
నాగశౌర్య, కాశ్మీరా
‘ఛలో’ సక్సెస్ తర్వాత నాగ శౌర్య నటిస్తున్న చిత్రం ‘నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్‌ప్రసాద్, ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. శ్రీనివాసరావు దర్శకుడు. కాశ్మీరా కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన సంగీత్ సాంగ్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగ శౌర్య మాట్లాడుతూ ...‘‘మా బ్యానర్లో చేస్తున్న రెండో సినిమా ఇది.
కథకు యాప్ట్ అవుతుందని ‘నర్తనశాల’ అని టైటిల్ పెట్టాం. ఆ టైటిల్‌ను చెడగొట్టం అని హామీ ఇస్తున్నాను’’ అన్నారు. ‘‘టాకీ పార్ట్, మూడు పాటల చిత్రీకరణ అయిపోయింది. ఆగస్ట్‌లో సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘సాగర్ మహతి అందించిన సాంగ్స్ ఆకట్టుకుంటాయి. నాగ శౌర్య క్యారెక్టర్ సినిమాకు హైలైట్‌గా నిలు స్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరావు. ఈ సినిమాకు సంగీతం: సాగర్ మహతి.
Comments
Please login to add a commentAdd a comment