Cyberabad traffic police
-
ఔటర్, హైవేలపై జాగ్రత్త.. పొగ మంచులో ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ, వారాంతం కలిసి రావటంతో నగరవాసులు సొంతూర్లకు పయనమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో పొగమంచుతో కూడిన వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు తెల్లవారుజామున ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. పూర్తిగా తెల్లవారిన తర్వాత సూర్యకాంతిలో ప్రయాణించడం శ్రేయస్కరమని సూచించారు. వ్యక్తిగత వాహనాల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఔటర్, హైవేలపై జాగ్రత్త.. దట్టమైన పొగమంచు కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు, రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రహదారులలో వాహనాలను నిలపకూడదు. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు ఏమాత్రం నలత అనిపించినా, నిద్ర వచ్చినా రోడ్డు మీద వాహనాన్ని క్యారేజ్‌పై నిలివేయకుండా రోడ్డు దిగి ఒక పక్కన లేదా కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే నిలిపివేయాలని సూచించారు. పొగ మంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించదు. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. బ్రేకులు వేసేటప్పుడు వెనకాల వస్తున్న వాహనాలను అద్దాల నుంచి చూసి మాత్రమే వేయాలి తప్ప అకస్మాత్తుగా బ్రేకులు వేయకూడదని, ఇతర వాహన డ్రైవర్లు మీ వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా బీమ్ హెడ్లైట్లను వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి ► ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించాలి. ► హజార్డ్ లైట్లను ఆన్ చేసి ఉంచాలి. ► సెల్ఫోన్లో మాట్లాడుతూ, కారులో అధిక శబ్ధం మ్యూజిక్‌తో ప్రయాణించకూడదు. వెనకాల వచ్చే వాహనాల హారన్ వినిపించదు. ► పొగమంచులో ఎదుటి వాహనాలు, పశువులు స్పష్టంగా కనిపించవు. అందుకే తరుచూ హారన్ కొడుతూ ప్రయాణించడం ఉత్తమం. ► లేన్ మారుతున్నప్పుడు లేదా మలుపుల సమయంలో కిటికీలను కిందికి దింపాలి. దీంతో వెనకాల వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా వినిపిస్తుంది. ► ఐదారు గంటల పాటు కంటిన్యూగా డ్రైవింగ్ చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. (క్లిక్ చేయండి: పండుగ ప్రయాణం.. నరకయాతన) -
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్‌రోడ్డు మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్‌రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్‌నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ఇలానే ప్రమాదానికి గురవ్వాల్సిందే!
-
Cyberabad Traffic Police: మద్యం సేవించి వాహనం నడపకండి
-
Cyberabad Traffic Police: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి
-
Rear Seat Belt: ‘కారు సీటు బెల్ట్’పై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: కారు ప్రయాణంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం వాహన చట్టం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కారు నడిపే డ్రైవర్ మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వ్యక్తులూ సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్ 194 బీ ప్రకారం రూ.1,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. 8 సీట్ల లో పు ఉన్న అన్ని ప్యాసింజర్ వాహనాలకు ఈ చ ట్టం వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా నిబంధనల అమలుపై అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. విజన్ ఉండదు.. బైక్ రైడర్‌కి హెల్మెట్, కారు నడిపేవారికి సీటు బెల్ట్ రక్షణ కల్పిస్తుంది. కానీ, కారులో డ్రైవర్ మినహా ముందు, వెనక కూర్చున్న వారు సీటు బెల్ట్‌ను పెట్టుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసులు కూడా బెల్ట్ పెట్టుకోని డ్రైవర్‌ను మాత్రమే గుర్తించి జరిమానా విధించేవారు. కారు ప్రమాదంలో వెనకాల వ్యక్తులకూ ప్రాణ నష్టం వాటిల్లుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అ యితే ఈ నిబంధన అమలు సాంకేతికంగా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. రోడ్డు మీద జంక్షన్లో ఉన్న కానిస్టేబుల్‌కు వేగం కారణంగా వాహనాల లోపల వ్యక్తులు స్పష్టంగా కనిపించరు. నిరిష్టంగా వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే తప్ప వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో తెలియదు. పోనీ ప్రయాణంలో ఉన్న కారును రోడ్డు మీద ఆపి తనిఖీ చేస్తే ట్రాఫిక్ జాం అయ్యే ప్రమాదం ఉంది. ఇతర వాహనదారులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఇలా చేస్తే బెటర్.. దీంతో ఈ నిబంధనను అమలు చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. ఇతర ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ సమయంలో కారును ఆపినప్పుడు వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదా గమనించి, ఒకవేళ పెట్టుకోకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికంటే ముందు సీటు బెల్ట్ ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ ప్రత్యేక అవగాహన ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అవగాహన కల్పించనున్నారు. డ్రైవ్ చేసే వారితో పాటు కారులోని మిగతా వారికీ ప్రమాదాల గురించి వివరించనున్నారు. కరపత్రాలు, డిజిటల్ సూచికలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. -
Viral Video: రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో చూడండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పేరు తలుచుకుంటేనే గుర్తుకొచ్చేది ఒకటి బిర్యాని అయితే రెండు ట్రాఫిక్.. పని మీద బయటకొచ్చి రోడ్లపైకి వస్తే ఎన్ని గంటలకు గమ్య స్థానానికి చేరుతారో ఎవరూ ఊహించలేరు. ఆఫీస్‌కు లేట్ అయితే బాస్ తిడతారనే భయంతో అతివేగంతో రోడ్డు మీద ప్రయాణిస్తుంటారు. మార్గ మధ్యలో రోడ్డు దాటాల్సి వస్తే.. యూ టర్న్ వరకూ వెళ్లాలి. అలా వెళ్తే కొంత సమయం వృథా అవుతుందనే తొందరలో చాలా మంది తప్పని తెలిసినా రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, ప్రకటనలు ఇచ్చినా కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే విషయం అర్థమవుతుంది. చదవండి: రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి.. వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌పై రాంగ్ రూట్లో వస్తున్నాడు. హెల్మెట్ కూడా ధరించలేదు. అంతేగాక తప్పుడు మార్గంలో వస్తున్నాననే భయం లేకుండా బైక్ నడుపుతూ వాహనదారులకు ఎదురెళ్లాడు. ఇంతలో మలుపు నుంచి వస్తున్న కారు అతన్ని బలంగా డీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పిట్టలాగ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ట్రాఫిక్ రూల్ పాటించకపోవడంతో ఎంత పని జరుగుతుందో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతుంది. సెంటిమీటర్ ప్రయాణం అయినా రాంగ్ రూట్లో నడపవద్దని పోలీసులు సూచించారు. సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/SsFkp84XXc — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 7, 2022 -
రహదారి భద్రత పై అవగాహాన పాఠాలు...లక్షల్లో ఫాలోవర్స్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే అసలైన మందు. ఇందుకోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయుక్తకంగా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణ, నిబంధనలపై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలో పోస్ట్‌లు పెడుతూ.. అవగాహన కల్పిస్తున్నారు. రహదారి భద్రతపై హిట్ సినిమాల్లోని పాత్రలతో పోస్ట్‌లు, షార్ట్ వీడియోలు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. లక్షల్లో ఫాలోవర్స్.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు సోషల్ మీడియాలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. 