నానికి జోడిగా ‘@నర్తనశాల’ బ్యూటీ | Nartanasala Fame Kashmira Paradeshi Locked For Nani Jersey | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 3:32 PM | Last Updated on Wed, Sep 5 2018 6:03 PM

Nartanasala Fame Kashmira Paradeshi Locked For Nani Jersey - Sakshi

ప్రస్తుతం దేవదాస్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్‌ హీరో నాని ఆ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ప్రకటించాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న  క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నాడు నాని. జెర్సీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నానికి జోడిగా నర్తనశాల ఫేం కశ్మీరా పరదేశీ నటించనున్నారు.

నాని క్రికెటర్‌ అర్జున్‌గా నటిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా అక్టోబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement