర్ రాముడు’ వంటి మాస్ హిట్ ఇచ్చి ఆ వెంటనే భార్య లేచిపోయిన భర్తగా ‘మావారి మంచితనం’లో నటిస్తాడా? ఆయన ప్రయోగశీలి. అందుకే ‘హీరోగా చేయడానికి’ ఏమీ లేకపోయినా తెలుగువారి రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన నటించాడు. తన పేరు మీద టైటిల్ లేకపోయినా ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా నటించాడు. అలాగే ఆయనకు పురాణాలను దర్శించే పద్ధతి వేరేగా ఉండేది. ‘రావణుని పాత్రను చేస్తాను... డైరెక్ట్ చేయండి’ అని కె.వి. రెడ్డి దగ్గరకు వెళితే ‘కృష్ణుడిగా చూపించిన నేను రావణుడిగా చూపించలేను. జనం చూడరు’ అన్నారు. కాని ఎన్.టి.ఆర్ ‘సీతారామ కల్యాణం’ లో రావణుడి పాత్ర వేసి మెప్పించి, ఘన విజయం సాధించారు. తెలుగువారు ‘దుష్ట చతుష్టయం’గా చెప్పుకునే వారిలో ఇద్దరు గూర్చిన దృష్టిని సమూలంగా మార్చాడాయన. భారతంలో దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది అని పదేపదే చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన రావి కొండలరావుతో ఎన్.టి.ఆర్ ‘బ్రదర్... దుర్యోధనుడికి డ్యూయెట్ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రావి కొండలరావుకు ఈ ప్రశ్న నేపథ్యం ఏ మాత్రం తెలియదు. ఆయన రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్.టి.ఆర్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్ ఎదుట పడితే ఒట్టు. ఎన్.టి.ఆర్ దుర్యోధనునికి డ్యూయెట్ పెట్టి ‘చిత్రం... భళారే విచిత్రం’ అనిపించారు. ఇక ఎన్.టి.ఆర్కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్’ కారణం. శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్’కు మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్.టి.ఆర్. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్.టి.ఆరే చెప్పగలరు. హితుడా... ఆగాగు ఏమంటివి ఏమంటివి... నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్.టి.ఆర్ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్ ఈ డైలాగ్. ప్రదర్శించడం మాత్రమే కళ కాదు. కొనసాగడమే కళ. అంటే కొనసాగేందుకు ఎప్పటికప్పుడు సృజన సామర్థ్యాలను కల్పించుకోవడమే కళ. తెలుగు నాట ఎన్.టి.ఆర్, అక్కినేని... ఇద్దరూ సుదీర్ఘంగా కొనసాగేందుకు కంకణబద్ధులై ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ వెళ్లారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’లాగా అక్కినేనికి ‘దేవదాసు’ ఒక పెద్ద మైలురాయిగా మారింది. మిడిల్ క్లాస్, ఎలైట్ సెక్షన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకుల బలంతో అక్కినేని కొనసాగితే ఆబాల గోపాలాన్ని మెస్మరైజ్ చేస్తూ ఎన్.టి.ఆర్ కొనసాగారు. తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్‌కు పేటెంట్ ఎన్.టి.ఆర్ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్.టి.ఆర్ ‘అక్బర్ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్.టి.ఆర్ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్.టి.ఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్’ చిన్న రసాలు.. పెద్ద రసాలు. నిజం చెప్పాలంటే ఎన్.టి.ఆర్కు కె.వి. రెడ్డి తర్వాత గట్టి దర్శకుల బలం లేదు. అక్కినేనికి ముందు నుంచి భరణి రామకృష్ణ, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదనరావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ తదితరులు కొనసాగారు. తర్వాతి తరం కృష్ణ, శోభన్‌బాబు వచ్చాక కొత్త దర్శకులు వీరితో సినిమాలు చేయసాగారు. అయినా సరే ఎన్.టి.ఆర్ తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్.టి.ఆరే సూట్ అయ్యారు. అమితాబ్ ‘జంజీర్’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్’ – ‘యుగంధర్’గా, రాజేష్ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు. 39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్.టి.ఆర్కు బలం దొరికింది. కె. రాఘవేంద్రరావు ఎన్.టి.ఆర్‌ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి భారీ హిట్స్ ఇవ్వడం ఎన్.టి.ఆర్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్.టి.ఆర్ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది. కాని మహా నటులకు కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటి రావడమే కళాకారులు చేయవలసిన పని అని ఎన్.టి.ఆర్ కెరీర్ చూసినా అర్థమవుతుంది. ఎన్.టి.ఆర్ నటించిన ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి భారీ అపజయాలు ఉన్నాయి. కాని ఈ అపజయాలు చూసిన ఎన్.టి.ఆర్ సినిమా కథ గ్రామర్‌లో ఇమడని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను సినిమాగా తీసి సూపర్‌హిట్ సాధించడం మరచిపోరాదు. ‘నర్తనశాల’ లో బృహన్నలగా వేసి మెప్పించడమూ సామాన్యం కాదు. అయితే ఎన్.టి.ఆర్‌లోని నిజమైన ఆర్టిస్టును పట్టుకున్న సినిమాలు ఆయనకు దొరికినట్టేనా? ఆయన తనలోని నటుడిని పరిపూర్ణంగా ప్రదర్శించగలిగాడా? చెప్పలేము. కమర్షియల్ సినిమా ఆయన ప్రతిభకు పరిమితులు విధించిందనే చెప్పాలి. ఎన్.టి.ఆర్ చూడగానే సంతోషం వేసే నటుడు. ఆయన రిక్షా వెనుక బొమ్మగా ఉన్నాడు. పూజగదిలో దేవుని క్యాలెండర్‌గా కూడా ఉన్నాడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కష్టాలను కొన్ని గంటల పాటు మరిపించగలిగాడాయన. ఆయన పేరును తెలుగుజాతి పదే పదే తలుస్తుంది. గౌరవంతో కొలుస్తుంది. ఎన్.టి.ఆర్ అమరుడు. -
వచ్చిన వాడు ఫల్గుణుడే...
సముద్రాల రచన చేసిన సినిమా, ‘నరవరా ఓ కురువరా’లాంటి ఆణిముత్యం పాటలు ఉన్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... విరాట మహారాజు కుమారుడు ఉత్తరుడితో ఉల్లాసంగా ఉన్నవేళ... ‘‘శరణు మహారాజా! శరణు!!’’ అంటూ పిడుగుపాటులాంటి వార్తను మోసుకొని వచ్చారు చారులు. సుశర్మగారి సైనికులట... దక్షిణ అలమందను దారిమళ్లించారు... ‘‘కీచకుడు మరణించాడన్న వార్త విని ఆ కిరాతకుడు ఈ నీచానికి తలపెట్టాడు..’’ ఆవేశంతో ఊగిపోతున్నాడు విరాటమహారాజు. ‘‘సెలవియ్యండి మహారాజా! ఆ సుశర్మను వారి సేనల్ని పిండిపిండి చేసి మన మందల్ని మళ్లించుకొస్తా’’ అని తనదైన శైలిలో వీరకోత కోశాడు ఉత్తరుడు. ‘‘గతాన్ని మరచి కర్తవ్యాన్ని ఆలోచించండి మహారాజా!’’ కర్తవ్యబోధ చేశాడు మంత్రి. ‘‘సేనలను యుద్ధానికి సంసిద్ధం చేయించండి’’ అని అరిచాడు విరాటుడు. అదిగో అర్జునుడి శంఖారావం! ‘‘ఆపండి ఆచార్యా! శిష్యవాత్సల్యంతో పాండవ పక్షపాతంతో పార్థుణ్ణి ప్రశంసించి మమ్ము అవమానిస్తున్నారు’’ ఆవేశపడ్డాడు కర్ణుడు. ‘‘కర్ణా, ఆచార్యులవారినే అధిక్షేపిస్తావా! శౌర్యవంతుడైన శత్రువును శ్లాఘించడం వీరధర్మం. ప్రియ శిష్యుడిని ప్రశంసించడం గురువుకి అధర్మం కాదు’’ అన్నాడు అశ్వత్థామ. ‘‘శాంతించు గురుపుత్రా! ఇది అంతఃకలహాలు, ఆవేశాలకు అదను కాదు. వచ్చినవాడు ఫల్గుణుడే అయితే ఇక మన పంతం నెవరేరినట్లే. అజ్ఞాతవాస నియమభంగంతో పాండవులు తిరిగి పన్నేండేళ్ల అరణ్యవాసం చేయాలి’’ ఏదో కనిపెట్టినట్లుగా అన్నాడు దుర్యోధనుడు. ‘‘ఇది పొరపాటు రారాజా! పాండవులు అంత అవివేకంగా ప్రవర్తించరు. అధిక మాసాలతో కలిసి నిన్నటితో గడువు తీరిపోయింది. అది తెలిసే అర్జునుడు సమరాభిలాషిౖయె సమీపిస్తున్నాడు’’ ఉన్న విషయం చెప్పాడు భీష్ముడు. ‘‘తాతగారు! ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. ఖడ్గమే కార్యసాధనమని మా నిర్ణయం’’ గంభీరంగా అన్నాడు దుర్యోధనుడు. ‘‘దైవేచ్ఛ! జరగనీ’’ శాంతస్వరంతో అన్నాడు భీష్ముడు. ‘‘ఉత్తరకుమరా! అదిగో రారాజు కర్ణ సహాయుడై మందలతో ముందుకు సాగుతున్నాడు. మన రథం వారి ముందుకు మళ్లించు. త్రోవలో గురుదేవులకు నమస్కరించి వెళదాం’’ రథసారథి అయిన ఉత్తరకుమారుడితో అన్నాడు అర్జునుడు. కాళ్ల దగ్గర బాణాలు వేసి గురుదేవులకు నమస్కరించాడు అర్జునుడు. బాణాలతోనే నమస్కరించి కుశలం అడిగిన పార్థుడి భక్తిప్రపత్తులకు సంతోషించారు గురుదేవులు. యుద్ధం మొదలైంది... ‘‘నిలువు దుర్యోధనా! నిలువు! నీ దుర్నీతి నిష్ప్రయోజనం అయిపోతుంది. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు’’ అని దుర్యోధనుడిని కవ్వించాడు అర్జునుడు. ‘‘నిలువు ఫల్గుణా! ఈ రాధేయుణ్ణి జయించిగాని రారాజును సమీపించలేవు’’ అని దుర్యోధనుడికి వెన్నుదన్నుగా నిలిచాడు కర్ణుడు. ‘‘నీ ప్రగల్భాలు కొత్తవి కాదు కర్ణా’’ అని కర్ణుడిని అపహాస్యం చేస్తూ తన బాణంతో రారాజు గదను ఛిద్రం చేశాడు అర్జునుడు. అంతేకాదు... ‘‘మా అన్న భీమసేనుని ప్రతిజ్ఞాభంగం కారాదని నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను’’ అని దుర్యోధనుడిని వదిలేశాడు అర్జునుడు. ‘‘అర్జునుడి ధాటి తట్టుకోలేక రారాజు పడిపోయాడు. కురురాజును రక్షించండి’’ అంటూ అరుపులు వినిపించాయి. ఇదంతా చూసి ఉత్తరకుమారుడిలో సన్నగా వణుకు మొదలైంది. ‘‘ఈ భయంకర యుద్ధం చూసి నా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఇక నేను ఈ సారథ్యం చేయలేను’’ అని పారిపోవుటకు పలు మార్గాలు ఆలోచిస్తున్నాడు ఉత్తర కుమారుడు. ‘‘ఉత్తర కుమారా! ఒక క్షణకాలం పాటు ఓపిక పట్టు. ఈ సమ్మోనహానస్త్రంతో ఈ యుద్ధం పరిసమాప్తి చేస్తాను’’ అని ఉత్తరకుమారుడి భుజాల మీద చేయివేశాడు అర్జునుడు. ఆ తరువాత అర్జునుడి సమ్మోహానాస్త్రానికి శత్రుశిబిరంలో అందరూ మూర్ఛపోయారు. ‘‘ఉత్తరకుమరా! మహారాజులవారు నీ విజయవార్త కోసం ఎదురుచూస్తున్నారు. గెలుపు నీదేనని పలుకు’’ అన్నాడు అర్జునుడు. ఆశ్చర్యంగా చూశాడు ఉత్తరకుమారుడు. ‘నువ్వు విన్నది నిజమే’ అన్నట్లుగా చూసిన అర్జునుడు... ‘‘అవును. అవసరం వచ్చినప్పుడు మనమే రహస్యం బయటపెట్టవచ్చు’’ అని చెప్పాడు. ‘‘ఎప్పుడైనా నీ మాట కాదన్నానా. ఇప్పుడూ అంతే’’ వినయంగా అన్నాడు ఉత్తరకుమారుడు. కొద్దిసేపటి తరువాత నిద్రలోంచి లేచినట్లుగా లేచారు అర్జునుడి శత్రుశిబిరం వారు. ‘‘ఏడీ? ఎక్కడ అర్జునుడు! చీల్చి చెండాడుతా’’ అని అరిచాడు కర్ణుడు. ‘‘శాంతించు కుమారా! జరిగిన అవమానం చాలు. పార్థుడు దయతలచి వదిలిపెట్టాడు. మర్యాదగా మన రాజ్యానికి మళ్లడం మంచిది’’ అని విలువైన సలహా ఇచ్చాడు భీష్ముడు. ‘‘ఆడండి మహారాజా!’’ అన్నారు చదరంగం ముందు కూర్చున్న భట్టుగారు. కాని మహారాజు మనసు మనసులో లేదు. కళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న భీతి! ఇక ఆగలేక మనసులో భయాన్ని భట్టుగారి ముందు వెళ్లగక్కారు విరాట మహారాజు... ‘‘భట్టుగారు... సుశర్మను గెలిచి వచ్చిన సంతోషం కంటే ఉత్తరకుమారుని రాక జాగు అయినకొద్దీ ఆరాటం హెచ్చిపోతున్నది’’ అన్నాడు. ‘‘భయపడకు మహారాజా! బృహన్నల వెంట ఉన్నంత వరకు రాకుమారునికి ఏ భయం లేదు’’ అని ధైర్యం చెప్పారు భట్టుగారు. ‘‘ఏం బృహన్నలో ఏమో’’ అని నిట్టూర్చాడు విరాటుడు. ఈలోపు ఒకడు దూసుకువచ్చి– ‘‘జయం మహారాజా జయం! యువరాజుల వారు కౌరవులను ఓడించి మందలను మళ్లించి వస్తున్నారు’’ అన్నాడు. అంతే... విరాటుడి మోములో వేయి సూర్యప్రభలు! ‘భళా భళా’ అంటూ శుభవార్త మోసుకువచ్చిన వాడికి తన మెడలోని హారాన్ని బహుమానంగా ఇచ్చాడు. ‘‘ఉత్తరకుమారుడికి ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేయండి’’ అని ఆనందంగా ఆదేశాలు జారీ చేశాడు విరాటమహారాజు. సమాధానం: నర్తనశాల -
నా అభిమాన తార సమంత.. ఎందుకంటే..
‘కీచక’ సినిమాతో వెండితెరకు పరిచయమైన యామిని భాస్కర్ పదహారణాల తెలుగు అమ్మాయి. ‘నర్తనశాల’ సినిమాలో సత్యభామగా ఆకట్టుకుంది. ‘‘నా తెలుగు మూలాలే నా బలం’’ అంటున్న యామిని తన గురించి తాను చెప్పుకున్న విషయాలు.... నేను లోకల్ .. విజయవాడలో పుట్టిపెరిగాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. కాలేజీకి బంక్ కొట్టి సినిమాకు వెళ్లిన సందర్భాలు ఎప్పుడూ లేవు. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం సినిమాలంటే ప్యాషనేట్‌గా ఉన్నాను. దేవదాస్ కనకాలగారి దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఎంత ఇష్టమంటే... కథానాయికలలో నా అభిమాన తార సమంత. క్యూట్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కామెడీ డైలాగులు బాగా ఎంజాయ్ చేస్తాను. నవ్వించడమైనా, ఏడ్పించడమైనా, డ్యాన్స్ అయినా ఎంత బాగా చేస్తారో! ఆయన్ని ఆరాధించేంత అభిమానం. నా డ్రీమ్‌రోల్.. నా డ్రీమ్‌రోల్స్ చాలా ఉన్నాయి. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’లాంటి బలమైన పాత్ర చేయాలని ఉంది. మరి అలాంటి సినిమా వస్తుందో లేదో తెలియదుగాని చేయాలని మాత్రం ఉంది. ఎప్పుడు ఎలాంటి పాత్ర వస్తుందో తెలియదు. అలాని ‘డెస్టినీ’ గురించి పెద్దగా ఆలోచించను. ‘జస్ట్ హ్యాపన్’ అనే అనుకుంటాను. వరం.. ప్రేమ అన్నిసార్లూ దొరకదు. అది దొరికితే జీవితాంతం ఉంటుంది. అది పేరెంట్స్ నుంచి దొరకవచ్చు, ఫ్రెండ్స్ నుంచి దొరకవచ్చు. దేవుడు ప్రత్యక్షమై ‘వరం కోరుకో’ అని అడిగితే...‘‘ఈ సమాజంలో ఎన్నో అంతరాలు ఉన్నాయి. అలాంటివి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండే సమాజం కావాలి’’ అని అడుగుతాను. చిన్నప్పుడు .. చిన్నప్పుడు మా ఇంట్లో అద్దం మీద మహేష్‌బాబు ఫొటో ఉండేది. పన్నెండేళ్ల వయసులోనే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. నన్ను నటిగా చూడాలనేది మా నాన్న కల. నా ఇష్టమైన వంటకం...అన్నం, పప్పు, ఆవకాయ. ఇష్టమైన ప్రదేశం... స్విట్జర్లాండ్. -
నానికి జోడిగా ‘@నర్తనశాల’ బ్యూటీ
ప్రస్తుతం దేవదాస్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ హీరో నాని ఆ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ప్రకటించాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నాడు నాని. జెర్సీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నానికి జోడిగా నర్తనశాల ఫేం కశ్మీరా పరదేశీ నటించనున్నారు. నాని క్రికెటర్ అర్జున్‌గా నటిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
నేను కాస్త రఫ్!
