కాదేదీ కవితకు అనర్హం అన్న చందంగా కాదేదీ అవేర్‌నెస్‌కు అనర్హం అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అరటి పండు వొలిచి నోట్లో పెట్టినంత ఈజీగా జనాలకు అర్థమయ్యేందుకు మీమ్ లాంగ్వేజ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో పాపులర్ సినిమాల్లో హీరోల ఫొటోలను డైలాగులను వాడుకుంటూ ట్రాఫిక్ నియమనిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీని వాడుకున్నారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్‌లో బ్యాట్ పట్టుకుని ముఖాన హెల్మెట్ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు.
ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్.. "నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న" అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఎవరైనా మీమర్‌కు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ ఇచ్చారా సర్? అని కొందరు ఫన్నీగా అడుగుతున్నారు. ఇదిలా వుంటే ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్‌గా వాడుకున్నారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్ షేర్ చేసిన విషయం తెలిసిందే!
Heartiest Congratulations #Jersy for the much deserved #NationalFilmAwards Win.@NameisNani @gowtam19 pic.twitter.com/5WmVjV0G6N
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 24, 2021
చదవండి: థియేటర్లు మళ్లీ బంద్?
Comments
Please login to add a commentAdd a comment