1.2 లక్షలకు పైగా సబ్స్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్‌కు ఇటీవలే యూట్యూబ్ నిర్వాహకుల నుంచి సిల్వర్ ప్లే బటన్ అవార్డ్ కూడా దక్కింది. రహదారి భద్రత, వాహనదారుల నిబంధనలపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అందించే సలహాలు, సూచనలతో కూడిన వీడియోలను యూట్యూబ్‌లో పెడుతున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన రహదారి ప్రమాదాలను వీడియో ప్రదర్శిస్తూ.. అందుకు దారి తీసిన కారణాలు, వాహనదారుల తప్పిదాలను వివరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారినపడి కోలుకున్న బాధితుల అనుభవాలు, గాయపడిన వ్యక్తులకు వైద్య సేవలు అందించిన వైద్యులు పంచుకున్న అంశాలను యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబర్లకు చేరవేస్తున్నారు. 15 రోజులకొకసారి సమీక్ష.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 15 రోజులకు ఒకసారి ట్రాఫిక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సైబరాబాద్‌లో కొత్తగా నిర్మించిన రహదారులు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లను ప్రజలు వినియోగించుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సమయంలో ఎక్కడ ఎంత ట్రాఫిక్ రద్దీ ఉందో ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో అప్డేట్ చేస్తున్నారు. వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను, సృజనాత్మక చిత్రాలను రూపొందించి ప్రతి రోజు 4–5 వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అఖండ, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి కొత్త సినిమాలలోని డైలాగ్‌ను తీసుకొని వాటికి హెల్మెట్, డ్రంకన్ డ్రైవింగ్, అతివేగం, సీట్ బెల్ట్ ధరించడం తదితర అంశాలను సినిమా పాత్రల ద్వారా పోస్ట్‌లు రూపొందించి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. అవగాహనతోనే ప్రమాదాల నివారణ రోడ్డు ప్రమాదాల నివారణకు అసలైన మందు అవగాహనే. ప్రమాదాలను నివారించేందుకు సిబ్బంది, నిబంధనల అమలుతో పాటు అవగాహన అత్యంత ముఖ్యం. ఇందుకోసం భౌతికంగా, ఆన్లైన్ వేదికగా కూడా సెషన్స్ నిర్వహిస్తున్నాం. మనసుకు హత్తుకునేలా, సులువుగా అర్థమయ్యేలా స్కిట్స్ రూపంలో రోడ్డు భద్రతా నిబంధనలను వివరిస్తున్నాం. – పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
‘పుష్ప’రాజ్‌ని అలా వాడేసిన పోలీసులు.. నెట్టింట ట్వీట్ వైరల్
సోషల్ మీడియాను వాడుకోవడంలో సైబరాబాద్ పోలీసలు ఎప్పుడూ ముందుంటారు. ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మంచి సందేశాలను అందిస్తుంటారు. మరీ ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలు, డైలాగ్స్‌ని తమకు అనుగుణంగా మార్చుకొని ట్రాఫిక్ నియమాలపై జనాల్లో అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప సినిమాను కూడా వాడేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌లో తెరకెక్కిన పుష్ప మూవీ.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: పుష్ప’మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని బన్నీ పోస్టర్‌తో సైబరాబాద్ పోలీసులు తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. బుల్లెట్ బండిపై స్టైలిష్‌గా కూర్చున్న బన్నీ ఫోటోను సైబరాబాద్ పోలీసులు ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ చెప్పే డైలాగుని మార్చి.. ‘హెల్మెట్ – మిర్రర్స్ లేవా పుష్ప?’ అంటూ మీమ్ రూపంలో ట్వీట్ చేశారు. ఇక ఈ ఫోటోతో పాటు.. ‘హెల్మెట్ ధరించండి, రేర్ వ్యూ మిర్రర్ లను ఫిక్స్ చేయండి. సురక్షితముగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ) గతంలో సింహా సినిమాలోని ఓ డైలాగ్ వాడుకుని.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదని చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ పోస్టర్ విడుదలైనపుడు కూడా తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు. హెల్మెట్స్ ఎక్కడా అంటూ ఇద్దరి ఫోటోలు పెట్టి పోస్టులు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 17, 2021 -
కొత్త బైక్ కొనేవారికి రెండు హెల్మెట్లు!