‘‘నాకు బయటి ప్రొడక్షనే కంఫర్ట్‌గా ఉంటుంది (నవ్వుతూ). సొంత ప్రొడక్షన్ అయితే కాస్త టెన్షన్‌గా ఉంది. సినిమా రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించను. మా అమ్మానాన్నలు నన్ను నమ్మి సినిమా తీశారు.వేరే ప్రొడక్షన్ హౌస్‌లో చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉంటానో సొంత సినిమాకీ అలానే ఉంటాను. మా అమ్మ ఫస్ట్ క్రిటిక్. ఆవిడకు నచ్చితే చాలామంది ప్రేక్షకులకు నచ్చుతుందని నా ఫీలింగ్’’ అన్నారు నాగశౌర్య. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన సినిమా ‘ఃనర్తనశాల’. ఈ నెల 30న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.... ►ఈ సినిమా కథ విన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ట్రాన్స్‌జెండర్స్‌ను సినిమాలో తప్పుగా చూపించలేదు. ‘నర్తనశాల’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు ఆ టైటిల్‌తో స్టార్ట్ చేసిన సినిమాలు ఆగిపోయాయాని డాడీకి ఎవరో చెప్పారు. అందుకే ‘ః’ సింబల్ వాడాం. జస్ట్ సెంటిమెంట్ కోసమే కాదు సినిమాకి కూడా యాప్ట్ అవుతుంది. పాత ‘నర్తనశాల’ సినిమా చూసినవాళ్లు మా సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఠి ఈ చిత్రంలో మహిళా సాధికారతను సపోర్ట్ చేసే క్యారెక్టర్ హీరోది. అమ్మాయిలను ధైర్యవంతులుగా తయారు చేస్తుంటాడు. ఈ టైమ్‌లోనే అతన్ని ఇద్దరు హీరోయిన్లు లవ్ చేస్తుంటారు. అయితే నెక్ట్స్ ఏంటీ? అతను నిజంగా గేనా? లేక ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? అనేది థియేటర్లో చూడాలి. ►క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. మహిళలు తిరగబడినప్పుడే ఇలాంటివి ఆగుతాయి. అమ్మాయిల పట్ల తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ నుంచి శిక్ష మొదలైతే తప్పు చేయాలనుకునేవాళ్లు భయపడతారు. ఠి నా ప్రతి సినిమాలో నా నటన మా అమ్మకు నచ్చుతుంది. కానీ సినిమాలు నచ్చలేదని చెప్పేది. ఎందుకంటే నేను సినిమాల్లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. రఫ్. ‘ఛలో’లో చేసిన పాత్రలా రియల్ లైఫ్‌లో ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో నా పెళ్లి టాపిక్ వస్తోంది. త్వరగా చేసుకోవాలి. ఠి రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌లో ఓ సినిమా ఉంటుంది. వెబ్‌సిరీస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నటించాలని ఉంది. చూడాలి. ► స్టార్ట్డమ్ అనేది అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్లను దేవుళ్లలా పూజించేవారు. ఆ తర్వాత చాలామంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడు చిరంజీవిగారు, బాలకృష్ణగారు, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటే అది. తమిళనాడులో, మన దగ్గర, కేరళలో కానీ పెద్ద హీరోలందరినీ సెకండరీ దేవుళ్లులా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినవాళ్లు ‘మా సినిమాలు చూడండి.. మా సినిమాలు చూడండి’ అని అడుగుతున్నారు అంటే దేవుడే వచ్చి మా గుడికి రండీ అంటే ఏ భక్తుడు నమ్ముతాడు. అందరూ స్టార్ట్ అవ్వాలనే ట్రై చేస్తారు. అది తప్పు కాదు. కానీ అది రావడానికి 30 ఏళ్లు పడుతుంది. అది తెలుసుకోవాలని చెబుతున్నాను. సడన్‌గా ఎవరో వచ్చి స్టార్ అంటే..? నేనెవరి గురించీ నెగటివ్‌గా కామెంట్స్ చేయడం లేదు. ఆ మధ్య నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. నా కామెంట్స్ విజయ్ దేవరకొండకు సంబంధించినవి అనడం తప్పు. అతన్ని చూసి నాకు ఎలాంటి అసూయ లేదు. నేను చేసే సినిమాలు వేరు. అతను చేసే సినిమాలు వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా. అతని సినిమా హిట్ సాధించడం వల్ల మిగతావారికి సినిమాలు పోవు కదా?. మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. ఎవరో పెట్టారంతే. -
మమ్మల్ని కించపరుస్తారా?