మీరు ఈ మధ్య కాలంలో కొత్త బైక్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. మనలో ఎంత మందికి తెలుసు, మనం బైక్ కొన్న కంపెనీలు హెల్మెట్ ఇస్తాయని. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్ ,1989 యాక్ట్ రూల్ నెంబర్ 138(4)(ఎఫ్) ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో వాహన తయారీ కంపెనీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న రెండు హెల్మెట్లను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్) కొత్త బైక్ ఎక్కడ కొంటున్నారో ఆ షోరూం వారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగాలని అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్లు ఇవ్వకపోతే వెంటనే వినియోగదారుల ఫోరమ్, పోలీసు, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో బీఎస్ఐ ప్రమాణాల ప్రకారం సూచించిన ఐఎస్ఐ హెల్మెట్లను కంపెనీలు వినియోగదారులకు అందజేయాలని, అలా చేయకపోతే మహారాష్ట్ర మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని స్థానిక కోర్టు రవాణా కమిషనర్ ను ఆదేశించింది. CTP appeals citizens to rightfully claim two standard helmets along with any type of motor cycle they purchase as per the Rule 138(4)(f) of the Central Motor Vehicles Rules, 1989.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/EEbx5ud8kC — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021 -
మీ వాహనంపై ట్రాఫిక్ చలానా ఉందా? అయితే, బండి సీజ్!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. చలానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలో ఉన్న వాహనాలపై ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉన్నా.. వాహనాన్ని సీజ్ చేస్తామని సైబరాబాద్ పోలీసులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా గతంలో మూడు చలానాలు పెండింగ్‌లో ఉంటే వాహనం సీజ్ చేసేవారు. అయితే గతేడాది సైబరాబాద్ పరిధిలో 47.83 లక్షల కేసుల్ని నమోదు చేసిన పోలీసులు రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. కానీ ఉల్లంఘనులు రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారు. దీంతో సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు కట్టిస్తున్నారు. లేదంటే వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
బాచుపల్లి: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్టేక్’
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చామంటే.. ఒళ్లంతా కళ్లు చేసుకుని జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ.. వాహనాలు నడపాలి. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించి.. మనమే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కేవలం ప్రాణం పోవడమే కాదు.. కొన్నేళ్ల పాటు మన కుటుంబం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. అర సెకను అజాగ్రత్త.. ఎంతటి కష్టాన్ని, నష్టాన్ని మిగులుస్తోందో చెప్పడానికి మాటలు చాలవు. ఇందుకు సంబంధించిన వీడియోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ ప్రమాద వివరాలు.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘‘దీని ద్వారా మీరు ఏం గమనించారు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలోని ప్రమాదం బాచుపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. పెద్దగా రద్దీగా కూడా లేదు. రోడ్డు మీద లారీ, ఇన్నోవా వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఇన్నోవాకు ముందు ప్రయాణిస్తున్న ఆటో.. దానికి దారి ఇవ్వడం కోసం కొద్దగా ముందుకు వెళ్లి ఓ పక్కకు ఆగుతుంది. ఇక అంతసేపు ఇన్నోవాకు అతి సమీపంలో ఉన్న బైకర్.. ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్తాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్ ఫాస్ట్‌గా వెళ్లడంతో బైక్‌ను ఢీ కొడతాడు. దాంతో ఆ వ్యక్తి ఎగిరి లారీ కింద పడి కొద్ది దూరం వెళ్తాడు. లారీలోని వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి కిందకు దిగి చూస్తుంటాడు. ఇంతలో లారీ కొంచె దూరం వెనక్కి కదిలి.. దాని కిందే ఉన్న బైకర్ మీదుగా కొంచెం దూరం వెళ్తుంది. కింద ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో లారీని ఆపుతాడు. ఓవర్టేక్ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్‌కి.. అతని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే దాని గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని షేర్ చేశామని.. ఇతరుల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా బాధితుడిది, ఇన్నోవా డ్రైవర్‌దే తప్పని విమర్శిస్తున్నారు. -
మాదాపూర్‌లో అర్ధరాత్రి మద్యం మత్తులో...
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. పరిసరాలను గమనించకుండా రోడ్డు మధ్యలోకి రావడంతో.. వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో
Drunk And Drive Funny Video: మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పిన తాగి నడిపే వారిలో మార్పు రావడం లేదు. అయితే తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాల గురించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉదయాన్నే మంద్యం తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, ద్విచక్ర వాహనంపై రోడ్డుమీదకొచ్చాడు ఓ ప్రబుద్ధుడు. మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వేళుతున్న కారులు, బైకులకు అడ్డంగా వస్తున్నాడు. రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. ఈ సంఘటన ఇబ్రహీంపల్లి గేట్ వద్ద ఈనెల నాలుగున చోటుచేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అంటూ ట్విటర్లో షేర్ చేశారు. పోలీస్ టెక్నికల్ టీమ్ ఈ వీడియోకు బ్యాడ్రౌండ్ మ్యూజిక్, ఎమోజీలను జోడించి ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అంటూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. -
సర్రున దూసుకు వచ్చిన బండి.. గీత దాటారు.. దబిడి దిబిడే!
హైదరాబాద్: సాధారణంగా టోల్ గేట్ వస్తే ఏం చేస్తారు. ఓ కిలో మీటరు దూరం నుంచే బండిని నెమ్మదిగా నడుపుకుంటూ వస్తారు. కానీ తాజాగా ఓ టాటా ఏసీ డ్రైవర్ టోల్ గేట్ దగ్గరకి సర్రున దూసుకొచ్చాడు. పైగా దాని టాప్‌పైన ప్యాసింజర్లను ఎక్కించుకున్నాడు. ఇంకేముంది టోల్ గేట్ బారికేడ్ అందులోని ప్రయాణికులను బాదడం మొదులు పెట్టింది. ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న వారు.. లబో దిబోమన్నారు. ఈ వీడియోను ‘‘రాష్ డ్రైవింగ్.. వస్తువులను తీసుకెళ్లే బండిలో ప్రజలను తీసుకెళ్లడం ఎల్లప్పుడూ ప్రమాదకరం.’’ అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగవైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘సిగ్నల్ దగ్గర లైన్ దాటి వాహనాలు ఆపేవాళ్లకు ఇలాంటివి ప్లాన్ చేయండి సార్.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ ‘‘జీబ్రా లైన్స్ మీద క్రాస్ లైన్స్ దాటి ఆపేవారిని కూడా ఇలా కొట్టడానికి ఉంటే బాగుండు.’’ అంటూ రాసుకొచ్చారు. Rash driving and carrying people in goods carriage is always dangerous.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/NlLzbahbjm — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 8, 2021 -
ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై
ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. తాజాగా ఈ పోస్టర్ని తమదైన శైలీలో వాడుకున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. బైక్‌పై వెళ్తున్న ఎన్టీఆర్, చెర్రీకి హెల్మెట్లు పెట్టి.. ఇప్పుడు ఫర్ఫెక్ట్గా ఉందంటూ ట్వీట్ చేసింది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ తమ ట్రేడ్ మార్క్ నినాదాన్ని క్యాప్షన్‌గా ఇచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఇక ఈ ట్వీట్‌పై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఫన్నీగా స్పందించింది. ‘ఇప్పటికి అది పరిపూర్ణంగా లేదు. నెంబర్ ప్లేట్ మిస్సయింది’అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. Ramaraju & Bheem ❤️🔥🌊 #RRRMovie pic.twitter.com/5vrM662iGo — RRR Movie (@RRRMovie) June 29, 2021 ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కుమురం భీంగా దర్శనమివ్వనున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. Now it is perfect. Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021 -
తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్
-
E Challan: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్