సాక్షి, హైదరాబాద్: కొంత మంది హిజ్రాలు మంగళవారం తెలుగు ఫిల్మ్‌చాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘@నర్తనశాల’ మూవీలో హిజ్రాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా చిత్రికరించిన సన్నివేశాలను తొలిగించాలని లేకుంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్లో నాగశౌర్య ‘గే’ లా నటించిన సీన్స్.. అతనికి తండ్రి పాత్ర పోషించిన శివాజీ రాజా ‘నా కొడుకు గే నా’ అని చెప్పిన డైలాగ్స్‌పై హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సముదాయించిన శివాజీరాజా హిజ్రాల ఆందోళనపై శివాజీరాజా స్పందించారు. తన చాంబర్ లోకి పిలిపించుకొని హిజ్రాలను సముదాయించారు. హిజ్రాల కోసం ప్రత్యేకంగా నర్తనశాల ప్రదర్శన వేయిస్తానని హామీయిచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలు, దృశ్యాలను తొలగించేందుకు నిర్మాతలతో చర్చిస్తానని తెలిపారు. -
ఏ పాత్రకి అదే ప్రత్యేకం
కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్... ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో మెరవబోతున్న కథానాయికలు. నాగశౌర్య హీరోగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. కశ్మీరా పరదేశి మాట్లాడుతూ – ‘‘నా మాతృభాష మరాఠి. పూణెలో పుట్టి, పెరిగా. ముంబై నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నప్పుడే మోడలింగ్ చేశా. ‘నర్తనశాల’ ఆడిషన్స్‌కి వచ్చా. నవరసాలను అభినయించమన్నారు. చేయగానే నచ్చడంతో కథానాయికగా తీసుకున్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో ఉషా ఆంటీ సాయం చేశారు. దర్శకుడు చక్రవర్తిగారు నాకు గురువులాంటివారు. ఈ చిత్రంలో నా పాత్ర లవబుల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. నా ప్రేమికుడే నా బలం అన్నట్టు ఉంటుంది. మరో హీరోయిన్ యామినీ ఉన్నప్పటికీ ఏ పాత్రకి అది స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి. నాకు హిప్హాప్, కథక్ డ్యాన్సులు వచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు. యామినీ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి, పెరిగింది విజయవాడ. గతంలో ‘కీచుక’ అనే సినిమా చేశా. అందులో నా నటనకి మంచి అభినందనలు వచ్చాయి. కానీ, ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ‘నర్తనశాల’ నా కెరీర్‌కి ప్లస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి అనుకునే పాత్ర. ప్రత్యేకించి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ప్రాక్టీస్ చేశాను. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా రెండు పాత్రలకి మధ్య వేరియేషన్ ఉంటుంది. ఏ పాత్రకి అదే ప్రత్యేకం. ప్రస్తుతం మారుతిగారి దర్శకత్వంలో చేసిన ‘భలే మంచి చౌకబేరం’ సెప్టెంబర్‌లో విడుదలవుతుంది’’ అన్నారు. -
నచ్చితే పది మందికి చెప్పండి
‘‘శంకర్‌గారు, ఉషాగారిలాంటి తల్లిదండ్రులు ఉండటం నాగశౌర్య అదృష్టం. డైరెక్టర్ శ్రీనివాస్ నా కుటుంబంలోని వ్యక్తి. తనకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. ‘నర్తనశాల’ అనే టైటిల్ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘ఛలో’ వంటి హిట్ చిత్రం తర్వాత నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. కష్మిరీ పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్స్. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి ఆడియో సీడీలను విడుదల చేసి మాట్లాడుతూ – ‘‘ఒక క్లాసిక్ సినిమాను తీసుకుని అందులోని క్యారెక్టర్స్‌ను కాంటెంపరరీగా డిజైన్ చేసి ఎంటర్టైన్ చేస్తూ తీసిన సినిమా ఇది. ‘గీత గోవిందం’తో ఎంటర్టైన్మెంట్ వేవ్ స్టార్ అయింది. అది ‘నర్తనశాల’కు కంటిన్యూ కావాలి’’ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘వంశీ పైడిపల్లిగారు మొదటి నుండి మా సినిమాకు తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అజయ్, శివాజీరాజాగారు, యామినీ, కష్మీరి అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. సాగర్ మహతి మంచి సంగీతం అందించారు. డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి సినిమాను చాలా బాగా తీశారు. చెప్పింది చెప్పినట్లు తీశారు. మా అమ్మానాన్నలకు చాలా థ్యాంక్స్. వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఫ్యామిలీకి ఎప్పుడూ సపోర్ట్ చేసే బుజ్జి అంకుల్, శ్రీనివాస్‌రెడ్డి అంకుల్‌కు థాంక్స్. డెఫినెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే చూడొద్దు. నచ్చితే పది మందికి చెప్పండి’’ అన్నారు. ‘‘శౌర్య, శంకర్‌గారికి, ఉషాగారికి థాంక్స్. సినిమా చాలా ప్లెజంట్‌గా, కామిక్‌గా ఉంటుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’అన్నారు దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి. ‘‘ఒక మనసు’ చిత్రం కోసం మా బ్యానర్లో శౌర్య పనిచేశాడు. హార్డ్‌వర్కర్. తనకు మంచి పేరెంట్స్ ఉండటంతో.. కెరీర్ చక్కగా వెళుతోంది. ఐరా బ్యానర్‌ను స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేస్తున్నారు’’ అన్నారు మధుర శ్రీధర్ రెడ్డి. ‘‘శంకర్‌గారు, బుజ్జిగారు, గౌతమ్, ఉషాగారే.. ఈ సినిమాకు మూల స్తంభాలు. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నందినీ రెడ్డి. శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నా కోసమే ఈ సినిమా చేశారా? అనిపించేలా ఉంటుంది. సాగర్ మహతి చాలా మంచి సంగీతం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. -
‘నర్తన శాల’ ప్రి రిలీజ్ వేడుక
-
పండగలాంటి సినిమా
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నర్తనశాల’. ఇందులో కాశ్మీరీ పరదేశి, యామినీ భాస్కర్ కథానాయికలుగా నటించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉషా ముల్పూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లతో పాటుగా రిలీజ్ చేసిన రెండు వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 24న రిలీజ్ చేసి, చిత్రాన్ని 30న విడుదల చేయనున్నాం. సినిమాలో నాగశౌర్య క్యారెక్టర్‌కు లేడీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. మహతి మంచి సంగీతం అందిచాడు. ఈ సినిమాపై ఆడియన్స్ నమ్మకం వమ్ము కాదు’’ అన్నారు. ‘‘ఛలో’ సక్సెస్ మా బ్యానర్‌కు ఊపిరిపోసింది. శ్రీనివాస్ బాగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఎంటర్టైన్ చేసేలా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్ ప్రసాద్. ‘‘రీలీజ్ చేసిన టీజర్లో సినిమా గురించి కొంచెమే చెప్పాం. ట్రైలర్లో కాస్త కథ కూడా చెబుతాం. సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ సంస్థను రన్ చేస్తుంటారు నాగశౌర్య. ఆయన క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. నాగశౌర్య గే క్యారెక్టర్ గురించి థియేటర్స్‌లో మరింత తెలుస్తుంది. నిర్మాతలు ఈ సినిమాను ఇష్టపడి నిర్మించారు. అందుకే లెక్కకు మించి ఖర్చు పెట్టారు. సినిమా పండగలా ఉంటుంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. పాత నర్తనశాలకి, ఈ నర్తనశాలకి ప్యారలల్‌గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. విజయ్‌కుమార్ మంచి విజువల్స్ అందించారు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్. -
అటూ ఇటూ తిరిగి నర్తనశాల నాకే వచ్చింది
‘‘కొడుకు కలల్ని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు సినిమాలు తీస్తున్నారు నాగశౌర్య తల్లిదండ్రులు. వారి ఆశీర్వాదానికి మించిన ఆశీస్సుల కంటే ఇంకేం కావాలి. ‘నర్తనశాల’ వంటి క్లాసిక్ టైటిల్‌తో తీసిన ఈ చిత్రంలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటించారు. టీజర్లో కొత్తదనం కనిపించింది. నా మిత్రుడు శ్రీనివాస్‌కి ఈ చిత్రం మంచి హిట్ తీసుకొస్తుంది. ఈ సినిమా కెమెరామేన్ విజయ్ సి.కుమార్ నాన్నగారు పాత ‘నర్తనశాల’ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘2013లో నేను హీరోగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు శ్రీనివాస్ చక్రవర్తి ‘నర్తనశాల’ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. అప్పు చేసి అయినా ఈ సినిమా నిర్మించాలనిపించింది. అప్పటి నుంచి ఈ కథ అటూ ఇటూ తిరిగి మళ్లీ నా వద్దకే రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా తీస్తా. 15 కోట్లు పెట్టండి? అంటే ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం నాపై ప్రేమతో చాలా ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘నా గురువు కృష్ణవంశీగారు. నాగశౌర్య, శంకర్ ప్రసాద్‌ల ప్రోత్సాహంతో నా కల తీరింది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. నటుడు శివాజీ రాజా, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నర్తనశాల’ టీజర్ విడుదల
-
‘నర్తనశాల’ టీజర్ విడుదల
-
ప్రతిరోజూ పండుగే
‘ఛలో’ వంటి హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్, కాష్మీర పరదేశీ కథానాయికలు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది. భాస్కర భట్ల రచించిన ‘ఎగిరే మనసు..’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఉషా ముల్పూరి మాట్లాడుతూ – ‘‘ఛలో’ చిత్రాన్ని మ్యూజికల్‌గానూ సూపర్ హిట్ చేశారు. ఈ సినిమాను కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఛలో’ సినిమాకు నిర్మాతలు దొరక్కపోవడంతో ఐరా క్రియేషన్ పుట్టింది. ఐరాకి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్, మీడియా, తమ్మిరాజు, చంటి నాలుగు పిల్లర్స్’’ అన్నారు శంకర్ ప్రసాద్. ‘‘ఫస్ట్ లుక్ నుంచి మా సినిమాకు ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్దది అవుతుందనుకోలేదు. ప్రతిరోజూ షూటింగ్ పండుగలానే జరిగింది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. ‘‘ఛలో’లో ‘చూసీ చూడంగానే....’ సాంగ్ కంటే ఈ పాట పెద్ద సక్సెస్ అవ్వాలి’’ అన్నారు సంగీత దర్శకుడు సాగర్ మహతి. ‘‘నర్తనశాల’ అందరూ గుర్తుంచుకునే సినిమా అవుతుంది’’ అన్నారు యామినీ. -
‘నర్తనశాల’ సాంగ్ లాంచ్
-
సంగీతశాల
‘ఛలో’ సక్సెస్ తర్వాత నాగ శౌర్య నటిస్తున్న చిత్రం ‘నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్‌ప్రసాద్, ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. శ్రీనివాసరావు దర్శకుడు. కాశ్మీరా కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన సంగీత్ సాంగ్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగ శౌర్య మాట్లాడుతూ ...‘‘మా బ్యానర్లో చేస్తున్న రెండో సినిమా ఇది. కథకు యాప్ట్ అవుతుందని ‘నర్తనశాల’ అని టైటిల్ పెట్టాం. ఆ టైటిల్‌ను చెడగొట్టం అని హామీ ఇస్తున్నాను’’ అన్నారు. ‘‘టాకీ పార్ట్, మూడు పాటల చిత్రీకరణ అయిపోయింది. ఆగస్ట్‌లో సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘సాగర్ మహతి అందించిన సాంగ్స్ ఆకట్టుకుంటాయి. నాగ శౌర్య క్యారెక్టర్ సినిమాకు హైలైట్‌గా నిలు స్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరావు. ఈ సినిమాకు సంగీతం: సాగర్ మహతి. -
బాలయ్యని మళ్లీ వాడేస్తున్నాడు!