సాక్షి, హైదరాబాద్: మీ క్షేమం.. భద్రత కోసం నిబంధనలు పాటించండి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారుల తీరులో ఏమాత్రం మార్పు ఉండడం లేదు. భారీగా జరిమానాలు విధిస్తున్నా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారికి అదే తీరులో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా ముగ్గురు ఒకే వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుండడంతో పాటు సెల్‌ఫోన్ వినియోగిస్తూ టైటానిక్ సినిమాలో మాదిరి స్టిల్ ఇచ్చారు. ఇది చూసిన పోలీసులు వెంటనే కెమెరాకు పని చెప్పారు. ఆ తర్వాత రూ.3,600 జరిమానా వారికి పంపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ముగ్గురు యువకులు పల్సర్‌పై వెళ్తున్నారు. మధ్యలో కూర్చున్న యువకుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముందు చేతులు పెట్టి సెల్‌ఫోన్ చూపిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌ను డ్రైవింగ్ చేస్తున్న యువకుడు పరిశీలిస్తున్నాడు. ఈ సీన్ అచ్చం టైటానిక్ సినిమాలో స్టిల్ మాదిరి కనిపించింది. ఈ విన్యాసం చూసిన పోలీసులు ఫొటో తీసి జరిమానా పంపించారు. పైగా వారు హెల్మెట్ కూడా ధరించలేదు. దీంతో అన్నీ కలిపి రూ.3,600 జరిమానా విధించారు. ఈ ఫొటోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. జరిమానాలు ఇలా.. హెల్మెట్ ధరించకపోవడం: రూ.100 బైక్‌కు అద్దాలు లేకపోవడం: రూ.100 బైక్‌పై ముగ్గురు ప్రయాణం: రూ.1,200 సెల్‌ఫోన్ డ్రైవింగ్: రూ.1,000 మాస్క్ సక్రమంగా ధరించకపోవడం: రూ.1,000 చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా.. రోడ్డు పై టైటానిక్ విన్యాసాలు. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/kzMzoclLCJ — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 10, 2021 -
వైరల్: హెల్మెట్ లేకపోతే యువతి తల పగిలేది..
సాక్షి, హైదరాబాద్ : ద్విచక్ర వాహనం నడిపేవారికి హెల్మెట్ అవసరం ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమాదం జరిగినపుడు మన ప్రాణాల్ని కాపాడే అమృతంలా హెల్మెట్ పనిచేస్తుంది. కేవలం బైకు నడిపేవారు మాత్రమే కాకుండా వెనకాల కూర్చునే వారు కూడా హెల్మెట్ ధరించటం అత్యంత అవసరం.. ముఖ్యం కూడా. బైకుపై ఉన్న ఇద్దరూ హెల్మెట్ ధరించటం వల్ల ఎంత మేలో తెలియాలంటే నగరంలో జరిగిన ఓ ప్రమాదం గురించి తెలియాల్సిందే. కొద్దిరోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డును దాటుతున్నారు. సరిగ్గా డివైడర్‌ను చేరే సమయానికి ఓ బైక్ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పాదచారులు, బైకు నడుపుతున్న యువకుడు, వెనకాల కూర్చున్న యువతి కిందపడ్డారు. ఆ యువతి తల నేరుగా డివైడర్‌ను తగిలింది. అయితే, ఆమె హెల్మెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ బైకు నడుపుతున్న వ్యక్తి, వెనకాల కూర్చున్న అమ్మాయి ఎందుకు హెల్మెట్ ధరించారు?’’అని ప్రశ్నించారు. వీడియోను జత చేశారు. చదవండి : ఆమె మెడలో కేజీ బంగారు తాళి.. పోలీసులు అవాక్! Why should both rider and pillion rider wear Helmet while riding a two-wheeler?#RoadSafety #RoadSafetyCyberabad https://t.co/sfnPOS9OIY pic.twitter.com/TzqNubdN2J — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 24, 2021 -
వేగంగా యూ టర్న్.. లారీని ఢీకొట్టి ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా వాహనదారుల్లో అసలు ఏమాత్రం మార్పు రావడం లేదు. జరిమానాలు విధించినా.. కట్టేందుకైనా సిద్ధపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటంలేదు. కనీస ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో షాబాద్‌లోని నాగర్‌గూడ కూడలి వద్ద వేగంగా బైక్ నడిపి యూ టర్న్ తీసుకున్నాడు. దీంతో రోడ్డుపై అంతే వేగంగా వస్తున్న లారీని ఢికోట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడళ్ల వద్ద ఎటువంటి నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలో చూచించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చూచించిన నిబంధనలు ఇవే.. ► ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూటర్న్ లేదా రైట్ టర్న్ తీసుకోవాలి. ► ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోవాలి. ► ముఖ్యంగా గ్రామాలలో, కూడళ్ల వద్ద వేగంగా వాహనాలు నడపకండి. ► పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ➡️ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూటర్న్ లేదా రైట్ టర్న్ తీసుకోవాలి. ➡️ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోండి. ➡️గ్రామాలలో,కూడళ్ల వద్ద వేగంగా నడపకండి. ➡️పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. Location: Nagarguda, Shabad pic.twitter.com/nPNrjDkWFQ — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 21, 2021 చదవండి: జెర్సీకి విషెస్ చెప్తూనే సెటైర్ వేసిన పోలీసులు! -
జెర్సీకి విషెస్ చెప్తూనే సెటైర్ వేసిన పోలీసులు!