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అమ్మమ్మగారిల్లు సినిమాతో మరో డిసెంట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో సొంత బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య ఇటీవల భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను ప్రారంభించాడు. సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ప్రారంభించి సౌందర్య మరణంతో మధ్యలో ఆపేశారు. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ సినిమాకు కూడా బాలయ్య టైటిల్‌నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగశౌర్య లవర్‌బాయ్‌గా కనిపించనున్న ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో నారి నారి నడుమ మురారి ఒకటి. నాగశౌర్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. -
50ఏళ్ల నర్తనశాల
-
రసవత్తరం... ఈ ‘నర్తనశాల’
తెలుగు పౌరాణిక చిత్రాల్లో రసవత్తర చిత్రరాజంగా చెప్పుకునే ‘నర్తనశాల’కు నేటికి 50 ఏళ్లు. ఎందరో హేమాహేమీల బృహత్తర ప్రయత్నమిది.ఎన్నిసార్లు వీక్షించినా తనివి తీరకపోవడమే ఈ సినిమాప్రత్యేకత. ఈ తరం సినిమాకీ ఓ ఇన్స్పిరేషన్ ‘నర్తనశాల’. ఆ మధ్యకాలంలో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలు గమనిస్తే... ఒక ధీరోదాత్తుడైన కథానాయకుడు ఎక్కడో అనామకుడిలా తలదాచుకోవడం, ఆ తర్వాత అతని గతం వెల్లడి కావడం సక్సెస్ఫుల్ ఫార్ములాగా నిలిచింది. ఆ ఫార్ములాకు పుట్టిల్లు ఈ సినిమానే! ఎన్టీఆర్ ఆశ్చర్యంగా మొహం పెట్టారు. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదాయనకు. ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటివరకూ ఆయనకు రాని ప్రతిపాదన అది. ఆయనకు ఎదురుగా నటి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధర్‌రావు కూర్చుని ఉన్నారు. ‘నర్తనశాల’ పేరుతో సినిమా చేయాలనుకుంటున్నామని, కాల్షీట్లు కావాలని అడిగితే ఎన్టీఆర్ ఆనందంగా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే - అర్జునుడి పాత్రతో పాటు అటు ఆడా ఇటు మగా కాని బృహన్నల పాత్ర చేయాలట. రావణాసురుడిగా, భీష్ముడిగా చేయడమే సాహసం అనుకుంటే, పేడిగా నటించడం సాహసానికి పరాకాష్ట. అది ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయం. ఎన్టీఆర్ సందేహాస్పద వదనం చూడగానే లక్ష్మీరాజ్యంకు విషయం అవగతమైంది. ‘‘కళాదర్శకుడు టీవీయస్ శర్మగారు బృహన్నల పాత్రకు సంబంధించి స్కెచ్‌లు వేస్తున్నారు. అవి చూశాకనే మీ తుది నిర్ణయం వెల్లడించండి’’ అని చెప్పారామె. ఎన్టీఆర్ సరే అన్నారు. ఆయనకు లక్ష్మీరాజ్యంపై అపారమైన గౌరవం ఉంది. ‘శ్రీకృష్ణ తులాభారం’ (1935), ‘ఇల్లాలు’ (1940), ‘అపవాదు’ (1941), ‘పంతులమ్మ’ (1943) తదితర చిత్రాలతో కథానాయికగా ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు లక్ష్మీరాజ్యం. ఆమె భర్త శ్రీధర్‌రావు రెవిన్యూ ఇన్స్పెక్టర్. వీరిరువురూ కలిసి 1951లో రాజ్యం పిక్చర్స్ సంస్థను స్థాపించి ‘దాసి’ (1952), ‘హరిశ్చంద్ర’ (1956), ‘శ్రీకృష్ణలీలలు’ (1959) చిత్రాలు నిర్మించారు. ఆ సమయంలోనే ఒకాయన లక్ష్మీరాజ్యంకు మహాభారతంలోని విరాట పర్వంకు సంబంధించి ‘నర్తనశాల’ అనే పుస్తకాన్ని పంపించి, సినిమాగా తీస్తే బావుంటుందేమో అని సలహా ఇచ్చారు. లక్ష్మీరాజ్యంకు ఆ ఆలోచన చాలా బావుందనిపించింది. నిజానికి విరాట పర్వం నేపథ్యంలో పెద్దగా సినిమాలు కూడా రాలేదు. 1918లో నటరాజ మొదలియార్ ‘కీచక వధ’ అనే మూకీ తీశారు. 