కాదేదీ కవితకు అనర్హం అన్న చందంగా కాదేదీ అవేర్‌నెస్‌కు అనర్హం అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అరటి పండు వొలిచి నోట్లో పెట్టినంత ఈజీగా జనాలకు అర్థమయ్యేందుకు మీమ్ లాంగ్వేజ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో పాపులర్ సినిమాల్లో హీరోల ఫొటోలను డైలాగులను వాడుకుంటూ ట్రాఫిక్ నియమనిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీని వాడుకున్నారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్‌లో బ్యాట్ పట్టుకుని ముఖాన హెల్మెట్ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్.. "నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న" అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఎవరైనా మీమర్‌కు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారా సర్? అని కొందరు ఫన్నీగా అడుగుతున్నారు. ఇదిలా వుంటే ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్‌గా వాడుకున్నారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్ షేర్ చేసిన విషయం తెలిసిందే! Heartiest Congratulations #Jersy for the much deserved #NationalFilmAwards Win.@NameisNani @gowtam19 pic.twitter.com/5WmVjV0G6N — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 24, 2021 చదవండి: థియేటర్లు మళ్లీ బంద్? ‘హిట్’ సీక్వెల్: హీరో ఎవరో తెలుసా..? -
ఇంకెంత కాలం ఇలా ప్రమాదాల బారిన పడతారు?
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా గానీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. జరిమానాలు కట్టేందుకైనా సిద్ధపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటం వంటి కనీస నిబంధనలు పాటించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలా మంది. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మృతిచెందాడు. రెడ్ సిగ్నల్ జంప్ చేసి బస్సుకు అడ్డంగా వెళ్లి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రామచంద్రాపురం(ఆర్సీ పురం)లో చోటుచేసుకుంది. స్కూటీపై రాంగ్ రూట్లో వస్తున్న బైకర్‌ను ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ‘‘ఇంకెంత కాలం ఇలా? ప్రమాదాల బారిన పడతారు’’ అంటూ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు సిగ్నల్ జంప్ చేసిన వాహనాలు.. ఒకరి మృతి Opposite direction driving. Not strapping the helmet. Reckless driving at signal. How long !? The danger is just a whisker away. At RC Puram#RoadSafety #RoadSafetyCyberabad 👉Youtube Link: https://t.co/8fLztszMwT pic.twitter.com/6TaXsANJBN — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 27, 2021 -
సిగ్నల్ జంప్ చేసిన వాహనాలు.. ఒకరి మృతి
మైలార్‌దేవ్‌పల్లి: సిగ్నల్ జంప్ చేసిన రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రయాణగుట్ట నుంచి వస్తున్న స్వరాజ్ మజ్డా వాహనం బంజారాహిల్స్ వెళ్తుంది. కాటేదాన్ నుంచి వస్తున్న ఆటో చంద్రయాణగుట్ట వైపు వెళ్తుంది. ఈ ఆటోలో డ్రైవర్ అర్మాజ్(19)తో పాటు మహ్మద్ గౌస్(20) ప్రయాణిస్తున్నాడు. ఈ రెండు వాహనాలు దుర్గానగర్‌కు వచ్చే సమయానికి రెడ్ సిగ్నల్ పడింది. ఇరువురు డ్రైవర్లు నిర్లక్ష్యంగా సిగ్నల్ జంప్ చేయడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు గాయపడ్డారు. స్వరాజ్ మజ్డా డ్రైవర్ దావూద్(55) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్ అర్మాజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబరు బైక్‌కు పెట్టుకుని కొత్తూరు: చలానాలు తప్పించుకోవడంలో భాగంగా కొందరు ఇటీవల కాలంలో ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరో వాహనానికి వేసుకోవడం పరిపాటిగా మారింది. తీరా చాలానాలు వచ్చే దాక విషయం తెలియడం లేదు. ఇలాంటి ఘటనే మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గూడూరు గ్రామానికి చెందిన పెండ్లిమడుగు విజయనిర్మల పేరు మీద మారుతి బ్రిజాకారు ఉంది. కాగా ఇదే నెంబర్‌ను ఓ యువకుడు బైకుకు పెట్టుకున్నాడు. ఈ నెల 17న షాద్‌నగర్ ఎక్స్‌రోడ్‌లో యువకుడు హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు బైకు ఫొటోను తీసి చలానా వేయడంతో కారు యజమానురాలికి మెసేజ్ వచ్చింది. దీంతో తనది కారు అయినప్పటికీ బైకు చలానా ఎందుకు వచ్చిందని ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్‌ను వివరణ కోరగా తప్పుడు నంబర్ ప్లేట్లు పెట్టుకున్నట్లు తేలితే వాహనం యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. బ్రీజా కారు నంబర్‌ను బైకు పెట్టుకున్న విషయాన్ని విచారిస్తామన్నారు. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదకరం నిర్లక్షంగా వాహనం నడిపి ఓ వ్యక్తి గాయపడేలా చేశాడో బైకర్. ట్రాఫిక్ సిగ్నల్‌ను సమీపిస్తున్న సమయంలో ర్యాష్‌గా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. మైలార్దేవపల్లి, దుర్గానగర్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. Rash driving when approaching a traffic signal is dangerous. At Durganagar Junction, Mailardevapalli.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/rovPPPhZhs — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 23, 2021 -
నిర్లక్ష్యపు నడక, బైకర్ అతివేగం.. మీరు మారరా!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. మద్యం సేవించి డ్రైవ్ చేయకండి అంటూ ట్రాఫిక్ అధికారులు ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, సూచనలు చేసినా పట్టించుకోని వారు కోకొల్లలు. ట్రాఫిక్ అధికారులు చెప్పేది మన ప్రాణాలు కాపాడటం కోసమే. కానీ మనం వినకుండా ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. ఓ వ్యక్తి ఏమరపాటుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ బైకు వేగంగా వస్తోంది. బైక్ సమీపించడంతో పాదచారి పరుగెత్తుకెళ్లాడు. దాంతో బైక్ అతన్ని ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి, బైకర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవండంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను హెల్మెట్ ధరించి ఉంటే ఇంత తీవ్రంగా గాయపడేవారు కాదంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పాదచారి నిర్లక్ష్యం, బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. బైక్ మీద వెళ్తోన్నప్పుడు హెల్మెట్ ధరిచండం ఎంత ముఖ్యమో.. ప్రయాణం చేసేటప్పుడు చుట్టు పక్కల గమనించడం కూడా అంతే ముఖ్యమని.. లేదంటే మీతో పాటు మీ కుటుంబాలు కూడా బాధపడతాయంటూ ట్రాఫిక్ పోలీసులు మరో సారి హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం జీడిమెట్ల చింతల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్ ‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండా? -
జీడిమెట్ల చింతల్లో రోడ్డు ప్రమాదం