1937లో ‘విజయదశమి’ పేరుతో ఓ టాకీ వచ్చింది. అంతకు మించి ఇంకెవరూ సినిమాలు చేయలేదు. దానికి తోడు తెలుగు నాట విరాట పర్వానికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయనేది తెలుగు ప్రజల్లో ఎప్పటినుంచో పాతకుపోయిన నమ్మకం. అందుకే ‘నర్తనశాల’ను తెరకెక్కించడానికి లక్ష్మీరాజ్యం, శ్రీధర్‌రావు సంకల్పించారు. సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) స్క్రిప్టు మొత్తం సిద్ధం చేశారు. బృహన్నలగా ఎన్టీఆర్ ఓకే అంటే సినిమా మొదలు పెట్టేయొచ్చును. కళాదర్శకుడు శర్మ రంగంలోకి దిగి రకరకాల స్కెచ్‌లు వేశారు. ఒకసారి అమలాపురం వెళ్లినప్పుడు అక్కడి స్థూపం మీద ఉన్న ఓ పేడి శిల్పాన్ని ప్రేరణగా తీసుకుని స్కెచ్ వేశారు. దానికి కేరళ ప్రాంతంలోని స్త్రీల శిరోజాలంకరణను జత చేశారు. ఈ స్కెచ్‌లు చూశాక ఎన్టీఆర్‌కు ఓ నమ్మకం వచ్చింది. ప్రసిద్ధ రూపశిల్పి హరిబాబు ఆధ్వర్యంలో నాలుగు గంటలు శ్రమించి గెటప్ వేసుకున్నారు. తన గురువైన కేవీ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ గెటప్ చూపించారు. ఆయన పచ్చజెండా ఊపడంతో బృహన్నలగా చేయడానికి ఎన్టీఆర్ అంగీకారం తెలిపారు. దర్శకత్వ బాధ్యతలు కమలాకర కామేశ్వరరావు తీసుకున్నారు. ఆయనకిదే తొలి పౌరాణిక చిత్రం. ద్రౌపదిగా సావిత్రి, కీచకునిగా ఎస్వీ రంగారావు, ధర్మరాజుగా మిక్కిలినేని, భీమునిగా దండమూడి రాజగోపాల్, దుర్యోధనునిగా ధూళిపాళ, దుశ్శాసనునిగా కైకాల సత్యనారాయణ, విరాటరాజుగా ముక్కామల, సుధేష్ణగా సంధ్య, ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి, అభిమన్యునిగా శోభన్‌బాబు, శ్రీకృష్ణునిగా కాంతారావు, ఉత్తర కుమారునిగా రేలంగిని ఎంపిక చేశారు. మద్రాసులోని వాహినీ, భరణీ స్టూడియోల్లో చిత్రీకరణ జరిపారు. గూడూరు సమీప ప్రాంతంలో మాత్రం యుద్ధ సన్నివేశాలు తీశారు. గోగ్రహణ ఘట్టం కోసం ఏకంగా 5 వేల పశువులను రప్పించడం విశేషం. ఈ పతాక సన్నివేశాల కోసం రెండు కెమేరాలను ఉపయోగించారు. సుమారు 4 లక్షల రూపాయల ఖర్చుతో సినిమా సిద్ధమైంది. 1963 అక్టోబరు 11న 26 కేంద్రాల్లో ‘నర్తనశాల’ విడుదలై, 19 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్, విజయవాడల్లో 200 రోజులు ఆడింది. బెంగాలీ, ఒరియా భాషల్లో అనువదిస్తే, అక్కడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఇంతకుముందు చేసిన పౌరాణిక పాత్రలన్నీ ఒకెత్తు అయితే, ఈ బృహన్నల మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఓ పక్క పురుషత్వం, మరో పక్క స్త్రీ లాలిత్యాన్ని కలగలుపుతూ ఆయన చూపిన అభినయం ఓ పాఠ్యాంశమే. అసలీ పాత్ర కోసం అంతటి స్టార్ హీరో శ్రమించిన తీరే అబ్బురంగా అనిపిస్తుంది. బృహన్నల అంటే ఉత్తరకు నాట్యం నేర్పే నాట్యాచార్యుడు. ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి చేస్తున్నారంటే, ఆమెకు ధీటుగా నృత్యం చేయగలిగాలి. అందుకోసం నెల రోజులు నృత్య దర్శకులు వెంపటి (పెద) సత్యం దగ్గర నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. ఎన్టీఆర్ అంత శ్రద్ధ చూపారు కాబట్టే ఆ పాత్ర అంతలా రక్తి కట్టింది. ఇక ఈ సినిమాకు వెన్నెముకలాంటి పాత్ర ఎస్వీ రంగారావుది. సినిమాలో ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా, ఉన్నంత సేపు దడదడలాడించేశారు. మిగిలిన తారల ప్రతిభ కూడా ఉన్నత ప్రమాణాల్లో సాగింది. తొలితరం సూపర్‌స్టార్ కాంచనమాల చాలా ఏళ్ల విరామం తర్వాత ఇందులో అతిథి పాత్రలో కొన్ని క్షణాలు కనిపించారు. ఆమె ఆఖరి సినిమా ఇదే. సముద్రాల సీనియర్ కలం ఈ చిత్రానికి బలం. సుసర్ల దక్షిణామూర్తి స్వరజీవితంలో మణిమకుటాయమానంగా నిలిచే సినిమా ఇదే. ‘జనని శివ కామిని’, ‘సలలిత రాగ సుధారససారం’, ‘దరికి రాబోకు రాబోకు రాజా’, ‘నరవరా ఓ కురువరా’, ‘ఎవరి కోసం ఈ మందహాసం’, ‘సఖియా వివరించవే’ పాటలన్నీ అమృతంలో ముంచి తేల్చిన రసగుళికలు. ఎం.ఏ.రెహమాన్ ఛాయాగ్రహణ సామర్థ్యం, ఎస్.పి.ఎస్. వీరప్ప ఎడిటింగ్ పనితనం, టీవీఎస్ శర్మ కళాదర్శక నైపుణ్యం... జనం గుండెల్లో ‘నర్తనశాల’ చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రధాన దినుసులుగా ఉపకరించాయి. ఈ సినిమానొక దృశ్యకావ్యంగా, కళాఖండంలా తీర్చిదిద్దడంలో కమలాకర కామేశ్వరరావు చేసిన కృషి అపూర్వం. ఆయన పౌరాణిక చిత్రబ్రహ్మగా పేరు తెచ్చుకోవడానికి ఈ సినిమానే తొలి మెట్టు. 1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే.